Tabble of Content |
భారతదేశంలో పులుల జనాభా:
- భారతదేశంలో పులులను లెక్కించే బాధ్యతను వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII) భాగస్వామ్యంతో నేషనల్ కన్జర్వేషన్ అథారిటి ఆఫ్ ఇండియా (NTCA) నిర్వహిస్తుంది.
- భారతదేశంలో పులుల జనాభా లెక్కలను 2006నుంచి ప్రతి నాలుగేళ్లకొకసారి విడుదల చేస్తున్నారు.
- Website: www.ntca.gov.in
క్ర.సం | సంవత్సరం | పులుల సంఖ్య |
---|---|---|
1 | 2006 | 1411 |
2 | 2010 | 1706 |
3 | 2014 | 2226 |
4 | 2018 | 2967 |
5 | 2022 | 3167 |
Status of Tigers 2022:
- ఇవి ఐదో పులుల జనాభా లెక్కలు.
- వీటిని కర్ణాటకలోని మైసూరులో భారత ప్రధాని నరేంద్ర మోదీ 9 ఏప్రిల్ 2023న 'Status of Tigers-2022' పేరిట విడుదల చేశారు.
- ఈ లెక్కల ప్రకారం, 2022లో దేశంలో మొత్తం పులుల సంఖ్య ⇒3167
- ఈసారి పులుల జాబితాను రాష్ట్రాలవారీగా ఇవ్వలేదు.
- పులుల ఆవాసాలు కలిగిన 20 రాష్ట్రాలను ఐదు ప్రాంతాలుగా విభజించి... ఆ ఐదు ప్రాంతాలవారిగా పులుల జాబితాను విడుదల చేశారు.
- 2018లో విడుదల చేసిన గణనలో మధ్యప్రదేశ్ లో అత్యధికంగా 526 పులులు ఉండగా, కర్ణాటకలో 524, ఉత్తరాఖండ్ లో 442 ఉన్నాయి.
- Download 'Status of Tigers-2022' Report (PDF)
# | 2022 | 2018 |
---|---|---|
మొత్తం పులుల సంఖ్య | 3167 | 2967 |
వృద్ధిరేటు | 6.7% (2018-2022 మధ్య) |
33% (2014-2018 మధ్య) |
మొత్తం అడుగుల సర్వే | 6,41,449 | 5,22,996 |
మొత్తం మ్యాన్-డేస్ | 6,41,102 | 5,93,882 |
మొత్తం కెమెరాలు | 32,588 | 26,838 |
తీసిన ఫోటోలు | 4,70,81,881 | 3,48,58,623 |
పులుల ఫోటోలు | 97,399 | 76,651 |
కెమెరాకు చిక్కిన పులుల సంఖ్య | 3080 | 2461 |
ప్రాంతాల వారీగా కెమెరా ట్రాప్ లో చిక్కిన పులుల సంఖ్య | ||
---|---|---|
1 | మధ్యభారతం, తూర్పు కనుమలు | 1161 |
2 | శివాలిక్ పర్వత సానువులు, గంగా మైదానం | 804 |
3 | పశ్చిమ కనుమలు | 824 |
4 | ఈశాన్య పర్వతాలు, బ్రహ్మపుత్ర మైదానం | 194 |
5 | సుందర్బన్స్ | 100 |
మొత్తం | 3080 |
*ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మధ్య భారతం, తూర్పు కనుమల పరిధిలోకి వస్తాయి.