Thursday, April 20, 2023

Interesting Facts about Tiger in Telugu | పులి గురించి ఆసక్తికరమైన విషయాలు | Student Soula

Interesting Facts About Tiger in Telugu | పులి గురించి ఆసక్తికరమైన విషయాలు | Student Soula



Tabble of Content


పులి (Tiger):
  • పులి యొక్క శాస్త్రీయ నామం  పాంథెర టైగ్రిస్
  • ఇది ఫెలిడే (Felide) కుటుంబంలో కెల్లా అతి పెద్ద జాతి
  • ఫెలిడే అనేది అన్ని రకాల పిల్లులను (Cats) కలిగి ఉన్న క్షీరదాల యొక్క జీవసంబంధమైన కుటుంబం.
  • ఇది ఆహారపు గొలుసులో శీర్షభాగాన ఉండే వేటాడే జంతువులలో ఒకటి.
  • ప్రతీ పులికి వాటి శరీరం మీద ఉన్న నల్లని చారలు వేర్వేరుగా ఉంటాయి. మనుషుల్లో ఏ ఇద్దరికీ ఒకేలాంటి వేలి ముద్రలు ఉండనట్టే ఏ రెండు పులులకు ఒకే రకమైన చారలు ఉండవు.
  • పులులలో ముఖ్యమైన ఉపజాతులు: బెంగాల్ టైగర్, ఇండో చైనీస్ టైగర్, మలయన్ టైగర్, సైబీరియన్ టైగర్, సౌత్ చైనా టైగర్, సుమత్రన్ టైగర్.
  • ఇవి గరిష్ఠంగా 25 సంవత్సరాల వరకు జీవిస్తాయి. పులి యొక్క జీవిత కాలం వాటి నివాసం, ఆహారం, ఆరోగ్యం వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది.
  • మగ పులులు 200 కిలోల వరకు, ఆడ పులులు 170 కిలోల వరకు బరవు పెరుగుతాయి.
  • మగ పులులు 4 మీటర్లు, ఆడ పులులు 3 మీటర్ల వరకు పొడవు ఉంటాయి.
  • సగటున పులులు ప్రతి రెండు సంవత్సరాలకు రెండు నుండి నాలుగు పిల్లలకు జన్మనిస్తాయి.
  • చాలా పులులు పిల్లలుగా ఉన్నప్పుడే చనిపోతాయి. 
  • పులులు పుట్టాక ఎక్కువ కాలం తమ తల్లిదండ్రులపై ఆధారపడవు. రెండేళ్ల వయసు రాగానే విడిగా వెళ్లిపోతాయి.
  • మగ పులులు 4-5 ఏళ్ల తర్వాత, ఆడ పులులు 3-4 ఏళ్ల తర్వాత లైంగిక పరిపక్వతను (Sexual Maturity) పొందుతాయి.
  • ఇది నీటిలో కూడా బాగా ఈదగలవు.
  • ఇవి ఒకేసారి 36 కిలోల కంటే ఎక్కువ మాంసాన్ని తినగలవు.
  • పులి గర్జన 3 కిలోమీటర్ల వరకు వినబడుతుంది.
  • పులులు సింహాలుగా గుంపులుగా కాకుండా విడివిడిగా జీవిస్తాయి.
  • పులులు ఒక ప్రాంతాన్ని ఎంచుకుని, అందులోకి మరో పులిని రానివ్వవు.
  • పులుల సగటు పరుగు వేగం గంటకు 56-64 కిలోమీటర్లు. అయితే ఇవి ఎక్కువ దూరం ఈ వేగాన్ని కొనసాగించలేవు.
  • రాత్రుల్లో పులుల కంటిచూపు, మనుషుల కంటిచూపు కంటే ఆరు రెట్లు అధికంగా ఉంటుంది. ఇవి పగటి వేళ కంటే రాత్రివేళ బాగా వేటాడగలవు.
  • ఇవి సాధారణంగా ఒంటరిగా వేటాడతాయి.
  • వేట సమయంలో ఇవి వాసన కంటే దృష్టి మరియు వినికిడిపై ఎక్కువగా ఆధారపడతాయి.

పులులు ఎందుకు అవసరం?:
  • "అడవి లేకపోతే పులి చంపబడుతుంది. పులి లేకపోతే అడవి నాశనమవుతుంది. అందుకే పులి అడవిని రక్షిస్తుంది మరియు అడవి పులిని కాపాడుతుంది మహాభారతంలోని ఉద్యోగ పర్వం.
  • పులులు పర్యావరణ వ్యవస్థ యొక్క సమతుల్యతను కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. గడ్డి, ఆకులను తిని పర్యావరణంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే శాకాహార జంతువులను నియంత్రించడంలో పులులు సహాయపడతాయి.
  • పులులు పర్యావరణ పర్యాటకానికి ఆకర్షణ. దీంతో అక్కడి స్థానికులకు స్థిరమైన ఆదాయ వనరులు సమకూర్చడంలో సహాయపడతాయి.
  • పులులకు అనేక దేశాల్లో బలమైన సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది. ప్రత్యేకించి ఆసియాలో వాటిని బలం మరియు శక్తికి చిహ్నంగా పరిగణిస్తారు.


పులులు అంతరించిపోవడానికి కారణాలు:
  • పులుల్ని వేటాడటం ఆ తర్వాత వాటి చర్మాలను ఇంట్లోని గోడలకు వేలాడదీయడం మన పూర్వపు రాజులు చేసేవారు. పులిగోర్లను లాకెట్లలో ధరించి మెడలో వేసుకోవడం రాచరికానికి హోదాగా భావించేవారు.
  • పూర్వం చాలామంది పులుల్ని చంపడం లేదా వేటాడటం ద్వారా తమ శక్తి సామర్థ్యాలను చూపించుకునేవారు.
  • పెరిగిన నగరాలు, పట్టణీకరణతో అడవుల విస్తీర్ణం అతివేగంగా గణనీయంగా తగ్గిపోవడం.
  • పులులు మనుగడ సాగించే ఆవాస ప్రాంతం తగ్గిపోవడంతో వాటి మనుగడ దెబ్బ తింటుంది. దీంతో వాటి సంఖ్య రాను రాను తగ్గిపోయింది.
  • పులి చర్మం, ఎముకలు, గోర్లు, వెంట్రుకలు ఇలా దాని శరీరంలోని అన్ని భాగాలకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో వాటిని విశృంఖలంగా వేటాడుతున్నారు.
  • అడవి జంతువులను నిరోదించడానికి అమర్చిన విద్యుత్ వైర్లలో చిక్కుకుని పులులు కూడా చనిపోతున్నాయి.
  • పులులు పశువులను చంపుతున్నాయన్న కోపంతో కొంతమంది పులులకు విషం పెట్టి చంపేస్తున్నారు.
  • మనుషులతో ఘర్షణాత్మక వాతావరణం, అడవుల్లో అగ్నిప్రమాదాలు, గనుల తవ్వకం, మౌలిక వసతుల విస్తరణ మొదలైనవి పులులు అంతరించడానికి కారణాలు.


ఇతర అంశాలు:
  • 1970లో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) పులిని అంతరించిపోతున్న (Endangered) జాతిగా ప్రకటించింది.
  • భారతదేశంలో ప్రాజెక్ట్ టైగర్ ను 1 ఏప్రిల్ 1973న ప్రారంభించారు.
  • జాతీయ పులుల సంరక్షణ, సాధికార సంస్థ (National Tiger Conservation Authority-NTCA)ను 2005లో వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 క్రింద స్థాపించబడింది.
  • ప్రపంచంలోని 70 శాతం పులులు భారతదేశంలోనే ఉన్నాయి.
  • భారతదేశం యొక్క జాతీయ జంతువు రాయల్ బెంగాల్ టైగర్ (1973 ఏప్రిల్)
  • అంతర్జాతీయ పులుల దినోత్సవం (International Tiger Day)జులై 29


No comments:

Post a Comment