Saturday, April 8, 2023

International Boxing Association Telugu | ఇంటర్ నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ (IBA)

History of International Boxing Association in Telugu | ఇంటర్ నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ (IBA) | Student Soula


ఇంటర్ నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ (IBA):
  • ఇది అంతర్జాతీయ స్థాయిలో ఔత్సాహిక (Amateur) బాక్సింగ్ ను నిర్వహించే పాలక మండలి. 
  • ఇది బాక్సింగ్ కోసం నియమాలను మరియు నిబంధనలను రూపొందిస్తుంది మరియు అమలు చేస్తుంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా బాక్సింగ్ క్రీడను ప్రోత్సాహించడం, మద్ధతు ఇవ్వడం మరియు నిర్వహించడం చేస్తుంది.
  • 1920లో International Amateur Boxing Federation (FIBA) ఏర్పడింది.
  • 1946లో FIBA ను రద్దు చేసి, దాని స్థానంలో Amateur International Boxing Association (AIBA) స్థాపించబడింది. దీని మొదటి అధ్యక్షుడు ⇒ Émile Grémaux
  • 1974లో మొదటి పురుషుల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ పోటీలు హవానా (CUBA)లో జరిగాయి.
  • 2001లో మొదటి మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ పోటీలు స్క్రాన్టన్‌లో (USA)లో జరిగాయి.
  • 2007లో దీని పేరును International Boxing Association గా మార్చారు. కానీ AIBA అనే సంక్షిప్త పేరు అలాగే ఉండాలని నిర్ణయించారు. 
  • 2021 డిసెంబర్ లో AIBA అనే దీని సంక్షిప్త పేరును IBA గా మార్చారు.
  • స్థాపన ⇒ 1946
  • ప్రధాన కార్యాలయం ⇒ లౌసన్నే (స్విట్జర్లాండ్)
  • Website: www.iba.sport
  • ఇది నిర్వహించే ప్రధాన అంతర్జాతీయ బాక్సింగ్ పోటీలు

ఇతర అంశాలు:
  • అంతర్జాతీయ బాక్సింగ్ దినోత్సవం ⇒ ఆగస్టు 27


No comments:

Post a Comment