Banner 160x300

History of Boxing in Telugu | బాక్సింగ్ చరిత్ర

History of Boxing and IBA in Telugu | బాక్సింగ్ చరిత్ర | Student Soula


బాక్సింగ్ (Boxing):
  • బాక్సింగ్ అనేది ఒక పోరాట క్రీడ.
  • ఇందులో ఇద్దరు యోధులు తమ ప్రత్యర్థిని పడగొట్టడం లేదా న్యాయ నిర్ణేతల నిర్ణయం ఆధారంగా వారిని ఔట్ స్కోర్ చేయడం అనే లక్ష్యంతో ఒకరినోకరు పిడిలికిని ఉపయోగించి రింగ్ లో పోటీపడతారు.

బాక్సింగ్ చరిత్ర:
  • క్రీ.పూ.3000 లో పురాతన ఈజిప్టులో బాక్సింగ్ ఒక అభ్యాసంగా ఉండేది.
  • క్రీ.పూ.688 లో ఒలింపియాలోని 23వ ఒలింపియాడ్ లో  బాక్సింగ్ ప్రవేశపెట్టబడింది. ఇందులో స్మిర్నాకు చెందిన ఒనో మాస్టోస్ మొదటి ఒలింపిక్ బాక్సింగ్ ఛాంపియన్ అయ్యాడు.
  • 1743లో జాక్ బ్రౌటన్ ముఖ్యంగా బాక్సింగ్ లో మరణాలను తగ్గించడానికి మొదటిసారిగా బాక్సింగ్ నియమాలను పరిచయం చేశాడు. ఇది మనకు తెలిసిన ఆధునిక బాక్సింగ్ యొక్క ప్రారంభం అని అర్థం చేసుకోవచ్చు. బాక్సింగ్ గ్లోవ్ యొక్క ఆధునిక శైలి కూడా అతని ఆలోచనే.
  • మార్క్వెస్ ఆఫ్ క్వీన్స్‌బెర్రీ నియమాలు బాక్సింగ్ మ్యాచ్‌లను నియంత్రించడానికి 1867లలో తీసుకువచ్చారు. ఈ నియమాలు బాక్సింగ్‌ను సురక్షితమైన మరియు మరింత నియంత్రిత క్రీడగా మార్చడానికి సహాయపడ్డాయి మరియు వాటిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాక్సింగ్ సంస్థలు విస్తృతంగా స్వీకరించాయి. ముఖ్యంగా గ్లౌజ్‌ల వాడకం క్రీడలో తీవ్రమైన గాయాలను తగ్గించడంలో సహాయపడింది.
  • 1904లో సెయింట్ లూయిస్ (అమెరికా) లో జరిగిన ఆధునిక ఒలింపిక్ క్రీడలలో మొదటిసారిగా బాక్సింగ్ పోటీలను నిర్వహించారు.

ఇంటర్ నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ (IBA):
  • ఇది అంతర్జాతీయ స్థాయిలో ఔత్సాహిక (Amateur) బాక్సింగ్ ను నిర్వహించే పాలక మండలి. 
  • ఇది బాక్సింగ్ కోసం నియమాలను మరియు నిబంధనలను రూపొందిస్తుంది మరియు అమలు చేస్తుంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా బాక్సింగ్ క్రీడను ప్రోత్సాహించడం, మద్ధతు ఇవ్వడం మరియు నిర్వహించడం చేస్తుంది.
  • 1920లో International Amateur Boxing Federation (FIBA) ఏర్పడింది.
  • 1946లో FIBA ను రద్దు చేసి, దాని స్థానంలో Amateur International Boxing Association (AIBA) స్థాపించబడింది. దీని మొదటి అధ్యక్షుడు ⇒ Émile Grémaux
  • 1974లో మొదటి పురుషుల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ పోటీలు హవానా (CUBA)లో జరిగాయి.
  • 2001లో మొదటి మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ పోటీలు స్క్రాన్టన్‌లో (USA)లో జరిగాయి.
  • 2007లో దీని పేరును International Boxing Association గా మార్చారు. కానీ AIBA అనే సంక్షిప్త పేరు అలాగే ఉండాలని నిర్ణయించారు. 
  • 2021 డిసెంబర్ లో AIBA అనే దీని సంక్షిప్త పేరును IBA గా మార్చారు.
  • స్థాపన ⇒ 1946
  • ప్రధాన కార్యాలయం ⇒ లౌసన్నే (స్విట్జర్లాండ్)
  • Website: www.iba.sport
  • ఇది నిర్వహించే ప్రధాన అంతర్జాతీయ బాక్సింగ్ పోటీలు

ఇతర అంశాలు:
  • అంతర్జాతీయ బాక్సింగ్ దినోత్సవం ⇒ ఆగస్టు 27