International Year of Millets 2023 in Telugu | అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం

International Year of Millets 2023 in Telugu | అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం International Year of Millets 2023 In Telugu, History of International Year of Millets 2023 In Telugu, about International Year of Millets 2023 In Telugu, celebration of International Year of Millets 2023 In Telugu, article on International Year of Millets 2023 In Telugu, explain International Year of Millets 2023 In Telugu, national Year of Millets 2018 In Telugu, student soula, antharjatheeya chirudanyala samvatsaram,
International Year of Millets 2023 in Telugu |
అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం


International Year of Millets - 2023
అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం
****

  • భారత ప్రతిపాదన మేరకు ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (75వ సెషన్) 2023వ సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం (International Year of Millets) గా 5 మార్చి 2021 లో ప్రకటించింది. భారత ప్రతిపాదనను 72 దేశాలు బలపరచాయి.
  • ఇటలీ రాజధాని రోమ్ లోగల ఐక్యరాజ్యసమితి ఆహార-వ్యవసాయ సంస్థ (FAO) ప్రధాన కార్యాలయంలో 6 డిసెంబర్ 2022న అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం ప్రారంభోత్సవం జరిగింది.
  • వ్యవసాయంలో చిరుధాన్యాల సాగును ప్రోత్సాహించడం మరియు వాటి పోషక మరియు ఆరోగ్య ప్రయోజనాలపై ప్రపంపవ్యాప్తంగా అవగాహన పెంచడానికి ఈ ప్రత్యేక సంవత్సరం తోడ్పడుతుంది.
  • చిరుధాన్యాలను భారతీయ వంటకాల్లో అనాదిగా ఉపయోగిస్తున్నారు. అయితే ఆహార భద్రతకు ఉద్దేశించిన 1960 ల నాటి హరిత విప్లవం వీటి ప్రాముఖ్యాన్ని తగ్గించింది. కాలక్రమంలో చిరుధాన్యాలపై మనకు శ్రద్ధ తగ్గి, అది మన ఆహారం నుంచి అదృశ్యమైంది. ఫలితంగా చిరుధాన్యాల సాగు కూడా క్షీణించింది. హరిత విప్లవానికి ముందు మొత్తం తృణధాన్య (Cereals) పంటల్లో చిరుధాన్యాల వాటా 40 శాతంగా ఉండేది. తర్వాతి కాలంలో పప్పుధాన్యాలు, నూనె గింజలు, మొక్కజొన్న వంటి వాణిజ్య పంటలపై దృష్టి మళ్లడంతో చిరుధాన్యాల సాగు సుమారు 20 శాతానికి తగ్గిపోయింది. 

తృణధాన్యాలు (Cereals):

  • తినదగిన భాగాల కోసం పండించే ఏదైనా ధాన్యం మరియు గడ్డితో కూడిన వాటిని తృణధాన్యాలు అంటారు. వీటిలో వరి, గోధుమ, రై, వోట్స్, బార్లీ మొదలైన ఆహార పంటలు ఉన్నాయి.

చిరుధాన్యాలు (Millets):

  • ఆహార ధాన్యాలలో చిన్న గింజ కలిగిన గడ్డి జాతి పంటలను చిరుధాన్యాల పంటలు అంటారు. వీటిలో జొన్న (Jowar), సజ్జ (Pearl), రాగి (Ragi), సామ (Kutki), ఊదలు (Sanwa), కొర్ర (Foxtail), వరిగ (Chena), అరికె (Kodo), తదితర చిరుధాన్యాలున్నాయి. 
  • ఆహారం, పశుగ్రాసంగానే కాకుండా జీవ ఇంధనం, మద్యం తయారీలోనూ వీటిని ఉపయోగిస్తారు.
  • ఇవి క్లిష్టమైన వాతావరణాన్ని తట్టుకోగలవు మరియు నీరు తక్కువగా అందే మెట్ట ప్రాంతాలలో పండి, పేద దేశాల ప్రజల ఆహారపు అవసరాలను తీరుస్తాయి.
  • వీటిని ముతక ధాన్యాలు (Coarse Grain) అని కూడా అంటారు.
  • రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం తక్కవ కాబట్టి, వీటి సాగును సేంద్రియ వ్యవసాయంగా పిలవచ్చు.
  • సర్వసాధారణంగా అన్ని ప్రాంతాల్లోనూ పండించే 9 రకాల చిరుధాన్యాలను భారతదేశంలోనూ సాగు చేస్తారు.
చిరుధాన్యాల పేర్లు తెలుగులో |
Millets Names in English to Telugu

International Year of Millets 2023 in Telugu | అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం  International Year of Millets 2023 In Telugu, History of International Year of Millets 2023 In Telugu, about International Year of Millets 2023 In Telugu, celebration of International Year of Millets 2023 In Telugu, article on International Year of Millets 2023 In Telugu, explain International Year of Millets 2023 In Telugu, national Year of Millets 2018 In Telugu, student soula, antharjatheeya chirudanyala samvatsaram,
చిరుధాన్యాల ఉపయోగాలు 

గణాంకాలు:
  • 2019 నాటికి ప్రపంచం మొత్తం మీద చిరుధాన్యాల విస్తీర్ణం - 718 లక్షల హెక్టార్లు
  • 2019 నాటికి భారతదేశంలో చిరుధాన్యాల విస్తీర్ణం - 138 లక్షల హెక్టార్లు
  • దేశంలో చిరుధాన్యాల ఉత్పత్తి 2015-16లో 1.45 కోట్ల టన్నులు ఉంటే 2020-21 నాటికి 1.8 కోట్ల టన్నులు పెరిగింది. (ఆసియాలో 80%, ప్రపంచంలో 20%)
  • 2021-22 నాటికి భారత్ లో ప్రధాన చిరుధాన్య పంటలు సజ్జ (60%), జొన్న (27%), రాగి (11%), గంటిసజ్జ (2%).
ఇతర ముఖ్యమైన అంశాలు: