Dr. Zakir Hussain Biography In Telugu | డాక్టర్ జాకీర్ హుస్సేన్ జీవిత చరిత్ర |
Dr. Zakir Hussain Biography
డాక్టర్ జాకీర్ హుస్సేన్ జీవిత చరిత్ర
****
- పేరు: జాకీర్ హుస్సేన్
- పూర్తి పేరు: జాకీర్ హుస్సేన్ ఖాన్
- జననం: 8 ఫిబ్రవరి 1897
- జన్మస్థలం: హైదరాబాద్ (తెలంగాణ)
- తల్లిదండ్రులు: నజ్నిన్ బేగం, ఫిదా హుస్సేన్ ఖాన్
- భార్య: షాజహాన్ బేగం (వివాహం-1915)
- పిల్లలు: సయీదా ఖాన్, సఫియా రెహమాన్ (ఇద్దరు కుమార్తెలు)
- మరణం: 3 మే 1969, న్యూఢిల్లీ (గుండెపోటు)
- ఖననం: న్యూఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటి క్యాంపస్ లో
- జాకీర్ హుస్సేన్ కుటుంబం ఉత్తరప్రదేశ్ లోని కైమ్ గంజ్ ప్రాంతానికి చెందినవాళ్ళు. హుస్సేన్ తండ్రి న్యాయవాది వృత్తి కోసం కుటుంబంతో సహా 1892లో హైదరాబాదుకు వచ్చి స్థిరపడ్డాడు.
- హుస్సేన్ ప్రాథమిక విద్యాభ్యాసం హైదరాబాద్ లోని సుల్తాన్ బజార్ పాఠశాలలో జరిగింది.
- 1907: హుస్సేన్ వాళ్ళ నాన్న మరణించడంలతో వీరి కుటుంబం తిరిగి కైమ్ గంజ్ (ఉత్తరప్రదేశ్) కు వెళ్లి స్థిరపడ్డారు.
- ఇతను ఇటావాలోని ఇస్లామిమా హైస్కూల్ లో చేరాడు.
- 1911: ప్లేగ్ వ్యాధి బారినపడి ఈయన తల్లి మరియు మరికొంత మంది కుటుంబ సభ్యులు మరణించారు.
- 1913: అలీఘర్ లోని మహమ్మదన్ ఆంగ్లో-ఓరియంటల్ కాలేజీలో చేరాడు.
- 1918: తత్వశాస్త్రం, ఆంగ్ల సాహిత్యం, ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు.
- 1920: మాస్టర్ డిగ్రీ (M.A) పొందాడు మరియు అదే కళాశాలలో లెక్చరర్ గా నియమించబడ్డాడు.
- 1922: బెర్లిన్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ (Ph.D) చేయడానికి జర్మనీకి వెళ్ళాడు.
- 1926: బెర్లిన్ (జర్మని) నుండి భారత్ కు తిరిగి వచ్చాడు.
- జామియా మిలియా ఇస్లామియా, న్యూఢిల్లీ (1926-1948), అలీఘర్ ముస్లీం విశ్వవిద్యాలయం, ఉత్తరప్రదేశ్ (1948-1956) లకు వైస్-ఛాన్సలర్ గా పనిచేశారు.
- Basic National Education Committee/ జాకీర్ హుస్సేన్ కమిటి (1937), International Students Service, India Committee (1955), World University Service, Geneva (1955-57), Central Board of Secondary Education (1952-1957) లకు చైర్మన్ గా పనిచేశారు.
- హిందుస్తానీ తాలిమి సంఘ్ సేవాగ్రమ్ కు అధ్యక్షుడిగా (1938-50) పనిచేశారు.
- UNESCO ఎగ్జిక్యూటివ్ బోర్డులో (1957-58) పనిచేశారు.
- రాజ్యసభకు నామినేట్ చేయబడ్డారు (1952-1956).
- 1956లో రెండోసారి కూడా రాజ్యసభకు నామినేట్ అయ్యారు. బిహార్ గవర్నర్ గా నియమించడంతో రాజ్యసభకు రాజీనామా చేశారు.
- బిహార్ 4వ గవర్నర్ గా (1957-1962) పనిచేశారు.
2వ భారత ఉప రాష్ట్రపతి (1962-1967):
- ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టి అభ్యర్థిగా పోటి చేశారు.
- 13 మే 1962 న ఉప రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. 13 మే 1967 వరకు ఉప రాష్ట్రపతిగా ఉన్నారు.
- 1965లో అప్పటి రాష్ట్రపతిగా ఉన్న రాధాకృష్ణన్ కంటి శుక్ల చికిత్స చేయించుకోవడానికి ఇంగ్లాండ్ కు వెళ్ళినప్పుడు, ఈయన కొంత కాలం తాత్కాలిక రాష్ట్రపతిగా ఉన్నారు.
3వ భారత రాష్ట్రపతి (1967-1969):
- రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టి తరుపున ఈయన పోటి చేయగా, ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థిగా తెలుగు వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ మరియు సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన కోకా సుబ్బారావు పోటి చేశారు.
- 13 మే 1967న ప్రమాణ స్వీకారం చేశారు. 3 మే 1969 వరకు (మరణించే వరకు) రాష్ట్రపతిగా కొనసాగారు.
ఇతర ముఖ్యమైన అంశాలు:
- "మొత్తం భారతదేశం నా ఇల్లు, ప్రజలందరూ నా కుంటుంబం" అన్నారు.
- ఈయన భారతదేశానికి మొట్టమొదటి ముస్లిం రాష్ట్రపతి.
- ఈయన 1954లో పద్మవిభూషణ్, 1963లో భారతరత్న పురస్కారాలను అందుకున్నారు.
- రాష్ట్రపతి పదవిలో ఉండగా మరణించిన మొదటి వ్యక్తి (రెండవ వ్యక్తి - ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్).
- అత్యల్ప కాలం రాష్ట్రపతి పదవి నిర్వహించిన మొదటి వ్యక్తి.
- చండీఘఢ్ లోని గులాబి తోటకు ఈయన పేరు పెట్టారు (Zakir Hussain Rose Garden). ఇది ఆసియాలోనే అతిపెద్ద గులాబి తోట.
- ఇండియన్ పోస్ట్ ఈయన స్మారకార్థం 1969 మరియు 1998 లలో తపాలా స్టాంపులు విడుదల చేసింది.