History of World Athletics Day in Telugu | ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం |
ప్రపంచ అథ్లెటిక్స్
దినోత్సవం - మే నెలలో
ఉద్దేశ్యం:
క్రీడల పట్ల ప్రజలలో అవగాహన పెంచడం మరియు క్రీడల యొక్క ప్రాముఖ్యత గురించి యువతకు అవగాహన కల్పించడం ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం (World Athletics Day) ముఖ్య ఉద్దేశ్యం.
ఎప్పటి నుంచి?
- 1996 నుంచి ప్రతి సంవత్సరం మే నెలలో ప్రపంచ ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.
- మొదటి ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవాన్ని అప్పటి అంతర్జాతీయ అమెచ్యూర్ అథ్లెటిక్ ఫెడరేషన్ (IAAF) అధ్యక్షుడైన ప్రిమో నెబియోలో (Primo Nebiolo) ప్రారంభించారు.
- ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే నెలలో ఏ తేదీనా జరుపుకోవాలో IAAF (World Athletics) నిర్ణయిస్తుంది.
- 2019, 2020 లో ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం తేది- మే 7
ప్రపంచ అథ్లెటిక్స్ చరిత్ర:
- స్థాపన: 17 జూలై 1912
- ప్రధాన కార్యాలయం: మొనాకో
- స్వీడన్ లోని స్టాక్ హోమ్ లో ఒలింపిక్ క్రీడల ముగింపు వేడుకల తరువాత, 17 జూలై 1912 న స్టాక్ హోమ్ లో అంతర్జాతీయ అమెచ్యూర్ అథ్లెటిక్ ఫెడరేషన్ (IAAF) ట్రాక్ మరియు ఫీల్డ్ అథ్లెటిక్స్ క్రీడల కోసం ప్రపంచ పాలక సంస్థగా స్థాపించబడింది.
- IAAF పేరు కాలక్రమేణ మారుతూ వచ్చింది. దీని పేరు 1912 లో అంతర్జాతీయ అమెచ్యూర్ అథ్లెటిక్ ఫెడరేషన్ (IAAF- International Amateur Athletic Federation), 2001 లో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్స్ (IAAF- International Association of Athletics Federations), 2019 లో వరల్డ్ అథ్లెటిక్స్ (World Athletics) గా మారింది.
- అలాగే, దీని ప్రధాన కార్యాలయం కూడా మారుతూ వచ్చింది. దీని ప్రధాన కార్యాలయం స్టాక్ హోమ్ లో 1912 నుండి 1946 వరకు , లండన్ లో 1946 నుండి 1993 వరకు ఉంది, ఆ తరువాత మొనాకో లోని ప్రస్తుత స్థానానికి మారింది.
- క్రీడల యొక్క ప్రాముఖ్యత గురించి ఈ తరానికి అవగాహన కల్పించండి. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి, శారీరక దృఢత్వంపై ప్రజలకు అవగాహన కలిగించడం. పాఠశాలలు మరియు సంస్థలలో అథ్లెటిక్స్ ను ప్రాథమిక క్రీడగా ప్రోత్సహించడం. ప్రపంచవ్యాప్తంగా పాఠశాలల్లో అథ్లెటిక్స్ ను పాల్గొనే క్రీడలో నంబర్ వన్ చేయడం ప్రపంచ అథ్లెటిక్స్ లక్ష్యాలు.
- World Athletics Official Website- www.worldathletics.org
అథ్లెటిక్స్ (Athletics):
అథ్లెటిక్స్ అనేది పోటీ పరుగులు (Running), జంపింగ్ (Jumping), విసిరేయడం (Throwing) మరియు నడక (Walking) వంటి క్రీడా కార్యక్రమాల సమూహం.
అథ్లెటిక్స్ పోటీలలో చాలా సాధారణమైనవి ట్రాక్ అండ్ ఫీల్డ్, రోడ్ రన్నింగ్, రేస్ వాకింగ్, క్రాస్ కంట్రీ రన్నింగ్, పర్వత పరుగు, మరియు ట్రైల్ రన్నింగ్. వరల్డ్ అథ్లెటిక్స్, క్రీడా పాలక మండలి ఈ ఆరు విభాగాలలో అథ్లెటిక్స్ ను నిర్వచిస్తుంది.
మరికొన్ని అంశాలు:
- అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (AFI- Athletics Federation of India) 1946 లో ఏర్పడింది. ఇది జాతీయ ఛాంపియన్ షిప్ లను నిర్వహిస్తుంది మరియు భారత అథ్లెటిక్స్ కోసం శిక్షణను ఏర్పాటు చేస్తుంది.
వీటిని కూడా చూడండీ: