History of World Asthma Day in Telugu | ప్రపంచ ఉబ్బసం (ఆస్తమా) దినోత్సవం |
ప్రపంచ ఉబ్బసం (ఆస్తమా)
దినోత్సవం - మే మొదటి మంగళవారం
ఉద్దేశ్యం:
ఉబ్బసం (Asthma) వ్యాధి పట్ల ప్రజలలో అవగాహన పెంచి ఉబ్బసం ను అదుపులోకి తీసుకురావడం మరియు ఉబ్బసం బారిన పడిన వారికి అవగాహన, సంరక్షణ, మద్దతు పెంచడం ప్రపంచ ఉబ్బసం దినోత్సవం (World Asthma Day) ముఖ్య ఉద్దేశ్యం.
ఎప్పటి నుంచి?
1998 నుంచి ప్రతి సంవత్సరం మే మొదటి మంగళవారం ప్రపంచ ఉబ్బసం దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.
1998 లో స్పెయిన్లోని బార్సిలోనాలో జరిగిన మొదటి ప్రపంచ ఆస్తమా సమావేశంతో కలిసి 35 కి పైగా దేశాలలో మొదటి ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని జరుపుకున్నారు.
ప్రపంచ ఉబ్బసం దినోత్సవాన్ని గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా (GINA- Global Initiative for Asthma) నిర్వహిస్తుంది.
GINA:
- స్థాపన: 1993
- ఉబ్బసం వ్యాప్తి, అనారోగ్యం మరియు మరణాలను తగ్గించడానికి ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ నిపుణులు మరియు ప్రజారోగ్య అధికారులతో కలిసి పనిచేస్తుంది.
- ఉబ్బసం నిర్వహణ కోసం సాక్ష్యం ఆధారిత వ్యూహ పత్రాలు మరియు ప్రపంచ ఉబ్బసం దినోత్సవం యొక్క వార్షిక వేడుక వంటి సంఘటనల ద్వారా, ప్రపంచంలోని ప్రతి మూలలో ఉబ్బసంతో బాధపడుతున్న ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి GINA (Global Initiative for Asthma) కృషి చేస్తోంది.
- ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ బృందాలు మరియు ఆస్తమా అధ్యాపకుల సహకారంతో మే మొదటి మంగళవారం జరిగే ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని GINA నిర్వహిస్తుంది.
- GINA ప్రతి సంవత్సరం ఒక థీమ్ ను ఎంచుకుంటుంది మరియు ప్రపంచ ఉబ్బసం దినోత్సవ పదార్థాలు, వనరుల తయారీ మరియు పంపిణీని సమన్వయం చేస్తుంది.
- GINA Official Website- www.ginasthma.org
థీమ్ (Theme):
- 2020: Enough Asthma Deaths
- 2019: STOP for Asthma
- 2012: You Can Control Your Asthma (మీరు మీ ఆస్తమాను నియంత్రించవచ్చు)
ఉబ్బసం (Asthma):
- ఉబ్బసం అనేది శ్వాసమార్గాలు కుదించుకుపోవడం వల్ల ఊపిరితిత్తులలో సమస్యలకి కారణమయ్యే దీర్ఘకాలిక వ్యాధి.
- శరీరానికి, ఊపిరితిత్తులకు సరిపడని సూక్ష్మపదార్థాలు గాలి ద్వారా లేక ఆహారం ద్వారా శ్వాసనాళాలలోకి ప్రవేశించినపుడు వాటికి ప్రతిచర్యగా శరీరం స్పందిస్తుంది. దీనివల్ల వివిధ రకాలైన రసాయనాలు శ్వాసవ్వవస్థలో విడుదలై శ్వాసనాళాలు కుచించుకుపోయేలా చేస్తాయి. దీనివల్ల ఊపిరితీసుకోవడం కష్టమవుతుంది.
- కలుషిత వాతావరణం మరియు ఆహారపు జాగ్రత్తల అలవాట్లలో మార్పు రావడం, జీవన విధానం మారిపోవడం వంటి కారణాల వల్ల చిన్న వయస్సు కలవారి నుంచి పెద్దవారి వరకూ ఎప్పుడైనా, ఎవరికైనా సంక్రమిస్తుంది. ఇది వంశ పారంపర్యంగా కూడా వస్తుంది.
- ఉబ్బసం వ్యాధిని పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు కానీ దాని లక్షణాలను నియంత్రించి ఉబ్బస రోగులను పూర్తి జీవనం జీవించేలా చేయవచ్చు. ఇది అంటు వ్యాధి కాదు.
- Global Asthma Report-2018 (Download PDF)
ఉబ్బసం లక్షణాలు:
ఆస్తమా జబ్బుతో బాధపడుతున్నవారు అతి కష్టం మీద ఊపిరి తీసుకోవాల్సి వస్తుంది. వీరికి దగ్గు కూడా వస్తుంది. దగ్గు వచ్చేది కూడా సాధారణమైన దగ్గు కాదు. గళ్ళతో కూడిన దగ్గు. ఆయాసం, శ్వాసలో గురక మరియు ఛాతీ బిగుతుగా ఉన్న భావన కూడా ఉబ్బసం యొక్క లక్షణాలలో ప్రధానమైనవి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- అలర్జీ కారకాలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి.
- ధూమపానంకు దూరంగా ఉండటం.
- దుప్పట్లు, పిల్లో కవర్లను వేడి నీటిలో శుభ్రంగా ఉతకడం. తివాచీలు (Carpets) వాడకుండా ఉండటం.
- దుమ్ము, ధూళి ఉన్న చోటుకి వెళ్లకుండా ఉండటం. పాతపుస్తకాలు, పేపర్లజోలికి వెళ్లకపోవడం. ఇంట్లో బూజు దులపడం వంటివి ఆస్తమా ఉన్నవారు చేయకూడదు.
- ఇల్లు ఊడవడానికి బదులుగా తడిగుడ్డతో తుడవడం.
- పెంపుడు జంతువులకు సాధ్యమైనంత దూరంగా ఉండటం.
- పుప్పొడి రేణువులు గాలిలో ఎక్కువగా ఉండే కాలంలో ఇంట్లోనే గడపడం.
- శీతలపానీయాలు, ఐస్ క్రీములు, ఫ్రిజ్ వాటర్ ను తీసుకోకుండా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆస్తమా బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
ఇన్హేలర్ (Inhaler):
ఒక వ్యక్తి యొక్క శ్వాస ద్వారా ఊపిరితిత్తులలోకి మందులను/ ఔషధాలను పంపిణీ చేయడానికి ఉపయోగించే వైద్య పరికరం.
ఉబ్బసం మరియు COPD (Chronic Obstructive Pulmonary Disease) తో బాధపడుతున్నవారు దీనిని ఉపయోగిస్తారు.
ఇన్హేలర్ (Inhaler) |
వీటిని కూడా చూడండీ: