Asthma Disease In Telugu | ఉబ్బసం (ఆస్తమా) వ్యాధి

Asthma Disease In Telugu |
ఉబ్బసం (ఆస్తమా) వ్యాధి
Asthma Disease in telugu, History Of Asthma Disease in telugu, Facts About Asthma Disease in telugu, World Asthma Day in telugu, World Asthma day essay in telugu, History of World Asthma Day, about World Asthma Day, Day Celebrations, prapancha Asthma dinotsavam,

ఉబ్బసం (ఆస్తమా)
వ్యాధి

ఉబ్బసం (Asthma):
  • ఉబ్బసం అనేది శ్వాసమార్గాలు కుదించుకుపోవడం వల్ల ఊపిరితిత్తులలో సమస్యలకి కారణమయ్యే దీర్ఘకాలిక వ్యాధి. 
  • శరీరానికి, ఊపిరితిత్తులకు సరిపడని సూక్ష్మపదార్థాలు గాలి ద్వారా లేక ఆహారం ద్వారా శ్వాసనాళాలలోకి ప్రవేశించినపుడు వాటికి ప్రతిచర్యగా శరీరం స్పందిస్తుంది. దీనివల్ల వివిధ రకాలైన రసాయనాలు శ్వాసవ్వవస్థలో విడుదలై శ్వాసనాళాలు కుచించుకుపోయేలా చేస్తాయి. దీనివల్ల ఊపిరితీసుకోవడం కష్టమవుతుంది.
  • కలుషిత వాతావరణం మరియు ఆహారపు జాగ్రత్తల అలవాట్లలో మార్పు రావడం, జీవన విధానం మారిపోవడం వంటి కారణాల వల్ల చిన్న వయస్సు కలవారి నుంచి పెద్దవారి వరకూ ఎప్పుడైనా, ఎవరికైనా సంక్రమిస్తుంది. ఇది వంశ పారంపర్యంగా కూడా వస్తుంది. 
  • ఉబ్బసం వ్యాధిని పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు కానీ దాని లక్షణాలను నియంత్రించి ఉబ్బస రోగులను పూర్తి జీవనం జీవించేలా చేయవచ్చు. ఇది అంటు వ్యాధి కాదు.
  • Global Asthma Report-2018 (Download PDF)

ఉబ్బసం లక్షణాలు:
ఆస్తమా జబ్బుతో బాధపడుతున్నవారు అతి కష్టం మీద ఊపిరి తీసుకోవాల్సి వస్తుంది. వీరికి దగ్గు కూడా వస్తుంది. దగ్గు వచ్చేది కూడా సాధారణమైన దగ్గు కాదు. గళ్ళతో కూడిన దగ్గు. ఆయాసం, శ్వాసలో గురక మరియు ఛాతీ బిగుతుగా ఉన్న భావన కూడా ఉబ్బసం యొక్క లక్షణాలలో ప్రధానమైనవి. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
  • అలర్జీ కారకాలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి.
  • ధూమపానంకు దూరంగా ఉండటం.
  • దుప్పట్లు, పిల్లో కవర్లను వేడి నీటిలో శుభ్రంగా ఉతకడం. తివాచీలు (Carpets) వాడకుండా ఉండటం.
  • దుమ్ము, ధూళి ఉన్న చోటుకి వెళ్లకుండా ఉండటం. పాతపుస్తకాలు, పేపర్లజోలికి వెళ్లకపోవడం. ఇంట్లో బూజు దులపడం వంటివి ఆస్తమా ఉన్నవారు చేయకూడదు.
  • ఇల్లు ఊడవడానికి బదులుగా తడిగుడ్డతో తుడవడం.
  • పెంపుడు జంతువులకు సాధ్యమైనంత దూరంగా ఉండటం.
  • పుప్పొడి రేణువులు గాలిలో ఎక్కువగా ఉండే కాలంలో ఇంట్లోనే గడపడం.
  • శీతలపానీయాలు, ఐస్‌ క్రీములు, ఫ్రిజ్ వాటర్‌ ను తీసుకోకుండా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆస్తమా బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

ఇన్హేలర్ (Inhaler):
ఒక వ్యక్తి యొక్క శ్వాస ద్వారా ఊపిరితిత్తులలోకి మందులను/ ఔషధాలను పంపిణీ చేయడానికి ఉపయోగించే వైద్య పరికరం. 
ఉబ్బసం మరియు COPD (Chronic Obstructive Pulmonary Disease) తో బాధపడుతున్నవారు దీనిని ఉపయోగిస్తారు.
History of World Asthma Day in Telugu | ప్రపంచ ఉబ్బసం (ఆస్తమా) దినోత్సవం
ఇన్హేలర్ (Inhaler)

వీటిని కూడా చూడండీ: