Thalassaemia Disorder In Telugu | తలసేమియా వ్యాధి |
తలసేమియా
వ్యాధి
తలసేమియా (Thalassaemia):
- పుట్టుకతోనే ఎముక మజ్జ నుండి రక్తం, రక్త కణాలు ఏర్పడని వ్యాధి. తల్లిదండ్రుల్లో ఉండే జన్యుపరమైన లోపాల కారణంగా వారసత్వంగా కానీ, జన్యువుల్లో వ్యత్యాసాలు ఉన్నప్పుడు కానీ ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
- తలసేమియా అనే పదం గ్రీకు భాష నుండి వచ్చింది. గ్రీకు భాషలో Thalasso అంటే సముద్రం, Emia అంటే రక్తం. ఈ పదాన్ని మొదట 1932 లో ఉపయోగించారు.
- శరీరమంతా ఆక్సిజన్ ను తీసుకువెళ్ళే ఎర్ర రక్త కణాలలోని పదార్ధం హిమోగ్లోబిన్. తలసేమియా రోగుల్లో శరీరానికి అవసరమైనంత హిమోగ్లోబిన్ ఉత్పత్తి కాదు. ఒకవేళ ఉత్పత్తయినా ఎక్కువకాలం అది నిల్వ ఉండదు. రక్తంలో తగినంత హిమోగ్లోబిన్ లేనప్పుడు ఎర్ర రక్త కణాలు సరిగా పనిచేయవు.
- 2 సంవత్సరాల వయస్సులోపు పిల్లల్లో ఈ వ్యాధి బయటపడుతుంది.
- ఈ వ్యాధి ముఖ్యంగా రెండు రకాలు. (1) ఆల్ఫా తలసేమియా (2) బీటా తలసేమియా.
లక్షణాలు:
- ఎముక వైకల్యాలు (ముఖ్యంగా ముఖంలో)
- రక్తహీనతవల్ల అధిక అలసట మరియు బలహీనత
- శరీర రంగు తేడాగా ఉంటూ, పాలిపోయినట్టుగా మారుతుంది (చర్మం మరియు కళ్ళు పసుపు రంగులో మారడం)
- శారీరక ఎదుగుదల ఉండదు
- తరచుగా అనారోగ్యాలకు గురవుతుంటారు
వీటిని కూడా చూడండీ:
- అంతర్జాతీయ తలసేమియా దినోత్సవం (International Thalassaemia Day)
- వ్యాధులు (Diseases)
- ముఖ్యమైన దినోత్సవాలు (Important Days)