History of National Fire Service Day in Telugu | జాతీయ అగ్నిమాపక దినోత్సవం |
జాతీయ అగ్నిమాపక
దినోత్సవం - ఏప్రిల్ 14
ఉద్దేశ్యం:
అగ్నిమాపక సిబ్బంది త్యాగాలను, విజయాలను, ధైర్యసాహసాలను గుర్తించడం మరియు అగ్నిమాపక శాఖ ద్వారా అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కలిగించి, తద్వారా అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వహించడం జాతీయ అగ్నిమాపక దినోత్సవం (National Fire Service Day) ముఖ్య ఉద్దేశ్యం.
ఏప్రిల్ 14 నే ఎందుకు?
1944 ఏప్రిల్ 14న అప్పటి బాంబే నౌకాశ్రయంలోని విక్టోరియా డాక్ వద్ద ఎస్ఎస్ ఫోర్ట్ స్టికిన్ (SS Fort Stikine) ఓడలో జరిగిన అగ్ని ప్రమాదంలో (1944 Bombay Explosion) వందలాది మంది మృతి చెందారు మరియు అక్కడ అగ్నిని ఆర్పడానికి ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బందిలో 71 మంది ప్రాణాలు కోల్పోయారు.
సహాయక చర్యల సమయంలో ప్రాణాలను అర్పించిన అగ్నిమాపక సిబ్బంది జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 న జాతీయ అగ్నిమాపక దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.
కార్యక్రమాలు:
- ప్రజలకు అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు వారం రోజులపాటు (FSW- Fire Service Week) వివిధ కార్యక్రమాలు రూపొందిస్తారు. ప్రజలలో అగ్ని భద్రత అవగాహనను ప్రచారం చేసే ఉద్దేశ్యంతో నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ (NSC- National Safety Council) 1999 నుండి FSW ప్రచారాన్ని ప్రోత్సహిస్తోంది.
- డ్యూటీలో ఉండగా ప్రాణాలు కోల్పోయిన అగ్నిమాపక దళ సిబ్బందికి దేశంలోని అగ్నిమాపక కేంద్రాల వద్ద నివాళి అర్పించి, గౌరవ సూచకంగా అగ్నిమాపక సిబ్బంది రెండు నిమిషాలపాటు మౌనాన్ని పాటిస్తారు.
- బస్టాండ్, రైల్వేస్టేషన్, పార్కు, పాఠశాలలు, సినిమా థియేటర్లు, ఫంక్షన్ హాల్స్, ఆస్పత్రులు, గ్యాస్ గోడౌన్, పరిశ్రమలలో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తారు.
వీటిని కూడా చూడండీ:
- అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం (International Firefighter’s Day)
- ముఖ్యమైన దినోత్సవాలు (Important Days)