History of International Firefighters Day in Telugu | అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం |
అంతర్జాతీయ అగ్నిమాపక
దినోత్సవం - మే 04
ఉద్దేశ్యం:
అగ్నిమాపక సిబ్బంది త్యాగాలను, విజయాలను, ధైర్యసాహసాలను గుర్తించడం మరియు అగ్నిమాపక శాఖ ద్వారా అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కలిగించి, తద్వారా అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వహించడం అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం (IFFD- International Firefighters Day) ముఖ్య ఉద్దేశ్యం.
ఎప్పటి నుంచి?
1999 నుంచి ప్రతి సంవత్సరం మే 04 వ తేదీన అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.
IFFD చరిత్ర:
- 1998 డిసెంబర్ 2 న ఒక విషాద సంఘటన ఆస్ట్రేలియాను మరియు ప్రపంచాన్ని కదిలించింది. ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాజ్యంలోని మెల్బోర్న్ నగరానికి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న లింటన్ (Linton) వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో మంటలను ఆర్పడానికి 5 మంది (Garry Vredeveldt, Chris Evans, Stuart Davidson, Jason Thomas, and Matthew Armstrong) అగ్నిమాపక సిబ్బంది తమ ట్యాంకర్‌ను నీటితో నింపి మంటల నుండి బయలుదేరినప్పుడు గాలి దిశలో అకస్మాత్తుగా మార్పు రావడంతో ఈ 5 గురు అగ్నిమాపక సిబ్బంది మరణించారు.
- ఈ దురదృష్టకర సంఘటన అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవాన్ని తీసుకురావడానికి ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో స్వచ్చంద లెఫ్టినెంట్ మరియు అగ్నిమాపక సిబ్బంది అయిన జెజె ఎడ్మండ్సన్ (JJ Edmondson) ను ప్రేరేపించింది.
- జెజె ఎడ్మండ్సన్ 1999 జనవరి 4 న ప్రపంచవ్యాప్తంగా ఒక ఇమెయిల్ (Download Email PDF) పంపబడిన తరువాత IFFD ఏర్పాటైంది. ఈ ఇమెయిల్ లో అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవాన్ని ఏర్పాటు చేయడానికి తగిన తేదీ మరియు చిహ్నం ఎన్నుకొవడంలో సలహాలను కోరింది మరియు IFFD ని ప్రోత్సహించడంలో సహాయపడగల ఎవరికైనా ఈ ఇమెయిల్ ను కాపీ చేసి ఫార్వార్డ్ చేయమని ప్రజలను కోరింది.
జెజె ఎడ్మండ్సన్ (JJ Edmondson) |
మే 04 నే ఎందుకు?
IFFD సెయింట్ ఫ్లోరియన్ (St Florian) యొక్క విందు రోజుతో అనుసంధానించబడింది.
సెయింట్ ఫ్లోరియన్ రోమన్ సామ్రాజ్యంలో ఒక అగ్నిమాపక దళానికి మొదటి కమాండర్ లో ఒకడు. పురాణాల ప్రకారం, సెయింట్ ఫ్లోరియన్ కేవలం ఒక బకెట్ నీటిని ఉపయోగించి మంటల్లో మునిగిపోయిన మొత్తం గ్రామాన్ని రక్షించాడు. ఈ చర్య కారణంగా సెయింట్ ఫ్లోరియన్ అగ్ని ప్రమాదానికి గురైనవారికి రక్షకుడిగా పిలుస్తారు.
అలాగే చాలా యూరోపియన్ దేశాల్లోని అగ్నిమాపక సిబ్బంది మే 4 న ఫైర్ సర్వీస్ డే (Day of Fire Service) గా మరియు సెయింట్ ఫ్లోరియన్ డే (St Florian’s Day) గా జరుపుకునేవారు.
అందుకే మే 04 వ తేదీన అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవంగా 1999 నుంచి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.
IFFD Symbol:
IFFD చిహ్నాంగా ఎరుపు మరియు నీలం రంగులు కలిగిన రిబ్బన్ (Red-Blue Ribbon) ను JJ ఎడ్మండ్సన్ ఎంచుకుంది.
ఎందుకంటే ఎరుపు రంగు అగ్నిని, నీలం రంగు నీటిని సూచిస్తాయి. ఎరుపు మరియు నీలం రంగులను అత్యవసర సేవలను సూచించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తారు. అందువల్ల IFFD ను గుర్తించడానికి ఎరుపు మరియు నీలం రంగులు ఉత్తమ ఎంపిక అని చెప్పవచ్చు.
Sound Off:
అగ్ని ప్రమాదాలలో మరణించిన అగ్నిమాపక సిబ్బంది త్యాగాన్ని గుర్తు తెచ్చుకుని, వారికి నివాళులు అర్పించడానికి ఒక నిమిషం నిశ్శబ్దాన్ని పాటిస్తారు.
2002 లో జరిగిన అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవంలో ప్రపంచవ్యాప్తంగా అగ్నిమాపక సిబ్బంది యొక్క నిబద్ధత మరియు త్యాగాలను ప్రతిబింబించేలా సౌండ్ ఆఫ్ నిర్వహించబడింది.
సౌండ్ ఆఫ్ కు వచ్చిన అద్భుతమైన మద్దతు కారణంగా ఇప్పుడు ప్రతి మే మొదటి ఆదివారం వార్షిక సౌండ్ ఆఫ్ జరుపుకుంటున్నారు.
వీటిని కూడా చూడండీ:
- IFFD Official Website- www.firefightersday.org
- జాతీయ అగ్నిమాపక దినోత్సవం (National Fire Service Day)
- ముఖ్యమైన దినోత్సవాలు (Important Days)