History of World Intellectual Property Day in Telugu | ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం |
ప్రపంప మేధో సంపత్తి
దినోత్సవం - ఏప్రిల్ 26
ఉద్దేశ్యం:
ప్రపంచవ్యాప్తంగా మేధో సంపత్తి రక్షణ యొక్క ప్రభావాన్ని విస్తరించడానికి, మేధో సంపత్తి రక్షణ చట్టాలు మరియు నిబంధనలను ప్రచారం చేయడానికి మరియు ప్రాచుర్యం పొందటానికి దేశాలను కోరడం, మేధో సంపత్తి హక్కులపై ప్రజలకు చట్టపరమైన అవగాహన పెంచడం, ఆవిష్కరణను ప్రోత్సహించడం ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం (World Intellectual Property Day) ముఖ్య ఉద్దేశ్యం.
ఎప్పటి నుంచి?
WIPO ఈ దినోత్సవాన్ని జరపాలని 2000 సంవత్సరంలో తీర్మానించింది.
2001 నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 26 వ తేదీన ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.
ఏప్రిల్ 26 నే ఎందుకు?
14 జూలై 1967 న స్వీడన్ లోని స్టాక్‌హోమ్ లో ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (WIPO) ను స్థాపించే కన్వెన్షన్ (WIPO Convention) పై సభ్య దేశాలు సంతకం చేశాయి.
ఈ WIPO కన్వెన్షన్ 26 ఏప్రిల్ 1970 న అమల్లోకి వచ్చింది. దీని జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 26 వ తేదీన ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
థీమ్ (Theme):
- 2019: బంగారం కోసం చేరుకోండి: IP మరియు క్రీడలు (Reach for Gold: IP and Sports)
- 2018: శక్తిని మార్చడం: ఇన్నోవేషన్ మరియు సృజనాత్మకతలో మహిళలు (Powering Change: Women in Innovation and Creativity)
- 2017: ఇన్నోవేషన్ - జీవితాలను మెరుగుపరచడం (Innovation - Improving Lives)
- 2016: Digital Creativity: Culture Reimagined
WIPO:
- ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (WIPO- World Intellectual Property Organization) ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో పనిచేస్తున్న సంస్థ. ఇది 1974 లో ఐక్యరాజ్యసమితి యొక్క ప్రత్యేక ఏజెన్సీగా మారింది.
- సృజనాత్మక కార్యకలాపాలను, పారిశ్రామిక ఆస్తి హక్కులు మరియు కాపీరైట్ వంటి మేధో సంపత్తి హక్కుల రక్షణను ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించే సంస్థ.
- స్థాపన: 14 జూలై 1967
- ప్రధాన కార్యాలయం: జెనీవా (స్విట్జర్లాండ్ దేశంలోని ఒక నగరం)
- సభ్యత్వం: 193 సభ్య దేశాలు
- డైరెక్టర్ జనరల్: ఫ్రాన్సిస్ గుర్రీ (2008 నుండి)
- WIPO Official Website- www.wipo.int
అంతర్జాతీయ మేధో సంపత్తి సూచీ (2020):
యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ కు చెందిన గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ (GIPC) 5 ఫిబ్రవరీ 2020 న విడుదల చేసిన అంతర్జాతీయ మేధో సంపత్తి సూచీ-2020 (International IP Index - 2020) లో
- తొలిస్థానం- అమెరికా
- రెండవ స్థానం- UK
- మూడవ స్థానం- స్వీడన్
- భారతదేశం స్థానం- 2018లో 44, 2019లో 36.
వీటిని కూడా చూడండీ: