History of International Dance Day in Telugu | అంతర్జాతీయ నృత్య దినోత్సవం |
అంతర్జాతీయ నృత్య
దినోత్సవం - ఏప్రిల్ 29
ఉద్దేశ్యం:
నృత్య కళ (Art of Dance) గురించి ప్రజలలో అవగాహన పెంచడం మరియు నృత్య విద్యను ప్రోత్సహించడం అంతర్జాతీయ నృత్య దినోత్సవం (International Dance Day) ముఖ్య ఉద్దేశ్యం.
ఎప్పటి నుంచి?
1982 నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 29 వ తేదీన అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.
ఏప్రిల్ 29 నే ఎందుకు?
ప్రఖ్యాత ఫ్రెంచ్ నృత్య కళాకారుడు మరియు బ్యాలెట్ మాస్టర్ అయిన జీన్ జార్జెస్ నోవెర్రే (Jean Georges Noverre) 29 ఏప్రిల్ 1727 న జన్మించాడు.
ఈయన జ్ఞాపకార్థం ఈయన పుట్టినరోజైన ఏప్రిల్ 29 వతేదీను అంతర్జాతీయ నృత్య దినోత్సవంగా జరుపుకుంటున్నారు.
అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని యునెస్కో (UNESCO) యొక్క ప్రదర్శన కళలకు ప్రధాన భాగస్వామి అయిన ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ (ITI- International Theatre Institute) యొక్క అంతర్జాతీయ నృత్య కమిటీ (IDC- International Dance Committee) రూపొందించింది.
జీన్ జార్జెస్ నోవెర్రే |
సందేశ రచయిత (Message Author):
- ప్రతి సంవత్సరం అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని ప్రచారం చేయడంలో సహాయపడటానికి అంతర్జాతీయ థియేటర్ ఇన్స్టిట్యూట్ (ITI) ఈ కార్యక్రమానికి నృత్య ప్రపంచం నుండి ఒక ప్రసిద్ధ నృత్యకారుడు లేదా కొరియోగ్రాఫర్ ను సందేశ రచయితగా ఒక సందేశాన్ని అందించటానికి ఆహ్వానిస్తారు.
- నృత్యం యొక్క ఔచిత్యాన్ని మరియు శక్తిని నొక్కిచెప్పే విధంగా రచయిత సందేశం ఉంటుంది.
- మొదటి సందేశ రచయిత- స్లొవేనియా దేశపు హెన్రిక్ న్యూబౌర్ (1982)
- 2020 సందేశ రచయిత- గ్రెగొరీ వుయానీ మాకోమా (Gregory Vuyani Maqoma). ఇతను సౌత్ ఆఫ్రికా దేశపు డాన్సర్, కొరియోగ్రాఫర్, నటుడు, నృత్య విద్యావేత్త.
International Theatre Institute (ITI):
- స్థాపన: 1948
- ప్రధాన కార్యాలయం: పారిస్
- ITI Official Website- www.iti-worldwide.org
- యునెస్కో చేత స్థాపించబడిన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రదర్శన కళల సంస్థ (World’s Largest Performing Arts Organization). సంస్కృతి, విద్య మరియు కళలపై యునెస్కో యొక్క లక్ష్యాలతో అనుసంధానించబడింది.
- ఇది ప్రత్యక్ష ప్రదర్శన కళల (డ్రామా, డ్యాన్స్, మ్యూజిక్ థియేటర్) రంగంలో కార్యకలాపాలు మరియు సృష్టిని ప్రోత్సహిస్తుంది. జాతీయ మరియు అంతర్జాతీయ ప్రదర్శన కళల విభాగాలు మరియు సంస్థల మధ్య ఉన్న సహకారాన్ని విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుంది.
నాట్యము/నృత్యం:
నాట్యము లేదా నృత్యం (Dance) అంటే, సంగీతానికి పారవశ్యమై శరీరంలో ఏర్పడే కదలికలు లేదా లయబద్ధ సంగీతానికి శరీరం లయబద్ధంగా కదలడం అని చెప్పుకోవచ్చు.
వీటిని కూడా చూడండీ:
- International Dance Day Official Website- www.international-dance-day.org
- భారతదేశంలోని వివిధ నృత్య రూపాలు PDF
- ముఖ్యమైన దినోత్సవాలు (Important Days)