Banner 160x300

History of National Safe Motherhood Day in Telugu | జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం

History of National Safe Motherhood Day in Telugu | జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం
History of National Safe Motherhood Day in Telugu | జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం

జాతీయ సురక్షిత మాతృత్వ
దినోత్సవం - ఏప్రిల్ 11

లక్ష్యం:
గర్భధారణ, ప్రసవ మరియు ప్రసవానంతర సేవల సమయంలో మహిళలకు సరైన ఆరోగ్య సంరక్షణ మరియు ప్రసూతి సౌకర్యాల గురించి అవగాహన పెంచడం జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం (National Safe Motherhood Day) ముఖ్య లక్ష్యం.

ఎప్పటి నుంచి?
2003 నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 11 వ తేదీన జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటారు.

ఏప్రిల్ 11 నే ఎందుకు?
  • మహాత్మ గాంధీ యొక్క భార్య కస్తూరిబాయి గాంధీ (Kasturbai Gandhi) 11 ఏప్రిల్ 1869 న జన్మించింది. 
  • కస్తూరిబాయి గాంధీ జ్ఞాపకార్థం, WRAI (White Ribbon Alliance India) యొక్క అభ్యర్థన మేరకు 2003 లో భారత ప్రభుత్వం ఏప్రిల్ 11 ను జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవంగా ప్రకటించింది.

థీమ్ (Theme):
  • 2019: Midwives for Mothers
  • 2018: గౌరవనీయమైన ప్రసూతి సంరక్షణ (Respectful Maternity Care)

గణాంకాలు:
WRAI గణాంకాల ప్రకారం, 
  • ప్రపంచవ్యాప్తంగా ప్రసూతి మరణాలలో 15% భారతదేశంలోనే జరుగుతున్నాయి.
  • భారతదేశంలో 80% పైగా ఆరోగ్య సదుపాయాలు ఉన్నప్పటికీ, ప్రతి సంవత్సరం ప్రసూతి కారణాలతో 44,000 మంది మహిళలు మరణిస్తున్నారు. ఈ మరణాలన్నీ దాదాపుగా నివారించదగినవి.

వైట్ రిబ్బన్ అలయన్స్ ఇండియా (WRAI):
  • ఇది 1999 లో ప్రారంభించబడింది.
  • ఇది నిష్పక్షపాతమైన, లాభాపేక్షలేని మరియు ప్రభుత్వేతర సంస్థ.
  • ప్రపంచవ్యాప్తంగా తల్లి మరియు నవజాత శిశువుల మరణాలను తగ్గించడం WRAI (White Ribbon Alliance India) ముఖ్య లక్ష్యం. 
  • గర్భధారణ, ప్రసవానికి ముందు మరియు తరువాత మహిళలందరూ సురక్షితంగా మరియు ఆరోగ్యంగా ఉండటానికి హక్కును సమర్థించే న్యాయవాదులను ప్రేరేపిస్తుంది మరియు సమావేశపర్చుతుంది.
  • WRAI Official Website:   https://www.whiteribbonalliance.org/india/

తల్లికి సూచనలు:
  • గర్భవతి కాగానే ఆసుపత్రిలో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, క్రమమైన వైద్య పరీక్షలు చేయించడం.
  • గర్భిణిగా రిజిస్ట్రేషన్ అయిన తరువాత మహిళలకు నాలుగు ఆంటినెంటల్ చెకప్‌లు, ఆరు ప్రసవానంతర చెకప్‌లు అవసరం అవుతాయి. రక్తపోటు, మూత్రపరీక్ష, బరువు కొలవడం, అల్ట్రాసౌండ్ స్కానింగ్, టి.టి. ఇంజెక్షన్, ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు, హెచ్‌ఐవి పరీక్ష.. ఆంటినెంటల్ చెకప్‌లో భాగంగా ఉంటాయి.
  • కడుపుతో ఉన్నప్పుడు మంచి పోషకాహారం తీసుకోవాలి. విశ్రాంతి తీసుకోవాలి.
  • మరీ ఎక్కువ బరువున్న వస్తువులు మోయరాదు.
  • సౌకర్యవంతమైన కాన్పు కోసం భాగస్వామితో చర్చించి ముందుగానే ప్రణాళిక వేసుకోవాలి.
  • పోస్ట్‌నేటల్ కేర్‌లో భాగంగా పోషకాహారంపై కౌన్సిలింగ్, ముర్రుపాలకు సంబంధించిన సమాచారం, బిడ్డకు ఇవ్వాల్సిన టీకాల గురించి కూడా సమాచారం ముందుగానే తెలుసుకోవాలి. దీనివల్ల తల్లికి, బిడ్డకి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
  • బిడ్డకి, బిడ్డకి మధ్య కొన్ని సంవత్సరాల గ్యాప్ కొరకు ఆరోగ్యకరమైన కుటుంబ నియంత్రణ మార్గాలను అనుసరించాలి.

మరికొన్ని అంశాలు:
  • జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని సామాజికంగా ప్రకటించిన ప్రపంచంలో తొలి దేశం భారతదేశం.

వీటిని కూడా చూడండీ: