Monday, April 13, 2020

Maternity Schemes in India Telugu | మాతృత్వ పథకాలు

Maternity Schemes in India Telugu | మాతృత్వ పథకాలు
Maternity Schemes in India, Maternity Schemes in India in telugu, mathrutva samkshema pathakalu, Maternity Schemes central and states, National Safe Motherhood Day in telugu, National Safe Motherhood day essay in telugu, History of National Safe Motherhood Day, about National Safe Motherhood Day, Themes of National Safe Motherhood Day, Celebrations of National Safe Motherhood Day, National Safe Motherhood Day essay in telugu, National Safe Motherhood Day in Telugu, National Safe Motherhood Day, jathiya Surakshitha mathrutva dinotsavam,

మాతృత్వ పథకాలు

జననీ సురక్ష యోజన పథకం - 2005:
  • జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ - 2005 కింద జననీ సురక్ష యోజన పథకం సురక్షితమైన మాతృత్వం కోసమే రూపొందించారు.
  • గర్భవతి మహిళలలో సంస్థాగత కాన్పును ప్రోత్సహించడం ద్వారా తల్లి, శిశు మరణాలను తగ్గించే లక్ష్యంతో దీన్ని అమలు చేస్తున్నారు. 
  • జననీ సురక్ష యోజనను నేషనల్ మెటర్నిటీ బెనిఫిట్ స్కీమ్ (NMBS- National Maternity Benefit Scheme) ను సవరించడం ద్వారా 12 ఏప్రిల్ 2005 న దీన్ని ప్రారంభించారు.
  • ఈ పథకానికి దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన గర్భిణీలు అర్హులు.
  • ఈ పథకం కింద అర్హత గల గర్భిణీల బ్యాంకు ఖాతాలలోకి నేరుగా జననీ సురక్షా యోజన ప్రయోజనాన్ని చేరుస్తారు.
  • ఇందులో తల్లి వయసు, పిల్లల సంఖ్య సంబంధం లేకుండా ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన ప్రైవేటు ఆరోగ్య కేంద్రంలో ప్రసవించవచ్చు.
  • గర్భవతి మహిళలలో సంస్థాగత ప్రసవాలను ప్రచారం చేసే ఆశా కార్యకర్తలకు మహిళల ఆరోగ్య పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలను కూడా ఈ పథకం అందిస్తుంది. 

ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ (PMSMA)- 2016:
  • మాతృత్వం, శిశు సరంక్షణకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ శిశువుకు జన్మనిచ్చే సమయంలో ఏ మాతృమూర్తి మృత్యువాత పడకూడదనే ఉద్దేశ్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్ నిర్ణయించిన లక్ష్యం మేరకు ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.
  • ఈ కార్యక్రమం కింద ప్రతీ నెల 9వ తేదీన గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
  • ఈ కార్యక్రమం గర్భిణీ స్త్రీలకు వారి గర్భధారణ వ్యవధిలో 3 నుండి 6 నెలల వరకు మాత్రమే వర్తిస్తుంది.
  • ఇందులో అత్యంత ప్రమాదకర పరిస్థితిలో ఉండేవారికి ప్రత్యేక వైద్యసేవలను అందిస్తున్నారు. దీనిద్వారా మాతృమరణాల సంఖ్య తగ్గుతుందని వారు భావిస్తున్నారు.

సుమన్‌ - 2019:
  • ప్రపంచ సగటుతో పోల్చుకుంటే నవజాత శిశువులు, బాలింతల మరణాల విషయంలో మనదేశం ఇప్పటికీ వెనుకబడే ఉంది. ఈ పరిస్థితిని మార్చేందుకు నవజాత శిశువులు, బాలింతల మరణాలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం సుమన్‌ (Suman- Surakshit Matritva Aashwasan) పథకాన్ని 2019 అక్టోబర్‌ 10న ప్రారంభించింది.
  • ఈ పథకంలో పేరు నమోదు చేసుకున్న గర్భిణులకు ప్రసవం తర్వాత ఆరు నెలల వరకు తల్లీబిడ్డలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా ఉచితంగా చికిత్స అందిస్తారు. ఈ పథకంలో లబ్ధిదారులకు ఇంటి నుంచి వైద్యశాలకు ఉచిత రవాణా సౌకర్యం కూడా కల్పిస్తారు.

ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన (PMMVY) 2017:
  • ప్రసూతి ప్రయోజన పథకం పేరుతో బాలింతలకు అందించే ఆర్థిక సాయం రూ.6000 మూడు విడతల్లో అర్హులకు చేరుతుంది. మూడు విడతలుగా ఈ సాయం అందుతుంది. గర్బిణిగా పేరు నమోదు చేసుకున్నా తరువాత తొలివిడతగా రూ.1000 లబ్దిదారుల ఖాతాలో జమ అవుతుంది. రెండో విడతగా ఆరు నెలల తరువాత ఆరోగ్య పరీక్షల నిమిత్తం మరో రూ.2000 జమ చేస్తారు. ప్రసవం అనంతరం శిశువు, తల్లి ఆరోగ్య రక్షణకు చివరి విడతగా రూ.2000 అందజేస్తారు. మిగిలిన 1000 రూపాయలను ఆసుపత్రుల్లో పురుడు పోసుకున్నవారికి ప్రస్తుత అందుతున్న మాతృత్వ లబ్ది పథకం కింద అందజేస్తారు.
  • అంగన్‌వాడీ సెంటర్ లేదా అప్రూవ్డ్ హెల్త్ ఫెసిలిటీ వద్ద ప్రెగ్జెన్సీ రిజిస్టర్ చేయించుకోవాలి. చివరి రుతుక్రమం వచ్చిన దగ్గరి నుంచి 150 రోజుల్లోగా అంగన్‌వాడీలకు వెళ్లి స్కీమ్‌కు అప్లై చేసుకోవాలి.
  • తొలి సంతనానికి మాత్రమే ఈ పథకం ప్రయోజనాలు లభిస్తాయి.
  • అయితే, కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాల, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఈ పథకం వర్తించదు.

ప్రసూతి ప్రయోజన (సవరణ) చట్టం- 2017: Maternity Benefit (Amendment) Act - 2017 
  • సవరించిన 1961 నాటి ప్రసూతి ప్రయోజనాల చట్టం (Maternity Benefit Act - 1961) రాష్ట్రపతి చేత 27 మార్చ్ 2017 న ఆమోదం పొందింది. 01 ఏప్రిల్ 2017 నుంచి అమలులోకి వచ్చింది.
  • సవరణ తర్వాత ప్రసూతి సెలవు ప్రస్తుతం వున్న 12 వారాల నుండి 26 వారాల వరకు పెంచబడింది. 
  • మూడు వారాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను దత్తత తీసుకున్న ఒక మహిళకు 12 వారాల సెలవు కాలాన్ని అనుమతిస్తారు.

వీటిని కూడా చూడండీ:

No comments:

Post a Comment