Banner 160x300

History of National Panchayati Raj Day in Telugu | జాతీయ పంచాయతీ రాజ్‌ దినోత్సవం

History of National Panchayati Raj Day in Telugu | జాతీయ పంచాయతీ రాజ్‌ దినోత్సవం
National Panchayati Raj Day in telugu, National Panchayati Raj day essay in telugu, History of National Panchayati Raj Day, about National Panchayati Raj Day, Themes of National Panchayati Raj Day, Celebrations of National Panchayati Raj Day, National Panchayati Raj Day, jathiya Panchayati Raj dinotsavam, Day Celebrations, Days Special, What today special, today special, today history, Days, Important days, important days in telugu, important days in January, important days in February, important days in  March, important days in  April, important days in May, important days in  June, important days in  July, important days in August, important days in September, important days in October, important days in November, important days in December, special in April, special in April, days celebrations in April, popular days in April, April lo dinostavalu, special in April 24, Student Soula,

జాతీయ పంచాయతీ రాజ్‌
దినోత్సవం - ఏప్రిల్ 24


ఉద్దేశ్యం:
గ్రామాల అభివృద్ధి ప్రక్రియలో పంచాయితీ రాజ్ సంస్థలు పోషించే పాత్ర ఏమిటో ప్రజలకు అవగాహన కలిగించడం కోసం కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ అధ్వర్యంతో జాతీయ పంచాయతీ రాజ్‌ దినోత్సవం (National Panchayati Raj Day) నిర్వహించబడుతుంది.

ఎప్పటి నుంచి?
2010 నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24 వ తేదీన జాతీయ పంచాయతీ రాజ్‌ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.

ఏప్రిల్ 24 నే ఎందుకు?
పంచాయతీ రాజ్‌ సంస్థలకు రాజ్యాంగ గుర్తింపుకు ఉద్దేశించిన '73 వ రాజ్యాంగ సవరణ చట్టం' 1993 ఏప్రిల్ 24 నుండి అమలులోకి వచ్చింది. దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24 వ తేదీన జాతీయ పంచాయతీ రాజ్‌ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. (ఆంధ్రప్రదేశ్ లో 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1994 ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చింది)

పంచాయతీ అవార్డులు:
  • 2011-12 నుండి రాష్ట్ర ప్రభుత్వాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు సిఫారసు చేసిన ఉత్తమ పని చేసే పంచాయతీలకు పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ పంచాయతీ అవార్డులు (Panchayat Awards) ఇచ్చి ప్రోత్సహిస్తోంది.
  • ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24 న జరుపుకునే జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులు ప్రదానం చేస్తారు.
  • ఆదర్శ గ్రామంగా నిలిచిన గ్రామ పంచాయితీలకు దిన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తికరణ్ పురస్కారం (DDUPSP) ప్రదానం చేస్తారు.
  • ఆదర్శ గ్రామ సభలకు నానాజీ దేఖ్ ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామ సభ పురస్కారం (NDRGGSP) ప్రదానం చేస్తారు.
  • గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక అవార్డు (GPDP- Gram Panchayat Development Plan Award) అభివృద్ధి చేసిన గ్రామ పంచాయతీలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో 2018 లో ప్రవేశపెట్టబడింది.
  • Child-friendly Gram Panchayat Award (CFGPA) లను 1 మార్చి 2019 నుండి ప్రదానం చేస్తున్నారు.
  • Panchayat Awards Official Website- www.panchayataward.gov.in

పంచాయతీ రాజ్‌ మంత్రిత్వ శాఖ:
  • పంచాయతీ రాజ్‌ మంత్రిత్వ శాఖ (MoPR- Ministry Of Panchayati Raj) మే 2004 లో ఏర్పాటు చేయబడింది.
  • ప్రధాన కార్యాలయం- న్యూఢిల్లీ
  • మొదటి కేంద్ర పంచాయతీ రాజ్‌ మంత్రి- మణిశంకర్ అయ్యర్ (2004 నుండి-2009 వరకు)
  • ప్రస్తుత కేంద్ర పంచాయతీ రాజ్‌ మంత్రి- నరేంద్ర సింగ్ తోమర్ (2016 నుండి)
  • MoPR Official Website- www.panchayat.gov.in

పంచాయతీ రాజ్:
  • గ్రామస్థాయిలో అమల్లో ఉండే అతి ప్రాచీన పాలనా వ్యవస్థే పంచాయతీ. దీన్నే స్థానిక స్వపరిపాలనా సంస్థల (Local Self Government) వ్యవస్థ, పంచాయతీరాజ్ (Panchayati Raj) వ్యవస్థ అని కూడా అంటారు.
  • ఈ వ్యవస్థను 1993 లో రాజ్యాంగ సవరణ (73వ రాజ్యాంగ సవరణ) ద్వారా ప్రవేశపెట్టారు.
  • ప్రస్తుతం భారతదేశంలో చాలా రాష్ట్రాలు మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థను కలిగి ఉన్నాయి.
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అర్హులైన పేదలకు అందించడంలో పంచాయతీరాజ్‌ వ్యవస్థలో స్థానిక సంస్థలే కీలక భాగస్వామ్యం వహిస్తున్నాయి. పంచాయతీల ఆధ్వర్యంలో పారిశుధ్యం, తాగునీరు, సామాజిక ఆస్తుల నిర్వహణ వంటి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.

పంచాయతీ రాజ్ ఎందుకు?
  • వనరుల పంపిణీలను మెరుగుపరచడానికి
  • ప్రభుత్వ పనుల్లో స్థానికులు పాల్గొనేలా చేయడానికి
  • గ్రామీణ ప్రజల దైనందిన అవసరాలను మేలైన పద్ధతిలో తీర్చడానికి
  • స్థానికంగా అధికంగా ఉద్యోగాలు కల్పించడానికి
  • పేదరిక నిర్మూలన కార్యక్రమాలను అమలు చేయడానికి

ముఖ్యమైన అంశాలు:
  • రాజ్యాంగ రీత్యా పంచాయతీరాజ్ అంశం రాష్ట్ర జాబితాలో ఉన్నది.
  • బల్వంతరాయ్ మెహతా అధ్యక్షతన ఉన్న కమిటీ సిఫారసుల మేరకు మనదేశంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది.
  • 1957 జనవరిలో ఏర్పాటైన బల్వంతరాయ్ మెహతా కమిటీ 'మూడంచెల' పంచాయతీ రాజ్ వ్యవస్థను సిఫారసు చేసింది.
  • మూడంచెల పంచాయతీరాజ్ విధానాన్ని అమలుపర్చిన తొలి రాష్ట్రం- రాజస్థాన్ (అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ రాజస్థాన్ లోని నాగౌర్ జిల్లాలో 1959 అక్టోబర్ 2న పంచాయతీ రాజ్ విధానాన్ని ప్రారంభించారు)
  • మూడంచెల పంచాయతీరాజ్ విధానాన్ని అమలు పర్చిన 2వ రాష్ట్రం- ఆంధ్రప్రదేశ్ (1959 నవంబరు 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో ఈ వ్యవస్థను ప్రారంభించారు)
  • 1977 డిసెంబర్ లో ఏర్పాటైన అశోక్ మెహతా కమిటీ 'రెండెంచెల' పంచాయతీ రాజ్ వ్యవస్థను సిఫార్సు చేసింది.
  • అశోక్ మెహతా కమిటీ సిఫారసు మేరకు రెండెంచెల విధానాన్ని ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం- కర్ణాటక 
  • పంచాయతీ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలని 1986లో ఏర్పాటైన ఎల్.ఎం.సింఘ్వీ కమిటీ సిఫారసు చేసింది.
  • పంచాయతీ రాజ్‌ సంస్థలకు రాజ్యాంగ గుర్తింపుకు ఉద్దేశించిన 73 వ రాజ్యాంగ సవరణ చట్టం 1993 ఏప్రిల్ 24 నుండి అమలులోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా రాజ్యాంగంలో 11వ షెడ్యూల్ ను ఏర్పాటు చేస్తూ 29 అంశాలపై పంచాయతీ రాజ్‌ వ్యవస్థకు అధికారాలు కల్పించడం జరిగింది.
  • రాజ్యాంగంలోని 9వ భాగంలో ఆర్టికల్ 243'A' నుండి 243'O' వరకు పంచాయతీ నిర్మాణానికి సంబంధించిన సమగ్ర వివరణను పొందుపర్చడం జరిగింది.
  • భారత రాజ్యాంగంలో (ఆదేశ సూత్రాలలో) 4వ భాగంలో 40వ ప్రకరణ పంచాయతీరాజ్ ఏర్పాటు, స్థానిక సంస్థల ప్రగతి ద్వారా సమీకృత గ్రామీణాభివృద్ధి చేయాలని ఆదేశిస్తుంది.
  • ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీలకు మొట్టమొదటిగా 1964 లో ఎన్నికలు (పరోక్షంగా) జరిగాయి. 
  • ఆంధ్రప్రదేశ్ లో 73వ రాజ్యాంగ సవరణ 1994 ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది నూతన పంచాయతీ చట్టం. ఈ చట్టం అమలైన తర్వాత అంతకు ముందు అమల్లో ఉన్న చట్టాలన్నీ రద్దయినాయి.
  • పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లను ఆంధ్రప్రదేశ్ లో 2011 నవంబర్ 25 నుంచి అమలుచేస్తున్నారు.
  • నూతన మూడంచెల పంచాయతీరాజ్ విధానంలో మొదటి అంచె- గ్రామ పంచాయతీ, రెండవ అంచె- మండల పరిషత్, మూడవ అంచె- జిల్లా పరిషత్.

మరికొన్ని అంశాలు:
  • పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని మహాత్మ గాంధీ సూచించారు.
  • స్థానిక ప్రభుత్వాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించిన చట్టం- 1935 భారత ప్రభుత్వ చట్టం.
  • మనదేశంలో స్థానిక ప్రభుత్వాలను ప్రవేశపెట్టిన మొదటి రాజవంశం- మౌర్యులు
  • కౌటిల్యుని అర్థశాస్త్రం స్థానిక పాలనను గురించి పేర్కొంటుంది.
  • భారతదేశంలో స్థానిక స్వపరిపాలనకు పేరుగాంచిన వారు- చోళులు (చోళుల పాలన గ్రామ పాలనకు ప్రసిద్ధి)
  • స్థానిక స్వపరిపాలన పితామహుడు- లార్డ్ రిప్పన్

వీటిని కూడా చూడండీ: