Girl Child Schemes |
సంక్షేమ పథకాలు
1) సమగ్ర శిశు అభివృద్ధి కార్యక్రమం- 1975:
(ICDS- Integrated Child Development Scheme- 1975)
- ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం 0-6 వయస్సున్న పిల్లలకు ఆరోగ్య సంరక్షణ, పౌష్టికాహారాన్ని అందించడం.
- ఈ కార్యక్రమంలో భాగంగా మొదట దేశవ్యాప్తంగా 33 ప్రాజెక్టులను, 489 అంగన్‌వాడీ కేంద్రాలను ప్రారంభించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,076 ప్రాజెక్టులు, 14 లక్షల అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. (2019 నాటికి)
- ఈ తరహా పథకాల్లో ప్రపంచంలోనే అతి పెద్ద పథకంగా పరిగణిస్తున్న ICDS లో ఆరేండ్లలోపు పిల్లల కోసం గర్బిణులు, బాలింతల కోసం ఆరు కీలక సేవలందిస్తున్నారు.
1) ఆరోగ్య చెకప్ లు
2) టీకాలు వేయడం
3) వ్యాక్సిన్లు వేయడం
4) ప్రత్యేక డాక్టర్లకు చూపించే సేవలు
5) పౌష్టికాహారాన్ని అందించడం
6) నర్సరీ విద్యనందించడం
- 12 వ పంచవర్ష ప్రణాళికలో ICDS పథకానికి రూ 1.2 లక్షల కోట్లు కేటాయించారు.
2) వందేమాతరం పథకం- 2004:
- గర్భిణులకు మరింత ఆహార ఆరోగ్య భద్రతను కల్పించడం
3) జననీ సురక్ష యోజన- 2005:
- దేశంలో ప్రసూతి మరణాలు, శిశు మరణాలను తగ్గించేందుకుగాను ప్రారంభించిన పథకం
4) బాలికల సంరక్షణ పథకం- 2008 మార్చి 8: (ధనలక్ష్మి పథకం)
- బాలికలను అన్ని రకాలుగా సంరక్షించేందుకు ఉద్దేశించిన పథకం. లక్ష రూపాయల బీమా సదుపాయాన్ని కల్పిస్తారు. 20 ఏండ్ల తర్వాత కుటుంబంలో మొదటి బాలికకు లక్ష రూపాయలను, రెండో బాలికకు రూ.50 వేలు అందిస్తుంది.
5) రాష్ట్రీయ కిశోర్ స్వస్థ్య కార్యక్రమం - 2014:
- కౌమార బాలికల ఆరోగ్య సంరక్షణా కౌన్సిలింగ్ కోసం ప్రారంభించిన పథకం. కౌమార మిత్ర ఆరోగ్య చికిత్స కేంద్రాలు, యువక్లినిక్ లను ఏర్పాటుచేశారు.
6) ఉజ్వల పథకం- 2007:
- మానవ అక్రమ రవాణా, బాలికల విక్రయం, కిడ్నాపింగ్, బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టబడిన బాలికలు, మహిళలకు విముక్తి కలిగించి వారికి పునరావాసం కల్పించేందుకు ఉద్దేశించిన పథకం ఉజ్వల.
7) సాథియా రిసోర్స్ కిట్ & సాథియా సలహా యాప్:
- కిశోర బాలికల కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ కిశోర స్వస్థ్య కార్యక్రమం (RKSK- Rashtriya Kishor Swasthya Karyakram) లో భాగంగా 2017 ఫిబ్రవరి 20 న సాథియా రిసోర్స్ కిట్ మరియు సాథియా సలహా మొబైల్ యాప్ (Saathiya Resource Kit And Saathiya Salah App) లను ఆవిష్కరించింది.
- కిశోర బాలికల ఆరోగ్య అవసరాలను గుర్తించి, వారికి అవగాహన కల్పించే పీర్ ఎడ్యుకేటర్ల (సాథియా) కు ఉపయోగపడే విధంగా వీటిని రూపొందించడం జరిగింది.
- భారతదేశంలో ప్రపంచంలోని మరే దేశంలో లేని విధంగా 253 మిలియన్లు (25.3 కోట్ల) మంది కిశోర వయస్కులు ఉన్నారు.
- కిశోర బాలికలకు అవగాహన కల్పించడం కోసం రాష్ట్రీయ కిశోర స్వస్థ్య కార్యక్రమం క్రింద 1.6 లక్షల మంది సాథియాలు పనిచేస్తున్నారు. సాథియాలకు అందించిన రీసోర్స్ కిట్లో (1) యాక్టివిటీ పుస్తకం (2) భ్రాంతి - క్రాంతి గేమ్ (3) ప్రశ్న - సమాధానం పుస్తకం (4) పీర్ ఎడ్యుకేటర్ డైరీ ఉంటాయి.
- వీటితో పాటు కిశోర బాలికలు వారికి వారుగా ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకోవడం కోసం సాథియా సలహా మొబైల్ కిట్ ను రూపొందించారు. దీనిని గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
8) సుకన్య సమృద్ధి ఖాతా:
- బేటీ బచావో, బేటీ పడావో క్యాంపెయిన్ లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఆడపిల్లల కోసం 2015 జనవరి 22 న హర్యానాలోని పానిపట్టులో సుకన్య సమృద్ధి ఖాతా యోజనను ప్రారంభించారు.
- భారతదేశంలో ఆడపిల్లల ఉజ్వల భవిష్యత్ కోసం ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ఆడపిల్లలకు, సరైన విద్యను అందేలా చేయడమే కాకుండా, వివాహ వ్యయాన్ని భారం కాకుండా చేస్తుంది.
- ఈ పథకం ద్వారా లబ్ది పొందేందుకు బాలిక పేరిట 10 సంవత్సరాల వయసు వచ్చే లోపు ఖాతా ప్రారంభించాలి. ఈ ఖాతాను బ్యాంకులలో గానీ, పోస్ట్ ఆఫీసులలో గానీ తెరవచ్చు. 10 సంవత్సరాలలోపు ఆడపిల్లల పేరిట ఈ ఖాతాను తెరవచ్చు. ఏడేళ్ళ వరకు తండ్రి, సంరక్షకులు ఖాతాను నిర్వహించవచ్చు. 10 ఏళ్ళ తరువాత పిల్లలే స్వయంగా నిర్వహించుకోవచ్చు.
- ఖాతాను రూ. 1000 లతో తెరచి, ఆ తరువాత నెలకు రూ.100 లేదా రూ.200 లేదా రూ.300 చొప్పున 100 గుణాంకాలతో జమచేయవచ్చు. సంవత్సరానికి కనీసం రూ.1000 లు ఖాతాలో జమచేయాలి. సంవత్సరానికి గరిష్ట పరిమితి రూ. 1,50000 లు
- ఖాతా తెరిచిన తేది నాటి నుంచి 21 సంవత్సరాలు అమ్మాయికి పూర్తి అయిన తరువాత ఈ పథకం ముగుస్తుంది. అయితే 14 ఏళ్లు పూర్తి అయ్యేంత వరకే డబ్బు జమచేయాల్సి ఉంటుంది. ఆడపిల్లలకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఉన్నత విద్య, వివాహం కోసం ఖాతాలో జమ అయిన దాంట్లో సగం మొత్తాన్ని తీసుకోవచ్చు. ఈ పథకం కింద 2016-17 లో 8.6 % వడ్డీ ఇస్తున్నారు.
9) బేటీ బచావో బేటి పడావో:
- ఈ కార్యక్రమాన్ని పధానమంత్రి నరేంద్ర మోడీ 2015 జనవరి 22 హర్యాణ రాష్ట్రంలోని పానిపట్టులో ప్రారంభించాడు.
- క్షీణిస్తున్న పిల్లల లింగ నిష్పత్తి, మహిళా సాధికారత సమస్యలను పరిష్కరించడం మరియు బాలికలు, మహిళల కోసం ఉద్దేశించిన సంక్షేమ పథకాలపై వారికి అవగాహన కల్పించడం, వారి సామర్థ్యాన్ని పెంపొందించడం ఈ పథకం ఉద్దేశ్యం.
వీటిని కూడా చూడండీ:
- జాతీయ బాలికా దినోత్సవం (National Girl Child Day)
- అంతర్జాతీయ బాలికా దినోత్సవం (International Girl Child Day)
- ముఖ్యమైన దినోత్సవాలు (Important Days)