History of Jallianwala Bagh Massacre in Telugu | జలియన్ వాలాబాగ్ దురంతం

History of Jallianwala Bagh Massacre in Telugu | జలియన్ వాలాబాగ్ దురంతం
Jallianwala Bagh Massacre in telugu, Jallianwala Bagh Massacre essay in telugu, History of Jallianwala Bagh Massacre, about Jallianwala Bagh Massacre, Themes of Jallianwala Bagh Massacre, Celebrations of Jallianwala Bagh Massacre, Jallianwala Bagh Massacre in Telugu, Jallianwala Bagh Massacre, Jallianwala Bagh durantham, Day Celebrations, Days Special, What today special, today special, today history, Days, Important days, important days in telugu, important days in January, important days in February, important days in  March, important days in  April, important days in May, important days in  June, important days in  July, important days in August, important days in September, important days in October, important days in November, important days in December, special in April, special in April, days celebrations in April, popular days in April, April lo dinostavalu, special in April 13, Student Soula,

జలియన్ వాలాబాగ్
దురంతం - ఏప్రిల్ 13

భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో
జరిగిన అత్యంత దురదృష్టమైన సంఘటన ఇది


జలియన్ వాలాబాగ్ లో సమావేశం:
  • పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ Sir Michael Francis O'dwyer ఎక్కువ మంది గుమికూడడాన్ని నిషేధిస్తూ Martial Law ను ప్రకటించాడు. అయితే దీనికి తగినంతగా ప్రచారం లభించలేదు.
  • 1919 రౌలట్ చట్టం భారత పౌరులను ఎటువంటి విచారణ జరపకుండా శిక్షించే అధికారం అధికారులకు సంక్రమింపజేసింది. ఆనాడు ఆ చట్టాన్ని దేశ ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా అమృత్‌సర్‌లో నిరసన జరిగినప్పుడు ఉద్యమకారులు సత్యపాల్, సైఫుద్ధీన్ కిచ్లూలను ప్రభుత్వం నిర్బంధించింది. ఇందుకు నిరసనగా జరిగిన ప్రదర్శనపై పోలీసులు కాల్పులు జరపగా 20 మంది అక్కడికక్కడే మరణించారు. 
  • మృతుల సంస్మరణార్థం, పోలీసుల చర్యలకు నిరసనగా అమృతసర్‌ లోని జలియన్‌ వాలా బాగ్‌ లో 1919 ఏప్రిల్ 13 న ప్రజలు పెద్దయెత్తున సమావేశం ఏర్పాటు చేశారు.
  • వైశాఖ మాసం సిక్కులకు ఆధ్యాత్మిక నూతన సంవత్సరం కూడా కావడంతో వేలాదిగా జనం ఈ సమావేశానికి తరలివచ్చారు.

జలియన్ వాలాబాగ్ లో దురంతం:
జలియన్ వాలాబాగ్ అనేది పంజాబ్ లోని అమృత్‌సర్ పట్టణంలో ఉన్న ఒక తోట (Garden). ఈ తోటలో అధిక సంఖ్యలో ప్రజలు చేరి నిరాయుధులై శాంతియుతంగా జరుపుకుంటున్న సమావేశంపై ఒక్కసారిగా జనరల్ రెజినాల్డ్ డయ్యర్ (Reginald Edward Harry Dyer) సారథ్యంలోని బ్రిటీష్ సైనికులు ఎటువంటి ముందస్తు హెచ్చరికలు చేయకుండా విచక్షణారహితంగా పదినిమిషాల పాటు   1650 రౌండ్లు కాల్పులు జరిపారు.

కమిటీలు (Commissions):
హంటర్ కమిషన్ - 1920:
  • జలియన్ వాలాబాగ్ సంఘటనను విచారించడానికి 1920 లో నియమించబడింది ఈ హంటర్ కమిషన్.
  • హంటర్ కమిషన్ నివేదిక ప్రకారం, జలియన్ వాలాబాగ్ సంఘటనలో నిరాయుధులైన స్త్రీ, పురుషులు, పిల్లలపైన పది నిమిషాల పాటు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 379 మంది (337 పురుషులు, 41 మంది బాలురు, 6 వారాల పసికందు) మరణించారు. 1200 మంది వరకు గాయపడ్డారు.
  • హంటర్ కమిషన్ - 1882 అనేది విద్యావ్యాప్తికై ఇతర సూచనలకోసం రిప్పన్ ప్రభుత్వం చేత 1882 లో నియమించబడింది.
కాంగ్రెస్ కమిటీ:
  • జలియన్ వాలాబాగ్ సంఘటనను విచారించడానికి కాంగ్రెస్ నియమించిన కమిటీలో సభ్యులు: (1) సిఆర్.దాస్ (2) ఫజుల్ హక్ (3)అబ్బాస్ త్యాబ్జీ (4) ఎం.ఆర్.జయకర్
  • కాంగ్రెస్ కమిటీ నివేదిక ప్రకారం, జలియన్ వాలాబాగ్ సంఘటనలో 1200 మంది వరకు మరణించారు. 2000 మందికి పైగా గాయపడ్డారు. 

ఈ దురంతం తర్వాతి పరిణామాలను:
  • పంజాబ్‌ లో నిత్యమూ జరుగుతున్న స్వాతంత్ర్యోద్యమానికి ఈ జలియన్‌ వాలాబాగ్ దురంతం అగ్నికి ఆజ్యం పోసినట్లు తోడయ్యింది.
  • ఈ సంఘటన తర్వాత 1920లో గాంధీజీ పిలుపు మేరకు సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమయింది.
  • భగత్ సింగ్ విప్లవకారుడిగా మారేందుకు ఈ ఘటనే ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు.
  • ఈ సంఘటనకు నిరసననగా బ్రిటిష్ వారు తనకు ఇచ్చిన నైట్ హుడ్/సర్ బిరుదును రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ తిరిగి ఇచ్చేశారు.
  • అనేకమంది దేశభక్తుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఈ దురాగతం అసలే ఆగ్రహావేశాలతో ఉన్న అప్పటి యువతలో మరింత స్ఫూర్తిని రగిలింపజేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయేటట్లు చేయగలిగింది. స్వాతంత్ర్యం సాధించుకునేదాకా అది కొనసాగింది.

స్మారక స్థూపం:
  • అమెరికాకు చెందిన బెంజమిన్ పోల్క్ అనే ఆర్కిటెక్టు ఈ స్మారక స్తూపానికి రూపకల్పన చేశాడు.
  • 1961 ఏప్రిల్ 13న జవహర్ లాల్ నెహ్రూ తదితరుల సమక్షంలో రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ జలియన్‌ వాలాబాగ్‌ లో స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు.
స్మారక స్థూపం

జనరల్ రెజినాల్డ్ డయ్యర్:
  • బ్రిగేడియర్ జనరల్ అయిన రెజినాల్డ్ డయ్యర్ (Reginald Edward Harry Dyer) సారథ్యంలోని బ్రిటీష్ సైనికులు ఎటువంటి ముందస్తు హెచ్చరికలు చేయకుండా జలియన్‌ వాలాబాగ్‌ లో సమావేశమైన ప్రజల మీద విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
  • జనరల్ డయ్యర్ తన ఆఫీసులో ఇచ్చిన రిపోర్టు ప్రకారం అతనికి తిరుగుబాటు విప్లవకారుల సేన ఎదురైనందున కాల్పులు జరుపవలసి వచ్చింది అని ఉంది.
  • తన సైనికచర్యను సరైన చర్యగా డయ్యర్ పదేపదే అభివర్ణించుకోవడం అతని దుర్మార్గ మనస్తత్వానికి నిదర్శనం.
  • జవహర్‌లాల్ నెహ్రూ అమృత్‌సర్ నుండి ఢిల్లీకి రైలులో ప్రయాణిస్తున్నప్పుడు పరదాల అవతల నుండి ఒక మిలిటరీ ఆఫీసర్ గట్టిగా ఇలా మాట్లాడడం విన్నానని తన ఆత్మకథలో వ్రాశాడు "పట్టణం అంతా నా దయమీద ఆధారపడి ఉంది. దానిని బూడిద చేసేద్దామనుకొన్నాను గాని దయతలచి వదిలేశాను" ఈ మాటలు అన్న వ్యక్తి ఎవరో కాదు జనరల్ రెజినాల్డ్ డయ్యర్. డయ్యర్ కూడా అదే రైలులో ప్రయాణం చేస్తున్నాడు.
  • ఇతను 1927 లో రక్తనాళాలు చిట్లీ మరణించాడు.
జనరల్ రెజినాల్డ్ డయ్యర్

మైకేల్ ఓ డ్వయర్:
  • మైకేల్ ఓ డ్వయర్ (Sir Michael Francis O'dwyer) పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ (1913-1919)
  • ఇతను జనరల్ డయ్యర్ కు ఇచ్చిన టెలిగ్రాములో "నీ చర్య సరైనదే. దానిని లెఫ్టినెంట్ గవర్నర్ సమర్ధిస్తున్నాడు" అని వ్రాసి ఉంది.
  • ఇతను జలియన్ వాలాబాగ్ సంఘటన అనంతరం పంజాబ్ లో సైనిక శాసనాన్ని అమలు చేసి అనేకమందికి మరణశిక్షలు విదించాడు.
  • లండన్‌లో విశ్రాంత జీవితాన్ని గడిపే సమయంలో భారత విప్లవకారుడు ఉద్దంసింగ్ చేతిలో 13 మార్చ్ 1940 తేదీన హత్యకు గురయ్యాడు. 
మైకేల్ ఓ డ్వయర్

మరికొన్ని అంశాలు:
  • బుల్లెట్ నుండి తప్పించుకోవడానికి చాలా మంది ప్రజలు జలియన్ వాలాబాగ్ తోటలో ఉన్న బావిలోకి దూకి మరణించారు. ఈ బావిలోంచి 120 శవాలను బయటకు తీశారు.
  • నగరంలో కర్ఫ్యూ ఉన్నందున గాయపడినవారని ఆసుపత్రులకు తీసికొని వెళ్ళడం సాధ్యం కాలేదు.
  • జలియన్ వాలాబాగ్ లోని గోడలకు, పక్కనున్న భవనాలపై బుల్లెట్ గుర్తులను ఇప్పటికీ మనం ఆ ప్రాంతంలో చూడవచ్చు.
  • 1982లో రిచర్డ్ అటెన్‌బరో సినిమా గాంధీ లో ఈ ఘటనను చిత్రీకరించారు. రంగ్ దే బసంతిది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ సినిమాలలో కూడా జలియన్ వాలాబాగ్ దృశ్యాలను చూపారు.
జలియన్ వాలాబాగ్ లో తుపాకి బుల్లెట్ల గుర్తులు
తోటలో గల అమరవీరుల స్మారక బావి
జలియన్ వాలాబాగ్ లో తుపాకి బుల్లెట్ల గుర్తులు

వీటిని కూడా చూడండీ: