History of World Health Day in Telugu | ప్రపంచ ఆరోగ్య దినోత్సవం |
ప్రపంచ ఆరోగ్య
దినోత్సవం - ఏప్రిల్ 7
WHO గుర్తించిన ఎనిమిది అధికారిక ప్రపంచ
ఆరోగ్య ప్రచారాలలో (Global Health Campaigns) ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఒకటి
ఉద్దేశ్యం:
- ప్రజలు మెరుగైన ఆరోగ్యంతో జీవించాలనేది ప్రపంచ ఆరోగ్య దినోత్సవం (World Health Day) ముఖ్య ఉద్దేశం.
- ఆరోగ్య సంబంధిత సమస్యలపై దృష్టి పెట్టడానికి ఈ రోజును ఎంచుకున్నందున, ప్రభుత్వ, ప్రభుత్వేతర, ఎన్జీఓలు, వివిధ ఆరోగ్య సంస్థలతో వివిధ ప్రదేశాలలో ప్రజారోగ్య సమస్యలు మరియు అవగాహనకు సంబంధించిన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రపంచ స్థాయిలో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
ఎప్పటి నుంచి?
1950 నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7 వ తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు.
ఏప్రిల్ 7 నే ఎందుకు?
7 ఏప్రిల్ 1948 న ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO- World Health Organisation) ఏర్పాటైంది. WHO స్థాపనకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7 న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటారు.
థీమ్ (Theme):
- 2020: నర్సులు మరియు మంత్రసానులకు మద్దతు (Support Nurses and Midwives)
- 2019: Universal Health Coverage: everyone, everywhere
- 2018: Universal Health Coverage: everyone, everywhere
- 2017: Depression: Let's talk
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO):
ఐక్యరాజ్య సమితి సహకారంతో నడిచే ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ
- స్థాపన: 7 ఏప్రిల్ 1948
- ప్రధాన కార్యాలయం: స్విట్జర్లాండ్ లోని జెనీవా
- ధ్యేయం: ప్రజలందరికీ అత్యుత్తమ ఆరోగ్య సదుపాయాలు కల్పించుట
- మొదటి డైరెక్టర్ జనరల్: బ్రాక్ చిషోల్మ్ (Brock Chisholm) (1948-1953)
- ప్రస్తుత డైరెక్టర్ జనరల్: టెడ్రోస్ అధనామ్ (Tedros Adhanom) (2017- )
- Official Website- https://www.who.int/
వీటిని కూడా చూడండీ: