IPC Sections Relating To Crime Against Women |
మహిళలపై నేరాలకు సంబంధించి
IPC లో ఉన్న సెక్షన్లు
సెక్షన్ 100
ఆత్మరక్షణకు ఒక వ్యక్తి పైన మహిళ దాడి చేస్తే తప్పలేదు. ఆ సమయంలో ఆ వ్యక్తి మరణించినా తప్పు కాదు.
సెక్షన్ 228(ఎ)
లైంగిక దాడికి గురైన మహిళ అనుమతి లేకుండా మీడియాలో ఆమె పేరు, ఫొటో, వివరాలు ప్రచురించకూడదు.
సెక్షన్ 354
మహిళ శరీరాన్ని లైంగిక ఉద్దేశంతో చూసినా, తాకినా, కనుసైగ చేసినా నేరమే.
సెక్షన్ 376
వైద్యం కోసం వచ్చిన మహిళను లైంగికంగా వేధిస్తే ఈ సెక్షన్ కింద కేసు నమోదు అవుతుంది.
సెక్షన్ 509
మహిళలతో అవమానకరంగా మాట్లాడినా, సైగలు చేసినా, అసభ్యకరమైన వస్తువులను ప్రదర్శించినా శిక్షకు అర్హులు.
సెక్షన్ 294
మహిళలు రోడ్డుపైన నడుస్తున్నా, బస్టాపుల్లో వేచి ఉన్నా, అసభ్యకరమైన పాటలు పాడుతూ, శబ్దాలు చేసి ఇబ్బంది పెడితే ఈ సెక్షన్ ప్రకారం 3 నెలలు శిక్ష పడుతుంది.
సెక్షన్ 373
18 ఏళ్లలోపు బాలికను వ్యభిచార వృత్తిలోకి దించితే ఈ సెక్షన్ ప్రకారం పదేళ్లు జైలు శిక్ష పడుతుంది.
సెక్షన్ 376(బి)
ఒకరికన్నా ఎక్కువ మంది ఉన్న బృందంలో ఒంటరిగా ఉన్న మహిళపై లైంగిక దాడి జరిగితే ఆ బృందంలోని ప్రతి వ్యక్తి నేరస్తుడే, ఈ సెక్షన్ కింద అందరికీ శిక్ష పడుతుంది.
సెక్షన్ 375
అత్యాచారం చేసినవారికి ఈ సెక్షన్ కింద ఏడేళ్లు జైలు శిక్ష నుంచి జీవిత ఖైదు.
సెక్షన్ 354
అవమానపరిచి దాడి చేస్తే ఈ సెక్షన్ ప్రకారం 5 నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది.
సెక్షన్ 496
పెళ్లైనా కానట్లు మోసగించిన పురుషులకు ఈ సెక్షన్ ప్రకారం 7 ఏళ్లు జైలు, జరిమానా.
సెక్షన్ 302
స్త్రీ హత్యకు ఈ సెక్షన్ ప్రకారం జీవిత ఖైదు.
సెక్షన్ 302(బి)
వరకట్నం కోసం భార్యను హత్య చేస్తే ఈ సెక్షన్ ప్రకారం ఏడేళ్ళు జైలు, జీవితఖైదు.
సెక్షన్ 306
ఆత్మహత్యకు ప్రేరేపిస్తే ఈ సెక్షన్ ప్రకారం పదేళ్లు జైలు, జరిమానా.
సెక్షన్ 356
అత్యాచార ఉద్దేశంతో దౌర్జన్యం చేస్తే ఈ సెక్షన్ కింద జైలు, జరిమానా
సెక్షన్ 363
కిడ్నాప్ చేస్తే ఈ సెక్షన్ కింద జైలు
సెక్షన్ 372
అత్యాచారానికి పాల్పడితే మరియు బాలికను వేశ్యా వృత్తికి ప్రేరేపిస్తే ఈ సెక్షన్ కింద పదేళ్లు జైలు.
సెక్షన్ 494
భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకుంటే ఈ సెక్షన్ కింద ఏడేళ్ళు జైలు, జరిమానా.
సెక్షన్ 495
మొదటి పెళ్ళి దాచి రెండో పెళ్ళి చేసుకుంటే ఈ సెక్షన్ కింద పదేళ్ళు జైలు.
సెక్షన్ 498(ఏ)
భర్త, అత్తింటివాళ్ళు వేధిస్తే ఈ సెక్షన్ కింద మూడేళ్ళు జైలు.
సెక్షన్ 509
స్త్రీలను అవమానపరిస్తే ఈ సెక్షన్ కింద ఏడాది జైలు.
సెక్షన్ 493
పెళ్ళి చేసుకుంటానని మోసం చేసి శృంగారం చేస్తే ఈ సెక్షన్ కింద పదేళ్ళు జైలు, జరిమానా.