Mahavir Jayanti |
మహావీర్ జయంతి
మహావీర్ అహింసను ప్రబోధించిన జైన మత ప్రచారకుడు. మహావీరుడు ఛైత్ర మాసంలో 13 వ రోజు జన్మించాడు. గ్రెగేరియన్ క్యాలెండర్లో ఏప్రిల్ నెలలో మహావీర్ జయంతి వస్తుంది. 2020 లో ఏప్రిల్ 6 న వచ్చింది.
- మొదటి పేరు: వర్ధమానుడు
- జ్ఞానోదయం తర్వాతి పేరు: మహావీరుడు
- జననం: క్రీ.పూ. 5వ శతాబ్ధం
- జన్మస్థలం: బీహార్ లోని వైశాలి సమీపంలో కుందగ్రామం
- తల్లిదండ్రులు: త్రిశాల/త్రిశల, సిద్ధార్థుడు
- భార్య: యశోధ
- కుమార్తే: అణోజ్ని/అన్నోజా (ప్రియదర్శిని)
- అల్లుడు: జామాలి (ప్రియదర్శిని భర్త)
- వంశం: జ్ఞాత్రిక వంశ క్షత్రియుడు
- బిరుదులు: నాయపుత్త, దేహదిన్న
- వర్తమాన మహావీరుడు 24 వ తీర్థంకరుడు. (చిహ్నం - సింహం)
- ఇతడు తన 30 వ ఏట ఇంటిని వదలి సన్యాసిగా మారాడు.
- 12 సంవత్సరాలు తపస్సు చేసి 42వ యేట కైవల్య స్థితిని పొంది జినుడు (అర్హంత్) అయ్యాడు. జినుడు అనగా కోర్కెలను జయించినవాడు.
- రుజుపాలిక నది ఒడ్డున జృంబిక వనం (బీహార్) లో సాల్ వృక్షం కింద కైవల్యం (జ్ఞానోదయం) పొందాడు.
- పంచవ్రతాల్లో 5 వదైన బ్రహ్మ చర్యాన్ని మహావీరుడు బోధించాడు.
- దిగంబరులు మహావీరుని అనుచరులు.
- మహావీరుడు 72 సంవత్సరాల వయస్సులో బీహార్‌లోని పావాపురి (పాట్నా దగ్గర) హస్తిపాలుడనే రాజు గృహంలో నిర్యాణం (మరణం) చెందాడు.
వీటిని కూడా చూడండీ: