NGOs Fighting For Women's Issues

స్త్రీ సమస్యలపై పోరాడే స్వచ్ఛంద సంస్థల్లో కొన్ని

భూమిక సంస్థ:
బాల్య వివాహాలు, వరకట్న వేధింవులు, గృహహింస బాధిత మహిళలకు సరైన పరిష్కారం చూపిస్తుంది హైదరాబాద్ కు చెందిన భూమిక సంస్థ (Bhumika Women’s Collective). 
Helpline Number- 18004252908 
Official Website- http://www.bhumikawomenscollective.com/

షాహీన్ సంస్థ:
బాలికల అక్రమ రవాణా, విదేశీ పెళ్లిళ్ల పేరుతో అమ్మాయిల తరలింవుల్ని సమర్థంగా అడ్డుకుంటోంది హైదరాబాద్ కి చెందిన షాహీన్ సంస్థ (Shaheen Women’s Resource and Welfare Association). 
Helpline Number- 04024386994 
Official Website- http://shaheencollective.org/

ప్రజ్వల సంస్థ:
మానవ అక్రమ రవాణా, దాడులు, వ్యభిచారం వంటి వాటికి బలైన ఆడపిల్లల సంరక్షణ కోసం పని చేస్తోంది హైదరాబాద్ కి చెందిన ప్రజ్వల సంస్థ (Prajwala Organisation).  లైంగికదాడికి గురైన మహిళలు, సెక్స్ ట్రేడ్‌లో పట్టుబడ్డ మహిళలకు పునరావాసం కల్పించడంతో పాటు వారిలో మానసిక స్థైర్యాన్నీ పెంపొందిస్తోంది. స్వయం ఉపాధిలోనూ శిక్షణనిస్తున్న ఈ ప్రజ్వల సంస్థాపకురాలు, నిర్వాహకురాలు సునీతా కృష్ణన్. 
Helpline Number- 8414237304 
Official Website- http://www.prajwalaindia.com/

  • భాగస్వామి నుంచి శారీరక, మానసిక వేధింపులూ, కట్నం కోసం అత్తింటివారు పెట్టే చిత్రహింసలు, సమస్య ఏదైనా మహిళలకు అండగా నిలబడుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లోని మహిళా శిశుసంక్షేమ విభాగాలు. ప్రతి జిల్లాలో ఉన్న ఆ సంస్థ కేంద్రాల్ని సంప్రదించి సాయం కోరవచ్చు.

వీటిని కూడా చూడండి: