History of International Day for Mine Awareness in Telugu | గని అవగాహన కోసం అంతర్జాతీయ దినోత్సవం |
గని అవగాహన కోసం
అంతర్జాతీయ దినోత్సవం - ఏప్రిల్ 4
ఉద్దేశ్యం:
మందు పాతరల (Landmines) గురించి అవగాహన పెంచడం మరియు వాటి నిర్మూలన దిశగా పురోగతి సాధించడం గని అవగాహన మరియు గని చర్యలో సహాయం కోసం అంతర్జాతీయ దినోత్సవం (International Day for Mine Awareness and Assistance in Mine Action) ముఖ్య ఉద్దేశ్యం.
ఎప్పటి నుంచి?
- 8 డిసెంబర్ 2005 న ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 4 ను గని అవగాహన మరియు గని చర్యలో సహాయం కోసం అంతర్జాతీయ దినోత్సవం (International Day for Mine Awareness and Assistance in Mine Action) గా జరుపుకోవాలని ప్రకటించింది.
- 2006 నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 4 వ తేదీన గని అవగాహన కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు.
థీమ్ (Theme):
- 2019: United Nations Promotes SDGs-Safe Ground-Safe Home
UNMAS:
- బాధితులకు సహాయం చేయడం, గని ప్రభావిత వాతావరణంలో ఎలా సురక్షితంగా ఉండాలో ప్రజలకు నేర్పడం, ల్యాండ్‌మైన్‌లకు సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందాలలో సార్వత్రిక భాగస్వామ్యం కోసం వాదించడం, యుద్ధ పేలుడు అవశేషాలు మరియు వారి బాధితులు మరియు ప్రభుత్వాలు మరియు రాష్ట్రేతర సాయుధ సమూహాలచే నిల్వ చేయబడిన ల్యాండ్‌మైన్‌లను నాశనం చేయడం ఐక్యరాజ్యసమితి మైన్ యాక్షన్ సర్వీస్ (UNMAS- United Nations Mine Action Service) యొక్క ముఖ్య లక్ష్యం.
- UNMAS Official Website- https://unmas.org
మందు పాతరలు (Landmines):
- మందు పాతర అంటే యుద్ధాల్లో వాడే ఒక ప్రేలుడు పదార్థం (Explosive Material). వీటిని సాధారణంగా నేలలో పాతి పెడతారు.
- వీటిని ఒత్తిడికి గురిచేయడం లేదా ఏదైనా ట్రిప్ వైరుకు అనుసంధానించడం ద్వారా పేల్చివేస్తారు.
- వీటిని తయారు చేయడం సులభం, తక్కువ ఖర్చు అవుతుంది. శత్రువులను నివారించడానికి ఎక్కువ విస్తీర్ణంలో సులభంగా అమర్చవచ్చు.
మందు పాతర (Landmine) |
మరికొన్ని అంశాలు:
మైన్ చర్య (Mine Action) అనేది మందు పాతరలు మరియు యుద్ధం యొక్క పేలుడు అవశేషాలను లేకుండా చేయడానికి మరియు ప్రమాదకరమైన ప్రాంతాలను గుర్తించడానికి మరియు కంచె వేయడానికి అనేక ప్రయత్నాలను సూచిస్తుంది.
వీటిని కూడా చూడండీ: