Banner 160x300

History of World Earth Day in Telugu | ప్రపంచ ధరిత్రీ దినోత్సవం

History of World Earth Day in Telugu | ప్రపంచ ధరిత్రీ దినోత్సవం
World Earth Day in telugu, World Earth day essay in telugu, History of International Mother Earth Day in telugu, History of World Earth Day, about World Earth Day, Themes of World Earth Day, Celebrations of World Earth Day, World Earth Day essay in telugu, World Earth Day in Telugu, World Earth Day, prapancha daritri dinotsavam, Day Celebrations, Days Special, What today special, today special, today history, Days, Important days, important days in telugu, important days in January, important days in February, important days in  March, important days in  April, important days in May, important days in  June, important days in  July, important days in August, important days in September, important days in October, important days in November, important days in December, special in April, special in April, days celebrations in April, popular days in April, April lo dinostavalu, special in April 22, Student Soula,

 ప్రపంచ ధరిత్రీ 
దినోత్సవం - ఏప్రిల్‌ 22

ఉద్దేశ్యం:
మనం ఉంటున్న భూమి, భూమి మీద వాతావరణం గురించి తెలుసుకోవడం, రాబోయే తరాలకు పరిశుభ్రమైన, స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడం ప్రపంచ ధరిత్రీ దినోత్సవం (World Earth Day) ముఖ్య ఉద్దేశ్యం.

ఎప్పటి నుంచి?
1970 నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22 వ తేదీన ప్రపంచ ధరిత్రీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

ఏప్రిల్‌ 22 నే ఎందుకు?
వాతావరణం కలుషితమవడం గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావడంలో ఎక్కువ మంది విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచడానికి స్ప్రింగ్ బ్రేక్ మరియు ఫైనల్ పరీక్షల మధ్య వారపు ఒక రోజైన ఏప్రిల్‌ 22 ను ప్రపంచ ధరిత్రీ దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఎంచుకున్నారు.

థీమ్ (Theme):
  • 2020: వాతావరణ చర్య (Climate Action)
  • 2019: మా జాతులను రక్షించండి (Protect Our Species)
  • 2018: ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయండి (End Plastic Pollution)

అంతర్జాతీయ భూమాతా దినోత్సవం:
అమెరికా వారు మొదలు పెట్టిన ఎర్త్ డేను అంతర్జాతీయ భూమాతా దినోత్సవం (International Mother Earth Day) గా ఐక్యరాజ్య సమితి 2009 లో ప్రకటించింది.

ప్రపంచ ధరిత్రీ దినోత్సవం చరిత్ర:
గేలార్డ్ నెల్సన్ (Gaylord Nelson):
  • గేలార్డ్ నెల్సన్ అమెరికన్ రాజకీయవేత్త మరియు పర్యావరణవేత్త.
  • 1969 జనవరిలో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో శాంటా బార్బరలో చమురు విస్పోటనం (Santa Barbara Oil Spill) జరిగింది. దీనివల్ల జరిగిన విపరీతమైన నష్టానికి వ్యతిరేకంగా విద్యార్థి యుద్ధ వ్యతిరేక ఉద్యమం (Student Anti-war Movement) మొదలైంది.
  • ఈ ఉద్యమం నుండి ప్రేరణ పొందిన గేలార్డ్ నెల్సన్ (Gaylord Nelson) వాతావరణం లో జరిగే మార్పులను వివరిస్తూ మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో, మన వంతుగా ఏమి చెయ్యాలో అందరికీ తెలియజెప్పడానికి సంవత్సరంలో ఒకరోజుని కేటాయించాలని అనుకున్నాడు. వెంటనే తన మిత్రులకు, ప్రజలకూ ఒక వార్తాపత్రిక ద్వారా ధరిత్రీ దినోత్సవం గూర్చి వివరించాడు.
  • గేలార్డ్ నెల్సన్ 22 ఏప్రిల్ 1970 న దేశవ్యాప్తంగా పర్యావరణ బోధనను నిర్వహించాలనే ఆలోచనను ప్రతిపాదించాడు. ఇతను జాతీయ సమన్వయకర్తగా డెనిస్ హేస్ (Denis Hayes) అనే యువ కార్యకర్తను నియమించుకున్నాడు. నెల్సన్ మరియు హేస్ ఈ సంఘటనకు Earth Day అని పేరు మార్చారు.
  • Earth Day Official Website- www.earthday.org
Gaylord Nelson_History of World Earth Day in Telugu | ప్రపంచ ధరిత్రీ దినోత్సవం
గేలార్డ్ నెల్సన్ (Gaylord Nelson)

జాన్ మక్కన్నేల్ (John McConnell):
  • 1969 లో శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన యునెస్కో సమావేశంలో, అమెరికా శాంతి కార్యకర్త జాన్ మక్కన్నేల్ (John McConnell) భూమిని పరిరక్షించడానికి మరియు భూమిపై శాంతిని పెంపొందించడానికి ధరిత్రీ దినోత్సవం (Earth Day) ను ప్రతిపాదించాడు. 
  • ఈయన అధ్వర్యంలో మొదటి ధరిత్రీ దినోత్సవాన్ని శాన్ ఫ్రాన్సిస్కో మరియు ఇతర నగరాల్లో 1970 మార్చి 21 న జరుపుకున్నారు. 
  • ఈయన ది ఎర్త్ సొసైటీ (Earth Society Foundation) ను 1973 లో స్థాపించాడు.
  • Earth Society Foundation Official Website- www.earthsocietyfoundation.com
  • జాన్ మక్కన్నేల్ అంతరిక్షం నుండి అపోలో 17 తీసిన భూమి యొక్క ఫోటోను చూసిన తరువాత భూమి జెండాను (Earth Flag) రూపొందించాడు. 
Earth Day Flag_History of World Earth Day in Telugu | ప్రపంచ ధరిత్రీ దినోత్సవం
భూమి జెండా (Earth Flag)
John McConnell_History of World Earth Day in Telugu
జాన్ మక్కన్నేల్ (John McConnell)

భూమిని కాపాడుకోవాలి:
మన భూమి వయసు 454 కోట్ల సంవత్సరాలకు (4600 మిలియన్) పైమాటేనని శాస్త్రవేత్తల అంచనా. ఇంత సుదీర్ఘమైన వయసు గల భూమిపై ఇప్పటి ఆధునిక మానవుల మనుగడ మొదలై దాదాపు 2 లక్షల సంవత్సరాలు మాత్రమే అవుతోంది. మనుషుల ప్రాబల్యం పెరుగుతూ వస్తున్న కొద్దీ భూమిపై వాతావరణంలో ఎన్నెన్నో మార్పులు వచ్చాయి. ఎన్నెన్నో జీవరాశులు కనుమరుగైపోయాయి. యంత్రాల వినియోగం, జీవ ఇంధన వినియోగం పెరిగినప్పటి నుంచి భూ వాతావరణంలో కాలుష్యం పెరిగింది. మనుషులు సృష్టించుకున్న నానా రకాల యంత్రాలు, వాహనాల నుంచి వెలువడే కలుషిత వాయువులు మనుషులనే ఉక్కిరిబిక్కిరి చేసే పరిస్థితులు ఇప్పుడు నెలకొని ఉన్నాయి. మానవుల స్వార్ధం ఫలితంగా ఇప్పుడు భూగోళం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇప్పటికైనా మెలకువ తెచ్చుకోకుంటే, మానవాళి మనుగడే మరింత క్లిష్టంగా మారే పరిస్థితుల్లో ఉంది.

వీటిని కూడా చూడండీ: