History Of Siblings Day In Telugu | తోబుట్టువుల దినోత్సవం |
తోబుట్టువుల
దినోత్సవం - ఏప్రిల్ 10
దీనిని అమెరికాతో పాటు కొన్ని దేశాలు మాత్రమే జరుపుకుంటాయి
ఉద్దేశ్యం:
జీవితంలో తోబుట్టువులకు ఉన్న ముఖ్యమైన పాత్ర ఏమిటో గ్రహించి, వారిని జ్ఞాపకం చేసుకోవడం మరియు గౌరవించడం తోబుట్టువుల దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
ఎప్పటి నుంచి?
1995 లో న్యూయార్క్ లోని క్లాడియా ఎవర్ట్ (Claudia Evart) అనే మహిళ జాతీయ తోబుట్టువుల దినోత్సవం (National Siblings Day) ను జరుపుకోవడం ప్రారంభించింది.
ముగ్గురు US అధ్యక్షులు ఈ దినోత్సవాన్ని గుర్తించారు. అలాగే 1998 నుండి ఇప్పటి వరకు అమెరికాలోని 49 రాష్ట్రాల గవర్నర్లు తమ రాష్ట్రంలో ఈ దినోత్సవాన్ని ఏప్రిల్ 10 న పాటించటానికి అధికారికంగా ప్రకటనలు జారీ చేశారు.
ఏప్రిల్ 10 నే ఎందుకు?
క్లాడియా ఎవర్ట్ యొక్క దివంగత సోదరి లిసెట్ (Lisette) పుట్టినరోజు ఏప్రిల్ 10.
దీనికి గుర్తుగా ఏప్రిల్ 10 ను జాతీయ తోబుట్టువుల దినోత్సవం (National Siblings Day) గా జరుపుకోవడానికి ఎంచుకుంది.
తోబుట్టువుల దినోత్సవం చరిత్ర:
- క్లాడియా ఎవర్ట్ తన సోదరుడు అలాన్ (Alan) మరియు సోదరి లిసెట్ (Lisette) ను కోల్పోయిన తరువాత, జీవితంలో తోబుట్టువులకు ఉన్న ముఖ్యమైన పాత్ర ఏమిటో ఆమె గ్రహించింది, కాబట్టి ఆమె తన తోబుట్టువుల జ్ఞాపకాన్ని గౌరవించటానికి 1995 లో జాతీయ తోబుట్టువుల దినోత్సవాన్ని సృష్టించింది.
- క్లాడియా ఎవర్ట్ 1997 లో సిబ్లింగ్స్ డే ఫౌండేషన్ (SDF- Siblings Day Foundation) ను స్థాపించింది. ఇది 1999 లో లాభపేక్ష లేని స్థితి (Non-Profit Status) ని సాధించింది. దీని లక్ష్యాలలో ఈ రోజును జాతీయ సెలవు దినంగా ఏర్పాటు చేయడం కూడా ఉంది.
- ముగ్గురు US అధ్యక్షులు ఈ దినోత్సవాన్ని గుర్తించారు (2000 లో క్లింటన్, 2008 లో బుష్, మరియు 2016 లో ఒబామా)
- అలాగే 1998 నుండి ఇప్పటి వరకు అమెరికాలోని 49 రాష్ట్రాల గవర్నర్లు తమ రాష్ట్రంలో ఈ దినోత్సవాన్ని ఏప్రిల్ 10 న పాటించటానికి అధికారికంగా ప్రకటనలు జారీ చేశారు.
మరికొన్ని అంశాలు:
- ఐరోపా (Europe) లో మే 31 న జాతీయ తోబుట్టువుల దినోత్సవాన్ని బ్రదర్స్ అండ్ సిస్టర్స్ డే (Brothers and Sisters Day) గా జరుపుకుంటారు.
- భారత్ లో రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు సూచకంగా శ్రావణ పూర్ణిమ (ఆగస్ట్ లో) రోజున జరుపుకుంటారు.
వీటిని కూడా చూడండీ:
- Siblings Day Official Website: https://siblingsday.org/
- ముఖ్యమైన దినోత్సవాలు (Important Days)