Jainism |
జైన మతం
- జైన మతాన్ని క్రీ.పూ. 9వ శతాబ్ధంలో వృషభనాథుడు స్థాపించాడు.
- జిన అన్నమాట నుంచి వచ్చిన పదం జైనం. జినులు అంటే కోరికలను జయించివారు అని అర్థం. జినుడు అయిన వ్యక్తి స్థాపించిన మతం కనుక దీనిని జైన మతం అంటారు.
- జైన మతాన్ని అనుసరించేవారు జైనులు.
- జైనమత పవిత్ర గ్రంథాలు - అంగాలు
- పూజించే ప్రదేశం - ఆరామం
- జైనుల తొలి సమావేశం సుమారు క్రీ.పూ 300 లో పాటలీపుత్రంలో జరిగింది.
- జైనుల 2వ సమావేశం పల్లబీ నగరం (గుజరాత్) లో క్రీ.శ 5-6 శతాబ్దాలలో జరిగింది. ఈ సమావేశంలో జైనమత పవిత్ర గ్రంథాలైన అంగాలు (12) ప్రాకృతం భాషలో వ్రాయడం జరిగింది.
- కళింగరాజైన ఖారవేలుడు జైన మతాన్ని వ్యాప్తి చేశాడు.
- జైనమతం ప్రకారం నిర్యాణం అనగా దేహాన్ని ఉపవాసం చేత క్షీణింపచేసి మరణించడం. దీనినే సల్లేఖనం అంటారు.
తీర్థంకరులు:
- జైన మత గురువులను తీర్థంకరులని పిలుస్తారు.
- జైన మతంలో తీర్థంకరుల సంఖ్య - 24
- తీర్థంకరులు అనగా - జీవ ప్రవాహాన్ని దాటడానికి వారధి నిర్మించినవారు అని అర్ధం
- మొదటి తీర్ధంకరుడు - ఋషభనాధుడు/ఆదినాధ (చిహ్నం - ఎద్దు). ఇతని కుమారుడే శ్రావణబెల్గోళాలోని గోమఠేశ్వరుడు.
- 2వ తీర్థంకరుడు - అజితనాధ (చిహ్నం - ఏనుగు)
- 22వ తీర్థంకరుడు - అరిష్టనేమి (చిహ్నం - శంఖం)
- 23వ తీర్థంకరుడు - పార్శ్వనాధుడు (చిహ్నం - పాము)
- 24వ తీర్థంకరుడు - వర్ధమాన మహావీరుడు (చిహ్నం - సింహం)
- తీర్థంకరుల జీవిత చరిత్ర తెలిపే గ్రంధం - కల్ప సూత్ర (కల్పసూత్ర గ్రంథ రచయిత - భద్రబాహు)
జైన మత సిద్ధాంతాలు:
ప్రధానంగా 2 సిద్ధాంతాలు కలవు. అవి
1) పంచవ్రతాలు:
- అహింస - జీవహింస చేయకూడదు
- సత్యం - ఎల్లప్పుడూ సత్యమునే పలకాలి
- అపరిగ్రహ - ఆస్తిపాస్తులు ఉండకూడదు
- ఆస్తేయం - దొంగతనాలు చేయరాదు
- బ్రహ్మచర్యం - ఇంద్రియాలను, కోరికలను అదుపులో ఉంచుకోవాలి
- పంచవ్రతాల్లో మొదటి నాల్గింటిని పార్శ్వనాధుడు బోధించగా, 5వదైన బ్రహ్మ చర్యాన్ని మహావీరుడు బోధించాడు.
- సమ్యక్ విశ్వాసం (సరియైన విశ్వాసము)
- సమ్యక్ జ్ఞానము (సరియైన జ్ఞానము)
- సమ్యక్ క్రియ (సరియైన క్రియ)
జైనమతంలో చీలిక:
జైనమతం రెండుగా చీలిపోయింది
1) శ్వేతాంబరులు:
- వీరు తెల్లని దుస్తులు ధరించేవారు
- శ్వేతాంబర శాఖను ప్రారంభించినది - స్థూలభద్ర
- శ్వేతాంబరులు పార్శ్వనాధుని అనుచరులు
- దిగంబర శాఖను ప్రారంభించిన వ్యక్తి - భద్రబాహు
- క్రీ.పూ 300 కాలంలో క్షామం ఏర్పడి మగధ ప్రాంతంలోని కొందరు జైనులు భద్రబాహు నాయకత్వంలో శ్రావణ బెల్గోళా (కర్ణాటక) లోకి వలస వచ్చారు.
- వీరు వస్త్రాలను విసర్జించి దిగంబరులుగా మారారు.
- దిగంబరులు మహావీరుని అనుచరులు.
- దిగంబర జైనమతానికి పుట్టినిల్లు - శ్రావణబెల్గోళా
- శ్రావణబెల్గోళాలో బాహుబలి (గోమఠేశ్వర) విగ్రహం (నగ్నవిగ్రహం) ను చాముండరాయుడు క్రీ.శ 984లో ప్రతిష్టించాడు. గోమఠేశ్వరుడు మొదటి తీర్థంకరుని కుమారుడు.
తీవ్ర స్థాయిలో అహింస:
జైనమతంలో ఆచరణ సాధ్యం కానంత తీవ్ర స్థాయిలో అహింస ఉంటుంది. జైనమతం ప్రజాదరణ పొందలేకపోవడానికి ఇది ఒక కారణం.
గాలి పీలిస్తే గాల్లోని సూక్ష్మజీవులు చచ్చిపోతాయని మూతికి గుడ్డ కట్టుకుంటారు. నీళ్ళు వడగట్టుకుని తాగుతారు. అడుగు తీసి అడుగువేసేటప్పుడు కాలికింద పడి సూక్ష్మజీవులు చచ్చిపోతాయని నెమలీకలతో చేసిన పొరకతో నడిచినంతమేరా అడుగేసేముందు నేలను ఊడ్చుకుంటూపోతారు. నేలను చీల్చి దున్నే వ్యవసాయం చేయరు. నేలకింద పండే దుంపలు, ఉల్లి, వెల్లుల్లి, మసూర్ గింజల్లాంటివి కూడా తినరు. అహింసయే పరమ ధర్మం అని విశ్వసిస్తారు.
మరికొన్ని అంశాలు:
- 2014 జనవరి 17న కేంద్ర ప్రభుత్వం జైనులను మైనారిటీలుగా గుర్తించింది.
- భారత్ లో ప్రసిద్ధ జైన ఆలయాలు: రాజస్థాన్ లో దిల్వారా (మౌంట్ అబూ), మధ్యప్రదేశ్ లోని ఖజరహో.
వీటిని కూడా చూడండీ: