History of World Hearing Day In Telugu | ప్రపంచ వినికిడి దినోత్సవం

History of World Hearing Day In Telugu | ప్రపంచ వినికిడి దినోత్సవం
World Hearing Day
ప్రపంచ వినికిడి
దినోత్సవం - మార్చి 3

లక్ష్యం:
వినికిడి లోపంకు మెరుగైన చికిత్స, వినికిడి సంరక్షణకు తగిన సమాచారం గురించి ప్రజల్లో అవగాహన కలిగించడం ప్రపంచ వినికిడి దినోత్సవం (World Hearing Day) ముఖ్య లక్ష్యం.

ఎప్పటి నుంచి?
  • వినికిడి గురించి మానవాళికి ప్రచారం కలిగించడం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO- World Health Organization) ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది.
  • 2007 నుంచి ప్రతి సంవత్సరం మార్చి 3 న ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
  • 2016 కి ముందు దీనిని అంతర్జాతీయ చెవి సంరక్షణ దినోత్సవం (International Ear Care Day) అని పిలిచేవారు.
  • ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన అంధత్వం మరియు చెవుడు నివారణ కార్యాలయం ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది.

థీమ్ (Theme):
  • 2020: జీవితానికి వినికిడి: వినికిడి లోపంతో మిమ్మల్ని మీరు పరిమితం చేసుకోకండి (Hearing For Life. Don’t Let Hearing Loss Limit You)
  • 2019: Check Your Hearing!
  • 2018: Hear The Future
  • 2017: Action For Hearing Loss: Make A Sound Investment
  • 2016: Childhood Hearing Loss: Act Now, Here Is How!
  • 2015: Make Listening Safe

LOGO:
History of World Hearing Day In Telugu | ప్రపంచ వినికిడి దినోత్సవం
World Hearing Day LOGO


గణాంకాలు:
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం - ప్రపంచ వ్యాప్తంగా 46.6 కోట్ల మంది పిల్లలు, పెద్దలు వినికిడి లోపంతో బాధపడుతున్నారు. (2019 నాటికి)

"వినికిడి లోపంతో ఎంతోమంది శారీరకంగా మానసికంగా, సామాజికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. మంచి విషయం ఏంటంటే వినికిడి లోపాన్ని సరిదిద్దటానికి ఇప్పుడు మంచి చికిత్సలు, సాధనాలు అందుబాటులో ఉండటం. సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకుంటే చాలావరకు ఇబ్బందుల పాలు కాకుండా చూసుకోవచ్చు. అందువల్ల వినికిడి లోపం గురించి తెలుసుకొని ఉండటం, అవగాహన కలిగుండటం ప్రతి ఒక్కరి బాధ్యత."

మరికొన్ని అంశాలు:
  • చెవి అధ్యయనం - ఓటాలజి (Otology)
  • మానవ శరీరంలో అతి చిన్న ఎముక - కర్ణాంతరాస్థి (Stepes)
  • చెవిలోని ఎముకల సంఖ్య - 3+3 = 6
  • చెవి దగ్గర ఉండే గ్రంథులు - పెరోటిడ్ గ్రంథులు
  • 85 డెసిబెల్స్ దాటితే మనిషి వినికిడి మీద దుష్పలి తాలు కలుగుతాయి. 120 డెసిబెల్స్ దాటితే చెవిలో నొప్పి మొదలవుతుంది. ధ్వని తీవ్రత ప్రమాణం - డెసిబెల్ (డెసిబెల్ అనేది బెల్ లో 1/10వ వంతు)
  • ధ్వని తరంగాలు చెవిలో కర్ణభేరిని కనీసం 1/10 సెకన్ల కాలం పాటు తాకితే వినికిడి జ్ఞానం కలుగుతుంది.
  • ఆరోగ్యవంతమైన మానవుడు ధ్వని తరంగాలను 20 HZ నుండి 20,000 HZ (20 KHZ) మాత్రమే వినగలడు. ఈ అవధిని శ్రవ్య అవధి అని, ఈ తరంగాలను శ్రావ్య తరంగాలు అని అంటారు.

వీటిని కూడా చూడండి: