Tuesday, March 3, 2020

History of World Wildlife Day In Telugu | ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం

History of World Wildlife Day In Telugu | ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం
World Wildlife Day
ప్రపంచ వన్యప్రాణి
దినోత్సవం - మార్చి 3

లక్ష్యం:
  • వన్యప్రాణుల గురించి ప్రజలలో అవగాహన పెంచడం మరియు వాటి రక్షణ కోసం కృషి చేయడానికి వారిని ప్రోత్సహించడం.
  • CITES మార్గదర్శకత్వంలో అవసరమైన విధానాలు మరియు చట్టాలను అమలు చేయడం ద్వారా వన్యప్రాణులను రక్షించడం మరియు పరిరక్షించడం అనే లక్ష్యంతో ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం (World Wildlife Day) జరుపుకుంటారు.

ఎప్పటి నుంచి?
  • 2013 లో బ్యాంకాక్‌లో జరిగిన CITES యొక్క 16 వ పార్టీల సమావేశంలో (COP 16- Conference Of Parties) ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని థాయిలాండ్ మొదట ప్రతిపాదించగా, తరువాత ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 20 డిసెంబర్ 2013 న తన 68 వ సెషన్‌లో మార్చి 3 వ తేదీని ప్రపంచ వన్యప్రాణి దినోత్సవంగా జరుపుకునేందుకు ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
  • 2014 నుంచి ప్రతి సంవత్సరం మార్చి 3 న ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

మార్చి 3 నే ఎందుకు?
  • పర్యావరణంలో వృక్షజాలం మరియు జంతుజాలం ​​యొక్క సహకారాన్ని మరియు భూమిపై జీవన ఉనికికి వాటి అవసరాన్ని గుర్తించి, ఐక్యరాజ్యసమితి 1973 మార్చి 3CITES (CITES- Convention on International Trade in Endangered Species‌) ను ఏర్పాటు చేసింది. దీనికి గుర్తుగా మార్చి 3 వ తేదీన ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని జరుపుకుంటారు.

థీమ్ (Theme):
  • 2020- భూమిపై ఉన్న ప్రాణులన్నింటినీ నిలబెట్టడం (Sustaining all life on earth)
  • 2019- నీటి క్రింద జీవితం: ప్రజలు మరియు గ్రహం కోసం (Life Below Water: For People And Planet)
  • 2018- పెద్ద పిల్లులు - వేటాడే జంతువులు ముప్పు (Big Cats – Predators Under Threat)
  • 2017- యువ స్వరాలను వినండి (Listen to The Young Voices)
  • 2016- వన్యప్రాణుల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది (The Future of Wildlife is in Our Hands), మరియు Sub-Theme ఏనుగుల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది (The Future of Elephants is in Our Hands)
  • 2015- వన్యప్రాణుల నేరాల గురించి తీవ్రంగా ఆలోచించాల్సిన సమయం ఇది (It’s time to Get Serious About Wildlife Crime)

CITES:
  • 1963 లో ది వరల్డ్ కన్జర్వేషన్ యూనియన్ (IUCN-  The World Conservation Union) సభ్యుల సమావేశంలో ఆమోదించిన తీర్మానం ఫలితంగా CITES ముసాయిదా చేయబడింది.
  • 3 మార్చి 1973 లో వాషింగ్టన్ డిసి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 80 దేశాల ప్రతినిధుల సమావేశంలో Text Of The Convention చివరకు అంగీకరించబడింది మరియు 1 జూలై 1975 న CITES అమలులోకి వచ్చింది.
  • CITES అనేది వన్యప్రాణి జాతులకు విఘాతం కలగకుండా వన్య జంతు, వృక్ష జాతులకు చెందిన అంతర్జాతీయ వాణిజ్యం నియంత్రించుటకు UN ద్వారా ఏర్పాటు చేయబడిన అంతర్జాతీయ ఒప్పందం.
  • దీనికి దేశాలు  మరియు ప్రాంతీయ ఆర్థిక సమైక్యత సంస్థలు స్వచ్ఛందంగా కట్టుబడి ఉంటాయి. కన్వెన్షన్ కు కట్టుబడి ఉండటానికి అంగీకరించిన దేశాలను పార్టీలు (Parties) అంటారు. ఇప్పుడు 183 పార్టీలు ఉన్నాయి.

వన్యప్రాణి సంరక్షణ చట్టాలు (Wildlife Conservation Laws):
  1. మద్రాసు అడవి ఏనుగుల సంరక్షణ చట్టం-1873
  2. భారతీయ ఏనుగుల భద్రతా చట్టం-1879
  3. అటవీ పక్షులు, జంతువుల భద్రతా చట్టం-1912
  4. బెంగాల్ ఖడ్గమృగ సంరక్షణ చట్టం-1932
  5. అస్సాం ఖడ్గమృగ సంరక్షణ చట్టం-1954
  6. జాతీయ వన్యప్రాణుల సంరక్షణ చట్టం-1972
  7. అడవుల సంరక్షణ చట్టం-1980

గణాంకాలు:
  • నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ (IBWL- Indian Board for WildLife) ను 1952 లో నెలకొల్పారు.
  • దేశంలో మొత్తం సజీవ జాతులు 1,50,000 ఉన్నట్లు అంచనా.
  • ప్రస్తుతం దేశంలో 103 జాతీయ పార్కులున్నాయి.
  • అభయారణ్యాల సంఖ్య- 500 పైగా
  • బయోస్ఫియర్ రిజర్వులు- 18
  • టైగర్ రిజర్వులు- 49
  • ఎలిఫెంట్ రిజర్వులు- 32

మరికొన్ని అంశాలు:
  • సహజ పర్యావరణ అడవులు, సరస్సులు, నదులు, చెరువులు, కుంటలు, కాలువలు, చుట్టూ ఉన్న పక్షులు, జంతువులు, చెట్లు, వీటి పట్ల దయ కలిగి ఉండడం ప్రతి పౌరుడి బాధ్యత అని మన రాజ్యాంగంలో ఆర్టికల్‌ 51(A)(‌G) లో ఉంది.

వీటిని కూడా చూడండి:

No comments:

Post a Comment