World Consumer Rights Day |
ప్రపంచ వినియోగదారుల హక్కుల
దినోత్సవం - మార్చి 15
ఉద్దేశ్యం:
వినియోగదారులకు తమ హక్కులు, చట్టాల గురించి అవగాహన కల్పించడం.
ఎప్పటి నుండి?
- 1972 లో అంతర్జాతీయ వినియోగదారుల సంఘాల సంస్థ ప్రాంతీయ సంచాలకుడు అన్వర్ ఫజల్ మార్చి 15 తేదీనే ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా పరిగణించాలని తీర్మానించాడు.
- దాంతో 1973 నుంచి ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ సంవత్సరం మార్చి15 న ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
మార్చి15 నే ఎందుకు?
1962 మార్చి 15 న అప్పటి అమెరికా దేశాధ్యక్షుడు జాన్ ఎఫ్.కెన్నెడి దేశ పౌరుల కోసం ప్రప్రథమంగా వినియోగదారుల హక్కులు ప్రకటించారు.
థీమ్ (Theme):
- 2020: The Sustainable Consumer
- 2019: Trusted Smart Products
- 2018: Making Digital Marketplaces Fairer
వినియోగదారులెవరు?
వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం-1986 ప్రకారం తమ అవసరార్థం వస్తువులు లేదా సేవలు కొనుగోలు చేసిన వారు వినియోగదారులు. అలాగే కొనుగోలుదారుల అనుమతితో ఆ వస్తువుల లేదా సేవలను వినియోగించుకునేవారు సైతం వినియోగదారులే.
చరిత్ర:
- మార్చి 15 న ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా జరుపుకుంటామని మనందరికీ తెలుసు. కానీ దీనికోసం జరిగిన పోరాటాలు, ఉద్యమాల గురించి ఎంతమందికి తెలసు.
- వినియోగదారుల ఉద్యమ పితామహుడిగా పేరుగాంచిన అమెరికా దేశానికి చెందిన రాల్ఫ్‌నాడార్ (Ralph Nader) వినయోగదారుల ఉద్యమానికి మూల పురుషుడు. ఓ సంస్థ తయారు చేస్తున్న కార్లలో నాణ్యత లోపంపై ఆయన ఉద్యమించారు. ఆ తర్వాత వస్తువుల తయారీ, అమ్మకాల్లో అక్కడి వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు.
- ఈయన కృషివల్లే ప్రపంచమంతటా వినియోగదారుల ఉద్యమ సంఘాలు ఏర్పడ్డాయి. ఇవి వినియోగదారుల సంరక్షణ, సంక్షేమం, సేవలు, విద్య తదితర అంశాల్లో నెలకొన్న అనిశ్చితి వల్లే ప్రత్యేక హక్కుల కోసం గతంలో ప్రపంచవ్యాప్తంగా అనేక ఉద్యమాలు జరిపాయి.
- మొదటిసారిగా 1920 లో అమెరికాలో ప్రారంభమైన వినియోగదారుల ఉద్యమం క్రమక్రమంగా వివిధ దేశాలకు వ్యాపించింది.
- 1962 మార్చి 15 న అప్పటి అమెరికా దేశాధ్యక్షుడు జాన్ ఎఫ్.కెన్నెడి దేశ పౌరుల కోసం ప్రప్రథమంగా వినియోగదారుల హక్కులు ప్రకటించారు.
- భారతదేశంలో వినియోగదారుల రక్షణ చట్టం 1986 డిసెంబరు 24 వ తేదీన అమల్లోకి వచ్చినందున డిసెంబరు 24 న జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
వీటిని కూడా చూడండి:
- Consumers International Official Website
- జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం (National Consumer Rights Day)
- ముఖ్యమైన దినోత్సవాలు (Important Days)