History of Pi (π) Day In Telugu | పై దినోత్సవం


History of Pi Day In Telugu | పై దినోత్సవం
Pi (π) Day
పై (π)
దినోత్సవం - మార్చ్ 14

  • ఒక గణిత గుర్తుకు ప్రత్యేకంగా దినోత్సవం జరపడం ఆశ్చర్యం అనిపించినా ఇది నిజం.
  • π యొక్క విలువ 22/7 అంటే సుమారుగా 3.1415.
  • π యొక్క విలువ 3.1415 లోని మొదటి మూడు సంఖ్యలను అనగా 3 (మార్చి), 14(14 వ తేది ) గా తీసుకొని ప్రతి సంవత్సరం π దినోత్సవం జరుపుతున్నారు.‌
  • π విలువ 22/7 కావున జులై 22 వ తేదీని π సామీప్య/ఉజ్జాయింపు/రమారమీ దినోత్సవం (Pi Approximation Day) గా జరుపుకుంటారు.
  • π విలువ నాలుగు దశాంశాల వరకు 3.1415 కావడంవల్ల 2015 సంవత్సరం మార్చ్ నెల 14 వ తేదీని అమెరికన్లు సూపర్ π దినోత్సవంగా జరుపుకున్నారు. తిరిగి సూపర్ π దినోత్సవం శతాబ్దం తర్వాత అంటే  2115 లో సంభవిస్తుంది.

ఎప్పటి నుంచి?
  • 1988 లో మొట్టమొదటి సారిగా Pi డే అధికారిక లేదా పెద్ద ఎత్తున వేడుకను అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త లారీ షా (Larry Shaw) నిర్వహించారు.
  • United States House of Representatives 2009 లో  Pi Day హోదాకు మద్దతు ఇచ్చారు.

π అంటే?
  • π అనగా ఒక వృత్తం యొక్క చుట్టుకొలత మరియు వ్యాసముల నిష్పత్తి.
  • గణిత స్థిరాంకాలలో కరణీయ సంఖ్య (దశాంశం తదుపరి శేషము 0 అంటె శూన్యము రాకుండా, ఒకే అంకె పునరావృతం కాకుండా, అంకెలపరంపరంగా అనంతంగా కొనసాగుతూనే ఉంటుంది) అయిన π చాలా ముఖ్యమైనది.
History of Pi Day In Telugu | పై దినోత్సవం
Courtesy: www.piday.org
  • చుట్టుకొలతను ఆంగ్లంలో Perimeter అంటారు. దీనికి గ్రీకు పదం "περίμετρος". ఆ పదంలోని మొదటి అక్షరమైన π ను ఈ విలువకు సంకేతంగా గణిత శాస్త్రవేత్త విలియమ్ జోన్స్ (William Jones) 1706 లో మొదటి సారిగా ఉపయోగించాడు. తరువాత కొంత కాలానికి 1737 లో స్విస్ గణిత శాస్త్రజ్ఞుడు లియొనార్డ్ ఆయిలర్ (Leonhard Euler) ద్వారా ఇది బహుళ ప్రచారంలోకి వచ్చింది.

π గురించి మరిన్ని విశేషాలు తెల్సుకుందాం:
  • భారత గణితవేత్తలు వేదాంగాలలోనూ, సులభ సూత్రాలలోనూ దీన్ని చర్చించి, విలువను గణించారు. ఒక వృత్తం చుట్టుకొలత దాని వ్యాసానికి మూడింతల పొడుగుంటుందని లెక్కించారు.
  • మహాభారత భీష్మ పర్వం‌లో (XII: 44) π విలువను 3 గా సూచించారు.
  • ఆర్య భట్ట దీనిని 62832/20000 = 3.1416 గా గణించాడు. నాలుగు దశాంశాలవరకూ ఈ విలువ ఖగోళ శాస్త్రం‌లో ఖచ్చితంగా సరిపొయింది.
  • గణీత శాస్త్రవేత్తలు 22/7 ఫలితాన్ని 64 కోట్ల దశాంశం వరకు లెక్కించారు. విచిత్రం, ఒక్కసారంటే ఒక్కసారి కూడా 123456 లు వరుసగా రాలేదు.
  • గ్రీకువర్ణమాలలో π స్థానం 16, అలాగే ఆంగ్ల వర్ణమాలలోనూ  P అక్షర స్థానం 16.
  • విశ్వ విఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్  జన్మించింది కూడా మార్చి నెల 14 వ తేదీనే.  
  • π విలువను 64 కోట్ల దశాంశాల వరకు పరిష్కరించారు. ఈ సంఖ్యను  ఏకబిగిన చదవడానికి 133 సంవత్సరాల కాలం పడుతుంది. అంటే మళ్ళీ వచ్చే సూపర్ π దినోత్సవం (2115) వరకు కూడా చదవడం పూర్తికాదు.
  • 14 మార్చి నుండి 22 జులై వరకు (రెండు తేదీలను కలిపి) 131 రోజులు. ఐక్యూ 131 గా ఉన్నవారిని అత్యంత మేధో సంపత్తిగలవారిగా పరిగణిస్తారు. ఇంకా 131 ఒక ప్రధాన సంఖ్య.

వీటిని కూడా చూడండి: