History of National Mathematics Day in Telugu | జాతీయ గణిత దినోత్సవం


History of National Mathematics Day in Telugu | జాతీయ గణిత దినోత్సవం - డిసెంబర్ 22
National Mathematics Day in telugu, National Mathematics day essay in telugu, History of National Mathematics Day, about National Mathematics Day, Themes of National Mathematics Day, Celebrations of National Mathematics Day, National Mathematics Day, jathiya ganitha dinotsavam, Day Celebrations, Days Special, What today special, today special, today history, Days, Important days, important days in telugu, important days in January, important days in February, important days in  March, important days in  April, important days in May, important days in  June, important days in  July, important days in August, important days in September, important days in October, important days in November, important days in December, special in December, days celebrations in December, popular days in December, December lo dinostavalu, special in December 22, Student Soula,

జాతీయ గణిత దినోత్సవం - డిసెంబర్ 22


ఉద్దేశ్యం:
  • యువతలో శాస్త్రీయ స్వభావాన్ని పెంపొందించడం మరియు గణిత ప్రపంచంలో శిశువు అడుగులు వేయడానికి వారిని ప్రోత్సహించడం మరియు ఆర్థిక, విజ్ఞాన శాస్త్రం మరియు ఇతర విభాగాలలో దాని అనువర్తనాన్ని అన్వేషించడంతో పాటు గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ ను స్మరించుకుని, గౌరవించటం జాతీయ గణిత దినోత్సవం (National Mathematics Day) యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
  • భారతదేశంలోని వివిధ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మరియు విద్యా సంస్థలలో జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటారు. 

ఎప్పటి నుంచి?
  • 2012 నుంచి  ప్రతీ సంవత్సరం డిసెంబర్ 22 ను జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు.

డిసెంబర్ 22 నే ఎందుకు?
  • భారత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ (1887 డిసెంబర్ 22 - 1920  ఏప్రిల్ 26) పుట్టిన రోజైనా డిసెంబర్ 22 ను జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు.
  • 2012 ఫిబ్రవరి 26 న మద్రాస్ విశ్వవిద్యాలయంలో జరిగిన రామానుజన్ 125వ జయంతి ప్రారంభ వేడుకల్లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రామానుజన్ పుట్టిన రోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించారు. అలాగే 2012 ను జాతీయ గణిత సంవత్సరంగా జరుపుకుంటామని ప్రకటించారు.

గణిత శాస్త్రంలో అవార్డులు:

(1) ఫీల్డ్స్ పతకం (Fields Medal):
  • గణిత శాస్త్రంలో విశేష కృషి చేసిన ప్రపంచంలోని యువ గణిత శాస్త్రవేత్తలకు లభించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బహుమతి. గణిత శాస్త్రంలో నోబెల్ బహుమతిగా దీనిని పరిగణిస్తారు. 
  • 40 సంవత్సరాలు కంటే తక్కువ వయస్సు కలిగి ఉన్న ఇద్దరు, ముగ్గురు లేదా నలుగురు గణిత శాస్త్రవేత్తలకు, ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఇంటర్‌నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ మేథమేటీషీయన్స్ (ICM- International Congress of Mathematicians) సందర్భంగా ఈ పురస్కారం ఇస్తారు.
  • ఫీల్డ్స్ పురస్కారం మొట్టమొదటి సారి 1936లో ఫిన్లాండుకు చెందిన లార్స్ అల్ఫోర్స్ మరియు అమెరికాకు చెందిన జెస్సి డగ్లస్ లకు లభించింది.
  • భారతీయ మూలాలున్న ఆస్ట్రేలియన్ గణిత శాస్త్రవేత్త అక్షయ్ వెంకటేష్ కు 2018 లో ఫీల్డ్స్ పురస్కారం లభించింది.

(2) అబెల్ బహుమతి (Abel Prize):
  • అబెల్ బహుమతి 1 జనవరి 2002 న స్థాపించబడింది. గణిత శాస్త్రంలో అత్యుత్తమ శాస్త్రీయ కృషికి అబెల్ బహుమతిని ఇవ్వడం దీని ఉద్దేశ్యం.
  • జూన్ 2003 న మొదటిసారి ఫ్రాన్స్ దేశానికి చెందిన జీన్-పియరీ సెర్రే కు ఈ బహుమతి లభించింది. 
  •  బహుమతిని నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ (Norwegian Academy of Science and Letters) ప్రదానం చేస్తుంది. 
  • భారతీయ అమెరికన్ అయిన ఎస్.ఆర్.శ్రీనివాస వరధన్ కు 2007లో అబెల్ బహుమతి లభించింది.

ఇతర అంశాలు:
  • గ్రీకు గణిత శాస్త్రవేత్త ఆర్కిమెడిస్ (Archimedes) ను గణిత శాస్త్ర పితామహుడిగా భావిస్తారు. 
  • సున్నా (0) ను ప్రపంచానికి పరిచయం చేసింది మన భారతీయులే. 
  • π డే (Pi Day) ను మార్చి 14  వ తేదీన జరుపుకుంటారు.

వీటిని కూడా చూడండీ: