Home

CV Raman Biography in Telugu | చంద్రశేఖర్ వెంకటరామన్ జీవిత చరిత్ర

CV Raman Biography In Telugu | చంద్రశేఖర్ వెంకటరామన్ జీవిత చరిత్ర

C.V.Raman Biography
సి.వి.రామన్ జీవిత చరిత్ర
****

1930 లో భౌతిక శాస్త్రంలో నోబెల్  బహుమతిని పొందారు. ఆసియాలోనే విజ్ఞాన శాస్త్రంలో ఈ అవార్డును పొందిన మొదటి వ్యక్తి. 


  • పేరు: సి.వి.రామన్‌ (CV Raman)
  • పూర్తి పేరు: చంద్రశేఖర్ వెంకటరామన్ 
  • జననం: 7 నవంబర్ 1888
  • మరణం: 21 నవంబర్ 1970 (బెంగళూరులో)
  • జన్మస్థలం: తిరుచినాపల్లి సమీపంలోని అయ్యన్ పెటాయ్ అనే గ్రామం
  • తల్లిదండ్రులు: పార్వతి అమ్మాళ్, చంద్రశేఖరన్ రామనాథన్ అయ్యర్
  • పెళ్ళీ: 6 మే 1907 లో జరిగింది.
  • భార్య: లోకసుందరి అమ్మాళ్
  • పిల్లలు: చంద్రశేఖర్ మరియు రేడియో-ఖగోళ శాస్త్రవేత్త రాధాకృష్ణన్

చదువు: 
  • రామన్ తండ్రి విశాఖపట్నంలోని Mrs A.V. Narasimha Rao కళాశాలలో లెక్చరర్ గా పనిచేయడం వల్ల బాల్యం, విద్యాభ్యాసం అక్కడే జరిగింది.
  • తర్వాత రామన్ తండ్రి మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాలలో గణితం మరియు భౌతిక శాస్త్రంలో లెక్చరర్ గా చేరాడు. రామన్ కూడా 1902 లో ఈ కళాశాలలో విద్యార్థిగా చేరాడు.
  • 1904 లో అతను మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి Bsc డిగ్రీ పొందాడు. అక్కడ అతను మొదటి స్థానంలో నిలిచాడు మరియు భౌతిక శాస్త్రంలో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.
  • 1907 లో మద్రాస్ విశ్వవిద్యాలయంలో Msc  డిగ్రీ పూర్తి చేశాడు.
ఉద్యోగం:
  • తల్లిదండ్రుల కోరిక మేరకు కలకత్తా ప్రభుత్వ ఆర్థికశాఖలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్‌గా చేరారు.
  • విజ్ఞాన పరిశోధన తృష్ణ వలన 1917 లో తను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి కలకత్తా యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ గా చేరారు.
  • అదే సమయంలో కలకత్తాలోని ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్ (IACS- Indian Association for the Cultivation of Science) లో పరిశోధనను కొనసాగించాడు.
రామన్ ప్రభావం (Raman Effect):
  • సముద్రపు నీటిపై సూర్యకాంతి పడినప్పుడు ఆ కాంతిలోని నీలం రంగు ఎక్కువగా పరిక్షేపం (Scattering) చెంది మన కంటికి చేరడం వల్లనే సముద్రం నీలంగా కనిపిస్తుందని సి.వి.రామన్ సిద్ధాంతీకరించాడు. ఇలా ద్రవాలపై పడిన కాంతి కిరణాలు ఎలా పరిక్షేపం చెందుతాయో (చెదురుతాయో) తెలిపే పరిశోధన ఫలితాన్నే రామన్ ప్రభావం (Raman Scattering or Raman effect) అంటారు.
  • కాంతి కిరణాలు ఒక ద్రవ పదార్థంపై పడినప్పుడు ఆ కాంతి పరిక్షేపం చెందుతుంది. అంటే కాంతి కిరణాల్లోని ఫోటాన్ కణాలు, ద్రవ పదార్థాల పరమాణువులపై పడి పరిక్షేపం చెందుతాయి. చాలా ఫోటాన్లు పడేటప్పటి పౌనఃపున్యంలోనే చెదిరిపోతే, కొన్ని ఫోటాన్లు మాత్రం అంతకు తక్కువ పౌనఃపున్యంతో పరిక్షేపం చెందుతాయి. అంటే పడిన కాంతిలో కొంత భాగం మాత్రం వేరే పౌనఃపున్యంతో చెదురుతుంది. ఇదే రామన్ ఎఫెక్ట్. దీన్ని కనుగొన్నందుకు ఆయన 1930లో నోబెల్ బహుమతిని అందుకున్నారు.
  • రామన్ ప్రభావం (Raman Effect) గురించి పూర్తి సమాచారం కోసం ఇక్కడ Click చేయండి.
History of National Science Day in Telugu | జాతీయ విజ్ఞాన దినోత్సవం

అవార్డులు: 
  • 1929 - నైట్‌హుడ్ బిరుదు
  • 1930 -  నోబెల్ అవార్డు (భౌతిక శాస్త్రంలో)
  • 1941 - Franklin Medal
  • 1954 - భారతరత్న అవార్డు
  • 1957 -  లెనిన్ శాంతి బహుమతి

ఇతర అంశాలు:
  • సి.వి.రామన్ గారు రామన్‌ ఎఫెక్ట్‌ (Raman Effect) ను కనుగొన్న (పరిశోధన ఫలితాన్ని ధ్రువపరిచిన) రోజైన ఫిబ్రవరి 28 (1928) జ్ఞాపకార్థం 1987 నుంచి ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 28ను జాతీయ విజ్ఞాన దినోత్సవం (National Science Day) గా భారతదేశంలో జరుపుకుంటున్నారు.