Home

History of World Thinking Day in Telugu | ప్రపంచ ఆలోచనా దినోత్సవం - ఫిబ్రవరి 22

History of World Thinking Day in Telugu | ప్రపంచ ఆలోచనా దినోత్సవం - ఫిబ్రవరి 22 | Student Soula Tags: History of World Thinking Day in telugu, about World Thinking Day in telugu, World Thinking Day essay in telugu, prapamcha aalochana dinotsavam, theme of World Thinking Day in telugu, what is the World Thinking Day history in telugu, why celebrate World Thinking Day in telugu, Celebrations behind World Thinking Day in telugu, Day Celebrations, Days Special, What today special, today special, today history, Days, Important days, important days in telugu, important days in January, important days in February, important days in  March, important days in  April, important days in May, important days in  June, important days in  July, important days in August, important days in September, important days in October, important days in November, important days in December, special in February, days celebrations in February, popular days in February, February lo dinostavalu, special in February 22, Student Soula,

WORLD THINKING DAY
ప్రపంచ ఆలోచనా దినోత్సవం
****

లక్ష్యం: 
  • మహిళలు మరియు బాలికలందరూ తమ ఆలోచనలను స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి, ప్రాదాన్యతా సమస్యలపై చర్చల్లో పాల్గొనడానికి మరియు పరిష్కారాలను అందిచడానికి ఒక వేదికను అందించడం ప్రపంచ ఆలోచనా దినోత్సవం (World Thinking Day) యొక్క ప్రాథమిక లక్ష్యం.
  • ఈరోజును స్కౌట్ దినోత్సవం (Scout Day) గా కూడా జరుపుకుంటారు.

ఎప్పటి నుండి జరుపుకుంటున్నారు?
  • 1926 నుండి ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 22 వ తేదీన ప్రపంచ ఆలోచనా దినోత్సవం (World Thinking Day) జరుపుకుంటున్నారు.

ఫిబ్రవరి 22 నే ఎందుకు?
  • స్కౌటింగ్ మరియు గైడింగ్ వ్యవస్థాపకుడు రాబర్ట్ బాడెన్ పావెల్ మరియు గర్ల్ గైడింగ్, గర్ల్ స్కౌటింగ్ అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించిన అతని భార్య ఒలేవ్ బాడెన్ పావెల్ జన్మదినం ఫిబ్రవరి 22 కావడంతో వారి జ్ఞాపకార్థం ఫిబ్రవరి 22ను ప్రపంచ ఆలోచనా దినోత్సవం (World Thinking Day) గా జరుపుకుంటారు. 
  • ఈ దినోత్సవాన్ని World Association of Girl Guides and Girl Scouts (WAGGGS) ప్రతీ సంవత్సరం నిర్వహిస్తుంది.

థీమ్ (Theme):
  • 2023: Our World, Our Peaceful Future
  • 2022: Our World, Our Equal Future: The Environment and Gender Equality.

స్కౌట్స్ అండ్ గైడ్స్ (Scouts & Guides):
  • బాలుర బృందాలను స్కౌట్స్ అని, బాలికల బృందాలను గైడ్స్ అని అంటారు.
  • పాఠశాల కళాశాల బాలబాలికల్లో శారీరక దృఢత్వం, మానసిక పరిపక్వత, ఆధ్యాత్మిక అభివృద్ధిని ఆశించి, బాలలకు సైనిక తరహా క్షేత్రస్థాయి నిర్మాణాత్మక శిక్షణను స్కౌట్స్ అండ్ గైడ్స్ పేరుతో అందిస్తారు.
  • స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ ద్వారా బాలబాలికలు చిన్నతనం నుంచే క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావం అలవర్చుకుని ఆత్మవిశ్వాసం పెంపొందించుకుంటారు. తమలో ఉన్న భయాలను పోగొట్టుకుని ఆత్మసైర్యాన్ని నింపుకుంటారు. తమను తాము కాపాడుకోవడమే కాక ఆపద విపత్కర పరిస్థితుల్లో ఉన్న ఇతరులను కాపాడగలిగే నైపుణ్యాలను పెంపొందించుకుంటారు.

స్కౌట్ ఉద్యమం (Scout Movement):
  • 1907: స్కౌట్ ఉద్యమం పితామహుడైన ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ రాబర్ట్ బాడెన్ పావెల్ (Robert Baden-Powell) ఇంగ్లాండ్ లోని బ్రౌన్ సే ద్వీపంలో 20 మంది అబ్బాయిలతో మొదటి స్కౌట్ శిబిరాన్ని నిర్వహించాడు.
  • 1908: రాబర్ట్ బాడెన్ పావెల్ అబ్బాయిల శిక్షణ కోసం అతని పథకం మరియు ఆలోచనల ఆధారంగా 'Scouting for Boys' అనే పుస్తకాన్ని ప్రచురించాడు. ఇది వేలాది మంది అబ్బాయిలను ఉద్యమంలో చేరడానికి ప్రేరేపించింది.
  • 1909: లండన్ లోని క్రిస్టల్ ప్యాలెస్ లో రాబర్ట్ బాడెన్ పావెల్ నిర్వహించిన మొదటి బాయ్ స్కౌట్ ర్యాలీకి అనేక మంది బాలికలు కూడా హాజరయ్యారు.
WAGGGS:
  • 1910: గర్ల్ గైడ్స్ ఉద్యమం (Girl Guides movement) అధికారికంగా రాబర్ట్ బాడెన్ పావెల్ మరియు అతని సోదరి ఆగ్నెస్ బాడెన్ పావెల్ చేత స్థాపించబడింది.
  • 1912: సైన్యం నుండి పదవీ విరమణ చేసిన రెండేళ్ల తర్వాత రాబర్ట్ బాడెన్ పావెల్ కు ఒలవే బాడెన్ పావెల్ తో వివాహం జరిగింది. ఈమె గర్ల్  స్కౌటింగ్ మరియు గర్ల్ గైడింగ్ అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించారు. 
  • 1919: అంతర్జాతీయ సదస్సు (International Conference) ఏర్పడింది.
  • 1920: ఇంగ్లాండ్ లోని ఆక్స్ ఫర్డ్ నగరంలో మొట్టమొదటి అంతర్జాతీయ సదస్సు జరిగింది.
  • 1926: న్యూయార్క్ లో జరిగిన 4వ అంతర్జాతీయ సదస్సులో ఆలోచనా దినోత్సవం (Thinking Day) ను ప్రారంభించారు.
  • 1928: హంగేరీలో జరిగిన 5వ అంతర్జాతీయ సదస్సులో World Association of Girl Guides and Girl Scouts (WAGGGS) ను ఏర్పాటు చేశారు మరియు అంతర్జాతీయ సదస్సు పేరును ప్రపంచ సదస్సు (World Conference) గా మార్చారు. 
  • 1932: వరల్డ్ థింకింగ్ ఫండ్ ప్రారంభించబడింది. ఇందులో సంగ్రహించిన విరాళాలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గర్ల్ స్కౌట్స్, గర్ల్ గైడ్స్ కోసం మరియు ప్రపంచ ఉద్యమంలో అవసరమైన చోట ఉపయోగిస్తారు.
  • 1999: ఐర్లాండ్ లోని డబ్లీన్ లో జరిగిన 30వ ప్రపంచ సదస్సులో ఆలోచనా దినోత్సవం పేరును ప్రపంచ ఆలోచనా దినోత్సవం (World Thinking Day) గా మార్చారు.
  • 2017: 36వ ప్రపంచ సదస్సు భారతదేశంలోని న్యూఢిల్లీలో జరిగింది.
  • Official Website: www.wagggs.org
WOSM: 
  • World Organization of the Scout Movement (WOSM) అనేది అతిపెద్ద అంతర్జాతీయ స్కౌటింగ్ సంస్థ.
  • ఇది 1922లో స్థాపించబడింది.
  • మొదటి ప్రపంచ స్కౌట్ కాన్ఫరెన్స్ 1920లో లండన్‌లో జరిగింది.
  • 42వ ప్రపంచ స్కౌట్ కాన్ఫరెన్స్ 2021లో డిజిటల్ పద్ధతిలో జరిగింది.
  • Official Website: www.scout.org

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ (BSG):
  • 1909లో భారతదేశంలో స్కౌటింగ్ ప్రారంభమైంది. దీనిని కెప్టెన్ T.H.Baker బెంగళూరులో స్థాపించారు.
  • భారతదేశంలో మొదటి గైడ్ కంపెని (Guide Company) 1911లో జబల్ పూర్ లో ప్రారంభించబడింది. ఇది నేరుగా ఇంపీరియల్ హెడ్ క్వార్టర్స్ నియంత్రణలో ఉండేది. 
  • భారత్ గర్ల్ గైడ్స్ యొక్క మొదటి కంపెనీ 1916లో పూణేలో స్థాపించబడింది.
  • 1917లో ప్రముఖ శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ భార్య లేడీ అబాలా బోస్ భారతీయ గైడ్ ల కోసం మొదటి భారతీయ గైడ్ కమీషనర్ గా నియమితులయ్యారు.
  • స్కౌట్ ఉద్యమం మొదట్లో భారతీయ అబ్బాయిలకు పెద్దగా అందుబాటులో లేకపోవడంతో, భారత జాతీయవాద నాయకులు భారతీయ బాలురకు స్కౌటింగ్ కార్యాకలాపాలను అందించాలని అలహాబాదులో సేవా సమితి స్కౌట్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు.  అలాగే మద్రాసులో భారతీయ అబ్బాయిల కోసం ఒక ప్రత్యేక స్కౌట్ అసోసియేషన్ ను ప్రారంభించారు.
  • 1921 మరియు 1937 లో రాబర్ట్ బాడెన్ పావెల్ భారతదేశ పర్యటన సందర్భంగా భారతదేశంలో ఉన్న వివిధ స్కౌట్ సమూహాల ఏకీకరణ కోసం ప్రయత్నాలు చేశారు. కానీ అవి విఫలమయ్యాయి.
  • మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జాతీయ నాయకులు భారతదేశంలో పనిచేస్తున్న స్కౌట్ మరియు గైడ్ అసోసియేషన్ల ఏకీకరణకు కృషి చేయడంవల్ల, స్కౌట్ మరియు గైడ్ అసోసియేషన్లు 7 నవంబర్ 1950 న విలీనం చెంది The Bharat Scouts and Guides (BSG) పేరుతో ఉనికిలోకి వచ్చింది.
  • 1951 ఆగస్ట్ 15న గర్ల్ గైడ్స్ అసోసియేషన్ అధికారికంగా BSG లో విలీనమయ్యింది.
  • BSG సొసైటీస్ రిజిస్ట్రేషన్స్ యాక్ట్ కింద రిజిస్టర్డ్ అయ్యింది. ఇది పూర్తిగా స్వచ్ఛంద, రాజకీయేతర, లౌకిక సంస్థ. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
  • Official Website: www.bsgindia.org

ఇతర అంశాలు:
  • Scouts and Guides ను తెలుగులో బాలభటులు అంటారు.
  • భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ లో 3-5 ఏండ్ల పిల్లల్ని  Bunnies గా, 6-10 ఏండ్ల లోపు బాలలను Cubs, బాలికలను Bulbuls గా, 11-17 ఏండ్ల కౌమార బాలలను Scouts, బాలికలను Guides గా, 18-25 ఏండ్ల అబ్బాయిలను Rovers, అమ్మాయిలను Ranger గా పిలుస్తారు.

వీటిని కూడా చూడండీ: