Tuesday, January 10, 2023

History of World Hindi Day in Telugu | ప్రపంచ హిందీ దినోత్సవం - జనవరి 10

History of World Hindi Day in Telugu | ప్రపంచ హిందీ దినోత్సవం
History of World Hindi Day in Telugu |
ప్రపంచ హిందీ దినోత్సవం - జనవరి 10

 WORLD HINDI DAY
ప్రపంచ హిందీ దినోత్సవం
****


ఉద్దేశ్యం:
  • ప్రపంచ వ్యాప్తంగా హిందీ భాష గురించి అవగాహన కల్పించడం, హిందీని అంతర్జాతీయ భాషగా ప్రదర్శించడం మరియు  ప్రపంచ స్థాయిలో హిందీ భాషను ప్రోత్సాహించడం.

ఎప్పటి నుంచి?
  • 2006 నుండి భారత ప్రభుత్వం జనవరి 10 ను ప్రపంచ హిందీ దినోత్సవంగా జరుపుకుంటోంది.

జనవరి 10 నే ఎందుకు?
  • ప్రపంచంలో హిందీని అభివృద్ధి చేయడానికి మరియు ప్రచారం చేయడానికి ప్రపంచ హిందీ సమావేశాలు ప్రారంభించబడ్డాయి. 
  • మొదటి ప్రపంచ హిందీ సమావేశం 10 జనవరి 1975 న నాగ్‌పూర్‌లో నిర్వహించబడింది. ఈ సమావేశానికి 30 దేశాల ప్రాతినిధ్యం లభించింది. దీని జ్ఞాపకార్థం జనవరి 10 న ప్రపంచ హిందీ దినోత్సవంగా జరుపుకుంటారు.

హిందీ:
  • హిందీ భాష ఇంగ్లీష్ తో పాటు భారతదేశం యొక్క అధికారిక భాష. అఖండ భారతాన్ని ఏకీకృతంగా ఉంచడంలో హిందీ భాషదే ప్రముఖ స్థానం. భారత జాతీయోద్యమంలో సాధారణ ప్రజలందరిని ఏకతాటిపై నడిపేందుకు హిందీ భాష ఆ రోజుల్లో ఎంతగానో సహాయపడింది. 
  • దేవనాగరిక లిపి నుంచి హిందీ రూపొందించబడింది. హిందీ భాష చాలావరకూ సంస్కృతం నుంచి గ్రహించబడినది. 
  • ప్రకరణ 343(1): కేంద్ర ప్రభుత్వ అధికార భాష దేవనాగరి లిపిలో ఉన్న హిందీ
  • ప్రకరణ 351: హిందీ భాషను ప్రోత్సాహించి అభివృద్ధి చేసి విస్తరించాలి. దేశ వ్యాప్తంగా వ్యక్తీకరణ మాధ్యమంగా భారత విశిష్ట సంస్కృతిని పెంపొందించేలా ఉపయోగపడాలి.
  • 1949 సెప్టెంబరు 14 న రాజ్యాంగ సభ హిందీని అధికార భాషగా గుర్తించి, రాజ్యాంగంలో చేర్చడం వల్ల 1953 నుంచి ప్రతి సంవత్సరం హిందీ భాషా దినోత్సవం (Hindi Diwas) సెప్టెంబర్ 14 న జరుపుకుంటారు.
  • 1963 లో చేసిన అధికార భాషా చట్టాన్ని అనుసరించి 1965 నుండి హిందీ మరియు ఇంగ్లీష్ అధికార భాషలుగా కొనసాగుతున్నాయి.

గణాంకాలు:
2011 జనాభ లెక్కల ప్రకారం,
  • 121 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో 10,000 లేదా అంతకంటే ఎక్కువ మంది మాట్లాడే భాషలు 121 ఉన్నాయి. వీటిలో 22 భాషలను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో అధికారిక భాషలు (Official Languages of India) గా చేర్చారు.
  • భారతదేశంలో ఎక్కువగా మాట్లాడే భాషల్లో మొదటి స్థానం - హిందీ (53 కోట్ల మంది) 43.63%
  • రెండవ స్థానం - బెంగాలి (97,237,669 మంది) 8.03%
  • మూడవ స్థానం - మరాఠి (83,026,680 మంది) 6.86%
  • నాల్గవ స్థానం - తెలుగు (81,127,740 మంది) 6.70%
  • కేంద్ర ప్రభుత్వం 2018లో విడుదల చేసిన జనాభా లెక్కల విశ్లేషణ ప్రకారం, భారతదేశంలో 19,500 కంటే ఎక్కువ భాషలు లేదా మాండలికాలు మాతృభాషగా మాట్లాడబడుతున్నాయి.

భారతదేశంలో వివిధ భాషలు మాట్లాడే ప్రాంతాలు:

History of World Hindi Day in Telugu | ప్రపంచ హిందీ దినోత్సవం‌


ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ:
  • ఆంధ్రప్రదేశ్ లో హిందీ ప్రచారం మరియు హిందీలో రచనలు చేసే తెలుగువారిని ప్రోత్సహించడం, తద్వారా తెలుగు భాషా సంస్కృతులను జాతీయ స్థాయికి చేర్చడం దీని ముఖ్యోద్దేశాలు. 
  • అంజయ్య గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీమతి రాజకుమారి ఇందిరాదేవి ధనరాజగీర్ గారి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమి (Andrapradesh Hindi Academy1982 లో స్థాపించబడింది.
  • అనివార్య కారణాల వల్ల స్తబ్దంగా ఉన్న అకాడమి తిరిగి 12 ఏప్రిల్ 2007 న ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారి అధ్యక్షతన తన కార్యకలాపాలను పునఃప్రారంభించింది.

మరికొన్ని అంశాలు:
  • ప్రతి సంవత్సరం హిందీ భాషా దినోత్సవం (Hindi Diwas) సెప్టెంబర్ 14 న జరుపుకుంటారు.
  • ఫిజి దేశం యొక్క అధికారిక భాష -  హిందీ. ఫిజీ రాజ్యాంగం 3 భాషలను అధికారిక భాషలుగా చెపుతుంది. అవి ఇంగ్లీష్, ఫిజియన్, మరియు హిందీ. అక్కడ మాట్లాడే హిందీ మాండలికాన్ని ఫిజి బాత్ లేదా ఫిజి హిందీ అంటారు.
  • మద్రాసు ప్రెసిడెన్సీలో మొట్టమొదట హిందీ వ్యతిరేకోద్యమం (Anti-Hindi Agitations) 1937 లో జరిగింది.
  • హిందీ సాహిత్యంలో జ్ఞానపీఠ పురస్కారం పొందిన తొలి వ్యక్తి - సుమిత్రానందన్ పంత్ (1968 లో)
  • హిందీ సాహిత్యంలో జ్ఞానపీఠ పురస్కారం పొందిన తొలి మహిళ - మహాదేవి వర్మ (1982 లో)
  • ఐక్యరాజ్య సమితి జెనరల్ అసెంబ్లీ 2008 ను అంతర్జాతీయ భాష సంవత్సరం (International Year of Languages-2008) గా ప్రకటించింది.
  • భారత దేశంలో భాషా వైవిధ్యం యొక్క మొదటి అధికారిక సర్వేను 1898 నుండి 1928 వరకు లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా (Linguistic Survey of India) పేరుతో సర్ జార్జ్ అబ్రహం గ్రియర్సన్ నిర్వహించారు. ఇందులో మొత్తం 179 భాషలు మరియు 544 మాండలికాలను నివేదించాడు.
  • కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 6 భాషలకి ప్రాచీన హోదా (Classical Languages of India) ఇచ్చింది. అవి: తమిళం (2004), సంస్కృతం (2005), కన్నడ (2008), తెలుగు (2008), మలయాళం (2013), ఒడియా (2014).

వీటిని కూడా చూడండీ:


No comments:

Post a Comment