Wednesday, January 11, 2023

లాల్ బహాదూర్ శాస్త్రి జీవిత చరిత్ర | Lal Bahadur Shastri Biography in Telugu

లాల్ బహాదూర్ శాస్త్రి జీవిత చరిత్ర | Lal Bahadur Shastri Biography in Telugu  Lal Bahadur Shastri Biography in Telugu, Lal Bahadur Shastri Biography, Lal Bahadur Shastri, Biography in Telugu, Tashkent Agreement in telugu, Tashkent Agreement, January important days in telugu, october important days in telugu, #LalBahadurShastri #StudentSoula #Biography #October2 #January11
లాల్ బహాదూర్ శాస్త్రి జీవిత చరిత్ర |
Lal Bahadur Shastri Biography in Telugu

లాల్ బహాదూర్ శాస్త్రి జీవిత చరిత్ర
Lal Bahadur Shastri Biography

*****
లాల్ బహాదూర్ శాస్త్రి భారతదేశ 2వ ప్రధానమంత్రి
(9 జూన్ 1964 - 11 జనవరి 1966) 
  • పేరు: లాల్ బహాదూర్ శాస్త్రి
  • మొదటి పేరు: లాల్ బహాదూర్ శ్రీవాస్తవ
  • జననం: 2 అక్టోబర్ 1904
  • తల్లిదండ్రులు: రామ్దులారి దేవి, శారదా ప్రసాద్ శ్రీవాస్తవ
  • జన్మస్థలం: మొగల్ సరాయ్ (ఉత్తరప్రదేశ్)
  • భార్య: లలితా శాస్త్రి (వివాహం - 1928)
  • పిల్లలు: 6
  • మరణం: 11 జనవరి 1966 (తాష్కెంట్, ఉజ్బెకిస్తాన్)
  • నినాదం: జై జవాన్, జై కిసాన్
  • స్మారక స్థలం (Memorial): విజయ్ ఘాట్ (ఢిల్లీ)
  • మరణానంతరం భారతరత్న అవార్డు పొందిన మొదటి వ్యక్తి (1966లో)
  • విదేశాల్లో మరణించిన ఏకైక ప్రధాని
  • శాస్త్రిగారు మహాత్మగాంధీ ఆశయాలకు, ఆదర్శాలకు ప్రభావితులై 1920లో భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చేరాడు.
  • ఈయన గాంధీ మార్గదర్శకత్వంలో ముజఫర్‌పూర్‌లో హరిజనుల అభ్యున్నతి కోసం పనిచేశాడు మరియు శ్రీవాస్తవ అనే తన కులాన్ని ప్రతిబింబించే ఇంటిపేరును వదులుకున్నాడు. 
  • 1925లో కాశీ విద్యాపీటం నుండి ప్రథమ శ్రేణిలో పట్టభద్రులయ్యారు. కాశీ విద్యాపీటం ఇచ్చే పట్టాను ఆరోజులలో శాస్త్రి అనే పదంతో పిలిచేవారు. ఆ విధంగా శాస్త్రి అన్నది ఆయన పేరులో ఒక భాగమైపోయింది.
  • కేంద్ర రైల్వే మంత్రిగా (13 మే 1952 - 7 డిసెంబర్ 1956) పనిచేశారు
  • 1956 సెప్టెంబర్ లో మహబూబ్ నగర్ లో జరిగిన రైలు ప్రమాదానికి నైతిక భాద్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. కానీ నెహ్రూ ఆ రాజీనామాను తిరస్కరించారు. మూడు నెలల తర్వాత తమిళునాడులోని అరియాలూర్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి నైతిక భాద్యత వహిస్తూ తిరిగి రాజీనామాను సమర్పించారు. జరిగిన ప్రమాదానికి శాస్త్రిగారికి సంబంధం లేకపోయినప్పటికి, ఇతర నేతలకు ఇది ఆదర్శం కావాలని నెహ్రూ ఆ రాజీనామాను అంగీకరించాడు. 
  • తర్వాత ఆయన కేంద్ర హోం మంత్రిగా (4 ఏప్రిల్ 1961 – 29 ఆగస్టు 1963) పనిచేశారు.
  • 27 మే 1964న నాటి ప్రధాని నెహ్రూ కన్నుమూయడంతో ప్రధాని పదవి శాస్త్రిగారిని వరించింది. అలా శాస్త్రిగారు 9 జూన్ 1964 నుంచి 11 జనవరి 1966 వరకు భారత 2వ ప్రధానమంత్రిగా పనిచేశారు.
  • ఈయన పదవి కాలంలోనే 1965 ఇండో-పాకిస్తాన్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధాన్ని పరిష్కరించడానికి భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య తాష్కెంట్ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ఉజ్బెకిస్తాన్ లోని తాష్కెంట్ లో జరిగింది. ఈ ఒప్పందంపై పాకిస్తాన్ ప్రెసిడెంట్ మహ్మద్ ఆయుబ్ ఖాన్, భారతదేశ ప్రధాని లాల్ బహద్దూర్ శాస్త్రి 10 జనవరి 1966న సంతకం చేశారు.
  • ఈ ఒప్పందం జరిగిన మరుసటి రోజు శాస్త్రిగారు గుండెపోటుతో తాష్కెంట్ లోనే మరణించారు. ఈయన మరణంపై ఇప్పటికి ఎన్నో సందేహాలు, అనుమానాలు ఉన్నాయి. తాష్కెంట్ లో ఆయనపై విష ప్రయోగం చరిగిందని ఆయన భార్య లలితా శాస్త్రి ఆరోపించారు.

ఇతర ముఖ్యాంశాలు:

  • లాల్ బహాదూర్ శాస్త్రి పేరుతో Lal Bahadur Shastri National Academy of Administration (LBSNAA) ను ముస్సోరీలో (ఉత్తరఖండ్) నెలకొల్పారు. ఇందులో IAS కేడర్ లోని సివిల్ సర్వెంట్లకు శిక్షణ ఇస్తారు.
  • వారణాసిలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి లాల్  బహాదూర్ శాస్త్రి పేరు పెట్టారు (Lal Bahadur Shastri International Airport)
  • కృష్ణా నదిపై కర్నాటకలో (విజయపుర జిల్లా) నిర్మించిన ఆల్మట్టి డ్యాంకు లాల్ బహాదూర్ శాస్త్రి సాగర్ గా నామకరణం చేశారు.
  • ఆంధ్ర-తెలంగాణ సరిహద్దుల్లోని నాగార్జున సాగర్ డ్యాం యొక్క ఎడమ కాలువను లాల్ బహాదూర్ కాలువ అంటారు. దీని పొడవు - 179 KM (కుడి కాలువను జవహర్ కాలువ అంటారు) 
  • ఇతను వైట్ రివల్యూషన్ ను ప్రోత్సాహించాడు. ఈయన పదవి కాలంలోనే డా౹౹ వర్గీస్ కురియన్ 1965లో National Dairy Development Board (NDDB) ని స్థాపించాడు.
  • దేశవ్యాప్తంగా దీర్ఘకాలిక ఆహార కొరత గురించి మాట్లాడుతూ, ప్రజలు స్వచ్ఛందంగా ఒక పూట భోజనాన్ని వదలుకోవాలని కోరాడు. దీని ఫలితంగా ఆహార కొరతగల ప్రజలకు కూడా ఆహారం దొరుకుతుందని తెలియజేశాడు.
  • భారతదేశ ఆహార ఉత్పత్తిని పెంచే అవసరాన్ని తెలియజేస్తూ, దీర్ఘకాలిక పరిష్కారానికై దేశంలో గ్రీన్ రెవల్యూషన్ కు బాటలు వేశాడు. ఇతని పదవి కాలంలోనే Food Corporation Act-1964 ద్వారా 1965లో Food Corporation of India (FCI) ఏర్పాటైంది.
  • ఇతని శతజయంతి సందర్భంగా (1904-2004) భారతీయ రిజర్వు బ్యాంకు ఐదు రూపాయల నాణేన్ని అతని చిత్రంతో విడుదన చేసింది.
లాల్ బహాదూర్ శాస్త్రి జీవిత చరిత్ర | Lal Bahadur Shastri Biography in Telugu  Lal Bahadur Shastri Biography in Telugu, Lal Bahadur Shastri Biography, Lal Bahadur Shastri, Biography in Telugu, Tashkent Agreement in telugu, Tashkent Agreement, January important days in telugu, october important days in telugu, #LalBahadurShastri #StudentSoula #Biography #October2 #January11, Lal Bahadur Shastri 5 rupees coin

Voice of Lal Bahadur Shastri:




No comments:

Post a Comment