Saturday, February 8, 2020

History of Missionary Day in Telugu | మిషనరీ దినోత్సవం - జనవరి 11

History of Missionary Day in Telugu | మిషనరీ దినోత్సవం
History of Missionary Day in Telugu |
మిషనరీ దినోత్సవం - జనవరి 11

మిషనరీ దినోత్సవం (Missionary Day)
జనవరి 11

ఉద్దేశ్యం:
  • వెల్ష్ దేశానికి చెందిన ఇద్దరు క్రైస్తవ మిషనరీలు భారతదేశంలోని మిజోరాం రాష్ట్రానికి (అప్పటి లుషాయ్ దేశానికి) వచ్చిన రోజుకు గుర్తుగా జనవరి 11 న మిషనరీ దినోత్సవాన్ని (Missionary Day) మిజోరాం రాష్ట్రంలో జరుపుకుంటారు. 
  • దేవుడు (యేసు క్రీస్తు) ఇద్దరు మిషనరీల ద్వారా తన సువార్తను పంపిన రోజును జ్ఞాపకం చేసుకోవడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

ఎప్పటి నుంచి?
  • మిజోరాం లోని ప్రెస్బిటేరియన్ చర్చి (Presbyterian Church) 1974 నుంచి మిషనరీ దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించింది. చివరికి రాష్ట్ర ప్రభుత్వం దీనిని ప్రభుత్వ సెలవు దినంగా మార్చింది. 

జనవరి 11 నే ఎందుకు?
  • మిజోరాం ప్రాంతంలో క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయడానికి J.H. Lorrain మరియు F.W. Savidge అనే  ఇద్దరు వెల్ష్ దేశానికి చెందిన మిషనరీలు 1894 జనవరి 11 న అస్సాం నుండి పడవ ద్వారా అప్పటి లుషాయ్ దేశానికి (మిజోరాం) వచ్చారు. 
  • వీరు దాదాపు అన్ని మిజోలను క్రైస్తవ మతంలోకి మార్చారు. 
  • మిషనరీలు మిజోరాం యొక్క ఉత్తర భాగంలో ప్రెస్బిటేరియన్ చర్చిని మరియు దక్షిణ భాగంలో బాప్టిస్ట్ చర్చిని స్థాపించారు. 
  • ఈ రోజున చాలా మంది ప్రత్యేక సేవలకు హాజరవుతారు. ముఖ్యంగా ప్రెస్బిటేరియన్ మరియు బాప్టిస్ట్ చర్చిలలో దేవుని ఆరాధన, ప్రార్థనలను మరియు సమాజ విందులను నిర్వహిస్తారు.
History of Missionary Day in Telugu | మిషనరీ దినోత్సవం
F.W. Savidge And J.H. Lorrain

మరికొన్ని అంశాలు:
  • ఫ్రెంచ్ పాలినేషియా (French Polynesia) దేశంలో 1978 నుంచి మార్చ్ 5 న మిషనరీ దినోత్సవాన్ని (Missionary Day) జరుపుకుంటారు.
  • 1797 మార్చ్ 5 లండన్ మిషనరీ సొసైటీ తమ నౌక డఫ్ ద్వారా ఫ్రెంచ్ పాలినేషియా దేశంలోని తహితీ నగరానికి చేరుకుంది. ఈ రోజుకు గుర్తుగా మార్చ్ 5 న మిషనరీ దినోత్సవాన్ని ఫ్రెంచ్ పాలినేషియా దేశంలో జరుపుకుంటారు.

వీటిని కూడా చూడండీ:



No comments:

Post a Comment