History of National Youth Day in Telugu | జాతీయ యువజన దినోత్సవం

History of National Youth Day in Telugu | జాతీయ యువజన దినోత్సవం
History of National Youth Day in Telugu |
జాతీయ యువజన దినోత్సవం

జాతీయ యువజన దినోత్సవం
National Youth Day - January 12

*****
ఉద్దేశ్యం:
  • యువతలో దాగున్న నిగూఢ శక్తిని వెలికితీయుటకు వివేకానందుడి రచనలు, ఆలోచనల దృక్పథం మరియు విలువలను అందరికీ తెలియజేయడం ఈ దినోత్సవ నిర్వహణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

ఎప్పటి నుంచి?
  • 1984 లో భారత ప్రభుత్వం జనవరి 12 ను జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది.
  • 1985 నుంచి ప్రతీ సంవత్సరం ఈ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.

జనవరి 12 నే ఎందుకు?
  • భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దశదిశలా చాటిన స్వామీ వివేకానందుడు 1863 జనవరి 12 న జన్మించాడు.
  • ఆయన జన్మదినం అయిన జనవరి 12 ను ప్రతీ సంవత్సరం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు.


*స్వామి వివేకానంద గురించి*
  • పేరు: స్వామి వివేకానంద
  • అసలు పేరు: నరేంద్ర నాథ్ దత్తా
  • జననం: 1863 జనవరి 12
  • జన్మస్థలం: కలకత్తా, బెంగాల్ ప్రిసిడెన్సీ (ఇప్పటి కోల్కత)
  • తల్లిదండ్రులు: భువనేశ్వరి దేవి, విశ్వనాథ్ దత్త
  • చదువు: 1884 లో B.A పాస్ అయ్యాడు
  • వృత్తి: ఉపాధ్యాయుడు, సన్యాసి
  • గురువు: రామకృష్ణ పరమహంస  
  • స్థాపించిన సంస్థలు: బేలూరు మఠం, రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిషన్
  • ఈ సంస్థల ప్రధాన లక్ష్యం సర్వమత సామరస్యం, సామాజిక సమానత్వం, వెల్లివిరియడం. జాతి, వర్గ, కుల, మత, ప్రాంతీయ, లింగ భేదాలు లేకుండా మానవాళి సుఖశాంతులతో జీవించడం, మానవుని సర్వతోముఖాభివృద్ధి. 
  • మరణం: 1902 జూలై 4 (వయసు 39)
  • మరణించిన ప్రదేశం: బేలూరు మఠం, బెంగాల్ ప్రిసిడెన్సీ
  • శిష్యులు: స్వామి అశోకానంద, స్వామి విరాజానంద, స్వామి పరమానంద, ఆలసింగ పెరుమాల్, స్వామి అభయానంద, సోదరి నివేదిత, స్వామి సదానంద
  • తత్వం: ఆధునిక వేదాంతం, రాజా యోగం
  • రామకృష్ణ మఠం: 1897 లో పశ్చిమ బెంగాల్ లోని బేలూరు మఠం వద్ద రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశాడు. ఆయన దగ్గరకు మార్గదర్శకత్వం కోసం వచ్చేవారికి ఆధ్యాత్మిక విలువల యొక్క ప్రాధాన్యాన్ని బోధించేవాడు.

విశ్వమత సమ్మేళనం:
  • 1893 సెప్టెంబరు 11లో చికాగో లో జరిగిన విశ్వమత సమ్మేళనకు (Parliament of the World's Religions) వివేకానందుడు హాజరయ్యాడు. ఇందులో ఈయన భారత దేశానికీ, హిందూ మతానికి ప్రాతినిధ్యం వహించారు. 
  • వివేకానందుడు తన సందేశంలో భారతదేశ మత సామరస్యాన్ని గురించి, వైవిధ్యాన్ని గురించి వివరించాడు. 
  • పాశ్చాత్య దేశాలలోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి ఈయనే. 
  • 1893 మే 31 లో విశ్వమత సమ్మేళనానికి వెళ్ళిన వివేకానందుడు వివిద దేశాలు పర్యటించి 1897 జనవరి 15 న భారతదేశానికి తిరిగి వచ్చాడు.

రూ.5 మరియు రూ.150 నాణేలు:
  • స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా 2013 జనవరి 12 న భారత ప్రభుత్వం స్వామి వివేకానంద చిత్రంతో కూడిన రూ.5 మరియు రూ.150 నాణేలను విడుదల చేసింది.

History of National Youth Day in Telugu | జాతీయ యువజన దినోత్సవం
Rs.5 Coin
History of National Youth Day in Telugu | జాతీయ యువజన దినోత్సవం
Rs.150 Coin


Vivekananda Rock Memorial:
  • తమిళనాడులోని కన్యాకుమారిలో వివేకానంద స్మారక భవనాన్ని (Vivekananda Rock Memorial) 1970 లో నిర్మించారు.
History of National Youth Day in Telugu | జాతీయ యువజన దినోత్సవం
Vivekananda Rock Memorial
History of National Youth Day in Telugu | జాతీయ యువజన దినోత్సవం
Vivekananda Rock Memorial

మరికొన్ని అంశాలు:
  • అంతర్జాతీయ యువజన దినోత్సవం (International Youth Day) ను ప్రతి సంవత్సరం ఆగస్టు 12 న జరుపుకుంటారు.