History of Pravasi Bharatiya Divas in Telugu | ప్రవాస భారతీయుల దినోత్సవం - జనవరి 9

History of Pravasi Bharatiya Divas in Telugu | ప్రవాస భారతీయుల దినోత్సవం
History of Pravasi Bharatiya Divas in Telugu |
ప్రవాస భారతీయుల దినోత్సవం - జనవరి 9


Pravasi Bharatiya Divas
ప్రవాస భారతీయుల దినోత్సవం
జనవరి 9


ఉద్దేశ్యం:
  • భారతదేశ అభివృద్ధిలో విదేశీ భారతీయ సమాజం చేసిన కృషిని గుర్తించడం.

ఎప్పటి నుంచి?
  • ఎల్.ఎమ్.సింగ్వి నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ జనవరి 2002 లో ఈ దినోత్సవాన్ని సిఫారసు చేసింది.
  • మొదటి ప్రవాస భారతీయుల దినోత్సవాన్ని 2003లో జరుపుకున్నారు.
  • 2003 నుండి 2015 వరకు ప్రతి సంవత్సరం జనవరి 09 న ప్రవాస భారతీయుల దినోత్సవాన్ని (Non-Resident Indian Day) జరుపుకున్నారు.
  • అక్టోబర్ 2015 లో ఈ కార్యక్రమాన్ని రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించాలని నిర్ణయించారు.

జనవరి 09 నే ఎందుకు?
  • 1893 లో దక్షిణాఫ్రికాకు వెళ్ళిన మహాత్మా గాంధీ, 09 జనవరి 1915 న దక్షిణాఫ్రికా నుంచి  భారతదేశానికి తిరిగి వచ్చారు. దీనికి గుర్తుగా ప్రవాస భారతీయుల దినోత్సవము జనవరి 09 న జరుపుకొనబడుతున్నది.
సమావేశాలు:
  • (1 వ) 2003 - న్యూఢిల్లీ (9-11 జనవరి)
  • (2 వ) 2004 - న్యూఢిల్లీ (9-11 జనవరి)
  • (3 వ) 2005 -ముంబై (7-9 జనవరి)
  • (4 వ) 2006 - హైదరాబాద్‌ (7-9 జనవరి)
  • (5 వ) 2007 - న్యూఢిల్లీ (7-9 జనవరి)
  • (6 వ) 2008 - న్యూఢిల్లీ (7-9 జనవరి)
  • (7 వ) 2009 - చెన్నై (7-9 జనవరి)
  • (8 వ) 2010 - న్యూఢిల్లీ (7-9 జనవరి)
  • (9 వ) 2011 - న్యూఢిల్లీ (7-9 జనవరి)
  • (10 వ) 2012 - జైపూర్ (7-9 జనవరి)
  • (11 వ) 2013 - కొచ్చి (7-9 జనవరి)
  • (12 వ) 2014 - న్యూఢిల్లీ (7-9 జనవరి)
  • (13 వ) 2015 - గాంధీనగర్ (7-9 జనవరి)
  • (14 వ) 2017 - బెంగళూరు (7-9 జనవరి)
  • (15 వ) 2019 - వారణాసి (21-23 జనవరి)
  • (16 వ) 2021 - Virtual   (9 జనవరి)
  • (17 వ) 2023 - ఇండోర్ (8-10 జనవరి)

థీమ్ (Theme):
  • 2019: Role of Indian Diaspora in building a New India
  • 2021: Contributing to Atmanirbhar Bharat
  • 2023: Diaspora: Reliable partners for India’s progress in Amrit Kaal

ప్రాంతీయ ప్రవాసి భారతీయ దివాస్ (RPBD):
  • విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్దిష్ట ప్రాంతాలలో భారత డయాస్పోరాతో ప్రవాస భారతీయులను కనెక్ట్ చేయడానికి, ప్రభుత్వ విధానాలు మరియు కార్యక్రమాలను వారికి పరిచయం చేయడానికి, భారతదేశం యొక్క అభివృద్ధి మరియు వృద్ధికి తోడ్పడటానికి మరియు వారి సమస్యల పరిష్కారానికి, భారతదేశానికి వెలుపల ప్రాంతీయ ప్రావాసి భారతీయ దివాస్ (RPBD- Regional Pravasi Bharatiya Divas) ను నిర్వహిస్తుంది.
సమావేశాలు:
  • (1 వ) 2007: న్యూయార్క్ (24 సెప్టెంబర్)
  • (2 వ) 2008: సింగపూర్ (10-11 అక్టోబర్)
  • (3 వ) 2009: ది హేగ్ (19 సెప్టెంబర్)
  • (4 వ) 2010: డర్బన్ (దక్షిణ ఆఫ్రికా) (1-2 అక్టోబర్)
  • (5 వ) 2011: టొరంటో (కెనడా) (8-10 జూన్)
  • (6 వ) 2012: పోర్ట్ లూయిస్ (మారిషస్) (27–28 అక్టోబర్)
  • (7 వ) 2013: సిడ్నీ (10–12 నవంబర్)
  • (8 వ) 2014: లండన్ (16–18 అక్టోబర్)
  • (9 వ) 2015: లాస్ ఏంజెల్స్ (14–15 నవంబర్)
  • (10 వ) 2018: సింగపూర్ (6–7 జనవరి)

లోగో (Logo):
  • ఈ లోగో బహిరంగ పోటీలో MyGov పోర్టల్ ద్వారా క్రౌడ్ సోర్స్ చేయబడింది. లోగో రూపకర్త దేబాసిష్ సర్కార్‌ (Debasish Sarkar). ఈ లోగోను 14 వ ప్రవసి భారతీయ దివాస్‌ లో చేర్చారు.
History of Pravasi Bharatiya Divas in Telugu | ప్రవాస భారతీయుల దినోత్సవం

ప్రవాసి భారతీయ సమ్మన్ అవార్డు:
  • భారతదేశ వృద్ధిలో ప్రవాసి భారతీయుల పాత్రను అభినందించడానికి, వారిలో అసాధారణమైన యోగ్యత కలిగిన వ్యక్తులకు ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మక ప్రవాసి భారతీయ సమ్మన్ అవార్డు (PBSA- Pravasi Bharatiya Samman Award) ను ఇస్తారు.
  • Pravasi Bharatiya Samman Awards List


వీటిని కూడా చూడండీ: