History of International Mother Language Day in Telugu | అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం - ఫిబ్రవరి 21 | Student Soula

History of International Mother Language Day in Telugu | అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం - ఫిబ్రవరి 21 | Student Soula Tags: International Mother Language Day in telugu, International Mother Language essay in telugu, about International Mother Language Day in telugu, theme International Mother Language Day in telugu, prapancha matru bhaasha dinotsavam, Day Celebrations, Days Special, What today special, today special, today history, Days, Important days, important days in telugu, important days in January, important days in February, important days in  March, important days in  April, important days in May, important days in  June, important days in  July, important days in August, important days in September, important days in October, important days in November, important days in December, special in February, days celebrations in February, popular days in February, February lo dinostavalu, special in February 21 in telugu, Student Soula,

INTERNATIONAL MOTHER LANGUAGE DAY
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
****

ఉద్దేశ్యం:
  • మనుగడ కోసం ఇతర భాషలను నేర్చుకోవడంలో తప్పులేదు. అయితే వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా చూసుకోవాలి. మాతృభాషను పరిరక్షించుకోవాలి. ఈ కర్తవ్యాన్ని గుర్తించడమే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం (International Mother Language Day) ముఖ్య ఉద్దేశ్యం.
  • బహుభాషల విధానాన్ని ప్రోత్సహించాలని, అది విశాల దృష్టిని, శాస్ర్తీయ దృక్పథాన్ని పెంపొందిస్తుందని, అయితే మాతృభాషను కాపాడుకుంటూనే వేరే భాషలను నేర్చుకోవాలని యునెస్కో ప్రకటించింది.

ఫిబ్రవరి 21నే ఎందుకు?
  • బెంగాలీ భాషా ఉద్యమం సందర్భంగా డాకాలో 1952 ఫిబ్రవరి 21 లో జరిగిన హింస మరియు హత్యల జ్ఞాపకార్థం ఈ రోజున అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటారు. 

ఎప్పటి నుండి జరుపుకుంటున్నారు? 
  • 17 నవంబర్ 1999యునెస్కో (UNESCO- United Nations Educational, Scientific and Cultural Organization) ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21 వ తేదీన ఈ  దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించింది.
  • 2000 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.

ప్రతిపాదన:
  • కెనడాలోని వాంకోవర్‌లో నివసిస్తున్న బెంగాలీ రఫీకుల్ ఇస్లాం (Rafiqul Islam) అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవాన్ని ప్రకటించడం ద్వారా ప్రపంచ భాషలను అంతరించిపోకుండా కాపాడటానికి ఒక అడుగు వేయమని కోరుతూ అతను 9 జనవరి 1998 న అప్పటి ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్‌కు ఒక లేఖ రాశాడు. భాషా ఉద్యమం సందర్భంగా డాకాలో 1952 ఫిబ్రవరి 21 లో జరిగిన హత్యల జ్ఞాపకార్థం రఫీకుల్ ఈ తేదీని ప్రతిపాదించాడు.
  • రఫీకుల్ ఇస్లాం ప్రతిపాదనను బంగ్లాదేశ్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు మరియు నిర్ణీత సమయంలో (ప్రధాన మంత్రి షేక్ హసీనా ఆదేశాల మేరకు) బంగ్లాదేశ్ ప్రభుత్వం యునెస్కోకు ఒక అధికారిక ప్రతిపాదనను సమర్పించింది.
  • 17 నవంబర్ 1999 న యునెస్కో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21 వ తేదీన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించింది.

బెంగాలీ భాషా ఉద్యమం (Bengali Language Movement):
  • అఖండ భారతం బ్రిటీష్ పాలన అనంతరం భారతదేశం మరియు పాకిస్తాన్ అను రెండు దేశాలుగా విడిపోయింది.
  • పాకిస్తాన్ పశ్చిమ జోన్ ను పశ్చిమ పాకిస్తాన్ (ఇప్పటి పాకిస్తాన్) అని మరియు తూర్పు జోన్ ను తూర్పు బెంగాల్ లేద తూర్పు పాకిస్తాన్ (ఇప్పటి బంగ్లాదేశ్) అని పిలిచేవారు.
  • తూర్పు పాకిస్థాన్‌గా గుర్తించిన ఆ ప్రాంతానికీ పాకిస్థాన్‌కీ మధ్య ఆనాటి నుంచే ఆర్థిక, సాంస్కృతిక, భాషాపరమైన సంఘర్షణ ఉండేది.
  • 1948 లో పాకిస్తాన్ ఉర్దూ (Urdu) ను జాతీయ భాషగా గుర్తించడంతో, బెంగాలీ మాట్లాడే తూర్పు పాకిస్థాన్‌లో ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం వెుదలైంది.
  • ఢాకా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు మరియు ఇతర రాజకీయ కార్యకర్తలు ఈ చట్టాన్ని ధిక్కరించి 21 ఫిబ్రవరి 1952 న ఉద్యమాన్ని నిర్వహించారు.
  • ప్రభుత్వం హింసా మార్గాల్లో ఆ ఉద్యమాన్ని అణిచే ప్రయత్నం చేసింది. 
  • పోలీసులు జరిపిన కాల్పుల్లో  ఢాకా విశ్వవిద్యాలయానికి చెందిన నలుగురు విద్యార్థులు (సలాం, బర్కాట్, రఫీక్, జబ్బర్ మరియు షఫియూర్) ప్రాణాలు కోల్పోయారు. కొన్ని వందల మందికి పైగా గాయాలయ్యాయి. అయినా ఉద్యమం ఆగలేదు. మరింత తీవ్రరూపం దాల్చింది.
  • చివరికి 1956 ఫిబ్రవరి 29 న పాకిస్తాన్ ప్రభుత్వం ఉర్దూతో పాటు బెంగాలీ భాషకు కూడా అధికారిక హోదాను ఇచ్చింది. 

మాతృభాష (Mother Tongue):
  • మానవుడు పుట్టినప్పటి నుండి సహజంగా (తల్లి ఒడిలో) నేర్చుకుని మాట్లాడ గలిగే భాష లేదా మాతృభూమిలో మాట్లాడే భాషను మాతృభాష (Mother Tongue/ Mother Language) అంటారు.
  • ఒక ప్రాంతంలో నివసిస్తూ వుంటే, ఆ ప్రాంతపు వ్యావహారిక భాష (ప్రాంతీయ భాష) ను  కూడా మాతృభాషగా పరిగణించవచ్చు.
  • చక్కగా మాట్లాడగలిగే, అర్థం చేసుకో గలిగే, భావాలను వ్యక్తపరచ గలిగే భాషను ప్రథమ భాష (First Language) గా గుర్తించవచ్చు.

గణాంకాలు:
2011 జనాభ లెక్కల ప్రకారం,
  • 121 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో 10,000 లేదా అంతకంటే ఎక్కువ మంది మాట్లాడే భాషలు 121 ఉన్నాయి. వీటిలో 22 భాషలను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో అధికారిక భాషలు (Official Languages of India) గా చేర్చారు.
  • భారతదేశంలో ఎక్కువగా మాట్లాడే భాషల్లో మొదటి స్థానం - హిందీ (53 కోట్ల మంది) 43.63%
  • రెండవ స్థానం - బెంగాలి (97,237,669 మంది) 8.03%
  • మూడవ స్థానం - మరాఠి (83,026,680 మంది) 6.86%
  • నాల్గవ స్థానం - తెలుగు (81,127,740 మంది) 6.70%
  • కేంద్ర ప్రభుత్వం 2018లో విడుదల చేసిన జనాభా లెక్కల విశ్లేషణ ప్రకారం, భారతదేశంలో 19,500 కంటే ఎక్కువ భాషలు లేదా మాండలికాలు మాతృభాషగా మాట్లాడబడుతున్నాయి. (Link)

SPPEL:
  • భారతదేశంలో అంతరించిపోతున్న భాషల రక్షణ మరియు సంరక్షణ పథకం (SPPEL) 2013లో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభించబడింది. 
  • దీనిని కర్ణాటకలోని మైసూర్ లో ఉన్న Central Institute of Indian Languages (CIIL) పర్యవేక్షిస్తుంది.
  • సమీప భవిషత్తులో అంతరించిపోతున్న లేదా అంతరించిపోయే అవకాశం ఉన్న దేశంలోని భాషలను డాక్యుమెంట్ చేయడం మరియు ఆర్కైవ్ చేయడం ఈ పథకం యొక్క లక్ష్యం.
  • దేశంలో పదివేల మంది కంటే తక్కువ మంది మాట్లాడే భాషల్లో 117 భాషలను SPPEL అంతరించిపోతున్న భాషల (Endangered Languages) జాబితాలో చేర్చింది.
  • Official Website: www.sppel.org
CIIL:
  • స్థాపన: 17 జులై 1969
  • ప్రధాన కార్యాలయం: మైసూరు, కర్ణాకట.
  • Central Institute of Indian Languages (CIIL) అనేది భాషకు సంబంధించిన విషయాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సలహా ఇస్తుంది.
  • అన్ని భారతీయ భాషలను అభివృద్ధి చేయడం మరియు దేశంలోని మైనారిటీ, మైనర్, గిరిజల భాషలను రక్షించడం దీని ముఖ్య లక్ష్యం.
  • Official Website: www.ciil.org

మరికొన్ని అంశాలు:
  • ఐక్యరాజ్య సమితి జెనరల్ అసెంబ్లీ 2008 ను అంతర్జాతీయ భాష సంవత్సరం (International Year of Languages-2008) గా ప్రకటించింది.
  • భారత దేశంలో భాషా వైవిధ్యం యొక్క మొదటి అధికారిక సర్వేను 1898 నుండి 1928 వరకు లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా (Linguistic Survey of India) పేరుతో సర్ జార్జ్ అబ్రహం గ్రియర్సన్ నిర్వహించారు. ఇందులో మొత్తం 179 భాషలు మరియు 544 మాండలికాలను నివేదించాడు.
  • కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 6 భాషలకి ప్రాచీన హోదా (Classical Languages of India) ఇచ్చింది. అవి: తమిళం (2004), సంస్కృతం (2005), కన్నడ (2008), తెలుగు (2008), మలయాళం (2013), ఒడియా (2014).

వీటిని కూడా చూడండీ: