Thursday, February 23, 2023

Mother Tongue Essay in Telugu | మాతృభాష విశిష్టతను తెలుసుకుందాం!

Essay about Mother Tongue in Telugu | మాతృభాష విశిష్టతను తెలుసుకుందాం | Student Soula Tags: Essay about Mother Tongue in Telugu, Essay history of Mother Tongue in Telugu, Mother tongue in telugu, Native language in telugu, Bilingualism in telugu, Multilingualism in telugu, Language acquisition in telugu, Linguistic identity in telugu, Language preservation in telugu, Language policy in telugu, Language education in telugu, Code-switching in telugu, Language diversity in telugu, Language and culture in telugu, Language and identity in telugu, Language and power in telugu, Language and society in telugu, Student Soula,


మాతృభాష (Mother Tongue):
  • మానవుడు పుట్టినప్పటి నుండి సహజంగా (తల్లి ఒడిలో) నేర్చుకుని మాట్లాడ గలిగే భాష లేదా మాతృభూమిలో మాట్లాడే భాషను మాతృభాష (Mother Tongue/ Mother Language) అంటారు.
  • ఒక ప్రాంతంలో నివసిస్తూ వుంటే, ఆ ప్రాంతపు వ్యావహారిక భాష (ప్రాంతీయ భాష) ను  కూడా మాతృభాషగా పరిగణించవచ్చు.
  • చక్కగా మాట్లాడగలిగే, అర్థం చేసుకో గలిగే, భావాలను వ్యక్తపరచ గలిగే భాషను ప్రథమ భాష (First Language) గా గుర్తించవచ్చు.
  • మాతృభాష ఏదైనా అది తల్లి తో సమానం. మనం తల్లిని ఎంత గౌరవము ఇస్తామో, మన మాతృభాష ని కూడా అంతే గౌరవించాలి. అది తెలుగు కావచ్చు, ఆంగ్లం కావచ్చు, హింది కావచ్చు. ఎవరి భాష వారికి అది గొప్పది.
  • బహుభాషల విధానాన్ని ప్రోత్సహించాలని, అది విశాల దృష్టిని, శాస్ర్తీయ దృక్పథాన్ని పెంపొందిస్తుందని, అయితే మాతృభాషను కాపాడుకుంటూనే వేరే భాషలను నేర్చుకోవాలని యునెస్కో ప్రకటించింది.
  • కొంతమంది తల్లిదండ్రులు, విద్యార్థులు ఆంగ్లంలో చదవకపోతే ఉన్నత స్థానానికి ఎదగలేమనే భ్రమలో ఉన్నారు. భారత్ లో అత్యున్నత స్థానాల్లో ఉన్న ఎంతోమంది మాతృభాషలో విద్యను అభ్వసించినవారేనన్న విషయాన్ని మనం గమనించాలి.
  • ఆంగ్లాన్ని భాషగా నేర్చుకోవడంలో తప్పులేదు. విద్యాబోధన మాత్రం మాతృభాషల్లో జరిగినప్పుడే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎవరైతే మాతృభాషలో నైపుణ్యం సాధిస్తారో, ఇతర భాషలు కూడా అదే స్థాయిలో నేర్చుకుని నిష్ణాతులవుతారని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఆంగ్లం అనేది భాషే తప్ప, విజ్ఞానం కాదనే విషయాన్ని అందరూ గుర్తించుకోవాలి.
  • ఇంగ్లీష్ ను ఒక భాషగా నేర్చుకోవడం వేరు, దానిని విద్యా మాధ్యమంగా అమలుపరచటం వేరు. ఇంగ్లీష్ మాధ్యమంతో దేశీయ స్థానిక భాషల ఆధారంగా నడిచే వందలాది పరిశ్రమలు మూలబడతాయి. దాంతో లక్షలాది ఉద్యోగాలు పోయి కోట్లాది మంది ఉపాధి కోల్పోతారు. ఒకటి రెండు తరాలలో తెలుగు రాయగలిగినవాళ్ళూ, చదవగలిగినవాళ్ళూ మిగలరు. తెలుగు సినిమాలూ, తెలుగు టీవీ ఛానెళ్ళూ ఉండవు. తెలుగు రచనలు ఉండవు, రచయితలూ ఉండరు. వారు లేనిదే తెలుగు పత్రికలూ, తెలుగు ప్రచురణలూ ఇంకెక్కడ ఉంటాయి. అప్పుడు వేల యేండ్ల అస్తిత్వం కలిగిన తెలుగు ఏమవుతుంది? వేల యేండ్లుగా కవులూ రచయితలూ సృష్టించిన సాహిత్య సంపద ఏమవుతుంది?
  • 'దేశ భాషలందు తెలుగు లెస్స' అని అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. తెలుగు భాషలోని మాధుర్యం, గొప్పతనం ఇక ఏ భాషలోనూ లేదని చాలా మంది కవులు చెప్పారు. అలాగే ఇటలీ దేశానికి చెందిన వర్తకుడు నికొలో డా కాంటి (Niccolò de' Conti) 1420లో భారతదేశంలో పర్యటించినప్పుడు, తెలుగు భాషలోని పదములు ఇటాలియన్‌ భాష వలె అచ్చులు చివరన కలిగి ఉండటం (Words Ending With Vowels) గమనించి తెలుగును 'ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌' అని కొనియాడారు.
  • "స్వతంత్ర భారతదేశంలో మాతృభాషను అభ్యసించినవారే మనకు కావాలి. విదేశీ భాష చదివి, దేశంలో పరాయివారిలా తిరిగేవాళ్ళు అనవసరం. ప్రజల భాషలో మంచి చెడ్డలు చెప్పేవారు కావాలి" 04-07-1929 న యంగ్ ఇండియా పత్రికలో మహాత్మాగాంధి రాసిన మాటలివి.

గణాంకాలు:
2011 జనాభ లెక్కల ప్రకారం,
  • 121 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో 10,000 లేదా అంతకంటే ఎక్కువ మంది మాట్లాడే భాషలు 121 ఉన్నాయి. వీటిలో 22 భాషలను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో అధికారిక భాషలు (Official Languages of India) గా చేర్చారు.
  • భారతదేశంలో ఎక్కువగా మాట్లాడే భాషల్లో మొదటి స్థానం - హిందీ (53 కోట్ల మంది) 43.63%
  • రెండవ స్థానం - బెంగాలి (97,237,669 మంది) 8.03%
  • మూడవ స్థానం - మరాఠి (83,026,680 మంది) 6.86%
  • నాల్గవ స్థానం - తెలుగు (81,127,740 మంది) 6.70%
  • కేంద్ర ప్రభుత్వం 2018లో విడుదల చేసిన జనాభా లెక్కల విశ్లేషణ ప్రకారం, భారతదేశంలో 19,500 కంటే ఎక్కువ భాషలు లేదా మాండలికాలు మాతృభాషగా మాట్లాడబడుతున్నాయి. (Link)

SPPEL:
  • భారతదేశంలో అంతరించిపోతున్న భాషల రక్షణ మరియు సంరక్షణ పథకం (SPPEL2013లో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభించబడింది. 
  • దీనిని కర్ణాటకలోని మైసూర్ లో ఉన్న Central Institute of Indian Languages (CIIL) పర్యవేక్షిస్తుంది.
  • సమీప భవిషత్తులో అంతరించిపోతున్న లేదా అంతరించిపోయే అవకాశం ఉన్న దేశంలోని భాషలను డాక్యుమెంట్ చేయడం మరియు ఆర్కైవ్ చేయడం ఈ పథకం యొక్క లక్ష్యం.
  • దేశంలో పదివేల మంది కంటే తక్కువ మంది మాట్లాడే భాషల్లో 117 భాషలను SPPEL అంతరించిపోతున్న భాషల (Endangered Languages) జాబితాలో చేర్చింది.
  • Official Website: www.sppel.org
CIIL:
  • స్థాపన: 17 జులై 1969
  • ప్రధాన కార్యాలయం: మైసూరు, కర్ణాకట.
  • Central Institute of Indian Languages (CIIL) అనేది భాషకు సంబంధించిన విషయాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సలహా ఇస్తుంది.
  • అన్ని భారతీయ భాషలను అభివృద్ధి చేయడం మరియు దేశంలోని మైనారిటీ, మైనర్, గిరిజల భాషలను రక్షించడం దీని ముఖ్య లక్ష్యం.
  • Official Website: www.ciil.org

మరికొన్ని అంశాలు:
  • ఐక్యరాజ్య సమితి జెనరల్ అసెంబ్లీ 2008 ను అంతర్జాతీయ భాష సంవత్సరం (International Year of Languages-2008) గా ప్రకటించింది.
  • భారత దేశంలో భాషా వైవిధ్యం యొక్క మొదటి అధికారిక సర్వేను 1898 నుండి 1928 వరకు లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా (Linguistic Survey of India) పేరుతో సర్ జార్జ్ అబ్రహం గ్రియర్సన్ నిర్వహించారు. ఇందులో మొత్తం 179 భాషలు మరియు 544 మాండలికాలను నివేదించాడు.
  • కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 6 భాషలకి ప్రాచీన హోదా (Classical Languages of India) ఇచ్చింది. అవి: తమిళం (2004), సంస్కృతం (2005), కన్నడ (2008), తెలుగు (2008), మలయాళం (2013), ఒడియా (2014).

వీటిని కూడా చూడండీ:

No comments:

Post a Comment