History of National Farmers Day in Telugu | జాతీయ రైతు దినోత్సవం


History of National Farmers Day in Telugu | జాతీయ రైతు దినోత్సవం - డిసెంబర్ 23
National Farmers Day in telugu, National Farmers day essay in telugu, History of National Farmers Day, about National Farmers Day, Themes of National Farmers Day, Celebrations of National Farmers Day, National Mathematics Day, jathiya raithula dinotsavam, Day Celebrations, Days Special, What today special, today special, today history, Days, Important days, important days in telugu, important days in January, important days in February, important days in  March, important days in  April, important days in May, important days in  June, important days in  July, important days in August, important days in September, important days in October, important days in November, important days in December, special in December, days celebrations in December, popular days in December, December lo dinostavalu, special in December 23, Student Soula,

జాతీయ రైతు దినోత్సవం - డిసెంబర్ 23

ఉద్దేశ్యం:

  • దేశ సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో రైతులు పోషిస్తున్న పాత్ర గురించి ప్రజలందరికీ తెలియచెప్పటం జాతీయ రైతు దినోత్సవం (National Farmers Day) ముఖ్య ఉద్దేశ్యం. 
  • రైతులకు వ్యవసాయంపై అవగాహన పెంచటం, వ్యవసాయ రంగంలో వస్తున్న కొత్త విధానాలను తెలియచెప్పటం, తక్కువ పెట్టుబడులతో అధిక ఉత్పత్తిని సాధించేందుకు రూపొందించిన వైజ్ఞానిక వ్యవసాయం గురించి ప్రచారం చేయటం కూడా జాతీయ రైతు దినోత్సవం లక్ష్యం.


ఎప్పటి నుంచి?:

  • 2001 లో రైతు దినోత్సవాన్ని జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించి, ప్రతీ సంవత్సరం డిసెంబర్ 23 ను జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటారు.


డిసెంబర్ 23 నే ఎందుకు?

  • భారతదేశం 05 ప్రధాని చౌదరి చరణ్ సింగ్ (Chaudhary Charan Singh) సేవలకు గుర్తుగా ప్రభుత్వము ఆయన జన్మ దినోత్సవాన్ని జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించింది.
  • చరణ్ సింగ్ భారత ప్రధానిగా 1979 జూలై 28 నుండి 1980 జనవరి 14 వరకు ఉన్నారు. 
  • చౌదరి చరణ్ సింగ్ చేసిన అనేక ఉద్యమాల వల్ల జమీందారీ చట్టం రద్దై, కౌలుదారీ చట్టం అమలులోకి వచ్చింది. రైతులకు బ్యాంక్ ఋణాలు అందించే విధానము ప్రవేశ పెట్టబడింది. రైతుల గురించి, వ్యవసాయ రంగం గురించి అంతగా ఆలోచించి, వారి సమస్యల పరిష్కారానికి చరణ్ సింగ్ కృషి చేశారు. 
  • దీంతో చరణ్ సింగ్ రైతు బంధుగా పేరు తెచ్చుకున్నారు.
  • చరణ్ సింగ్ సమాధిని కిసాన్ ఘాట్ అని పిలుస్తారు.
  • అతని జన్మదినం డిసెంబరు 23 ను కిసాన్ దివస్ (Kisan Diwas) లేదా జాతీయ రైతు దినోత్సవంగా భారతదేశంలో జరుపుకుంటారు.
History of National Farmers Day in Telugu | జాతీయ రైతు దినోత్సవం
చౌదరి చరణ్ సింగ్ (Chaudhary Charan Singh)



ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు దినోత్సవం:

  • గత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జన్మదినం రోజైన జులై 08 ను రాష్ట్ర రైతు దినోత్సవంగా  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019 లో ప్రకటించింది.


వివిధ దేశాలలో రైతు దినోత్సవాలు:

  • Pakistan - December 18
  • America - 12 October
  • Ghana - First Friday of December
  • India - December 23
  • Zambia - First Monday Of August


రైతుల ఆత్మహత్యలు:

National Crime Records Bureau (NCRB) విడుదల చేసిన Accidental Deaths & Suicides in India (ADSI) గణాంకాల ప్రకారం...

  • 2021లో దేశవ్యాప్తంగా 1,64,033 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో 6.6% అంటే 10,881 మంది వ్యవసాయ రంగానికి చెందినవారు ఉన్నారు (రైతులు 5,318 మంది, రైతు కూలీలు 5,563 మంది).
మహారాష్ట్ర - 4064 
కర్నాటక - 2169 
ఆంధ్రప్రదేశ్ - 1065
మధ్యప్రదేశ్ - 671

  • 2020లో దేశవ్యాప్తంగా 1,53,052 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో 10,677 మంది వ్యవసాయ రంగానికి చెందినవారు ఉన్నారు (రైతులు 5,579 మంది, రైతు కూలీలు 5,098 మంది). 

History of National Farmers Day in Telugu | జాతీయ రైతు దినోత్సవం
ADSI Report 2021

History of National Farmers Day in Telugu | జాతీయ రైతు దినోత్సవం
 ADSI Report 2016 - 2019 

ఆత్మహత్యలకు కారణాలు:
  • వ్యవసాయ పెట్టుబడులు పెరిగాయి.
  • రైతులు వడ్డీ వ్యాపారుల నుండి అప్పు తెచ్చి మరీ వ్యవసాయంలో పెట్టుబడులు పెడుతున్నారు. పంటలు సరిగ్గా పండనప్పుడు, అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
  • బోర్లపై ఆధారపడటం అధికమైంది. బోర్లు విఫలం కావడంతో రైతులపై భారం పెరిగిపోతోంది.
  • ధరలు గిట్టుబాటు కావడంలేదు. కనీస పెట్టుబడులు కూడా తిరిగి రావడంలేదు.
  • రైతులు సుస్థిరమైన వ్యవసాయ విధానాలు అనుసరించడంలేదు.
  • చిన్న కమతాలు, కౌలు సేద్యంతో కలిసిరావడంలేదు.
  • వ్యాపార స్వేచ్ఛ, ఎగుమతి-దిగుమతి విధానాలు రైతులకు అనుకూలంగా లేవు.
  • బీమా, మార్కెటింగ్, నిల్వ సదుపాయాలు తగిన స్థాయిలో లేవు.
  • వర్షాధార వ్యవసాయాన్ని ప్రభుత్వం విస్మరించింది.
  • ప్రభుత్వ విధానాలు పెద్ద రైతులకు, భారీ తరహా వ్యవసాయానికి, కొన్ని రకాల వ్యాపార పంటలకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి.

ఆత్మహత్యలు నివారించాలంటే:
  • పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలి.
  • రైతుల నుంచి ప్రభుత్వమే పంటను గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేయాలి.
  • ఎగుమతి, దిగుమతి విధానాలను రైతులకు అనుగుణంగా మార్చాలి.
  • ప్రభుత్వం సకాలంలో ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా, రుణ చెల్లింపునకు సహకరించాలి.
  • మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేనప్పుడు పెట్టుబడి వ్యయంతో పాటు అదనంగా 50 శాతం ధర చెల్లించాలి.

జయతీ ఘోష్ కమిటి:
  • రైతుల ఆత్మహత్యలు అరికట్టడానికి  2004 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైస్‌. రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వం ప్రొఫెసర్‌ జయతీ ఘోష్‌ అధ్యక్షతన ఈ కమిటిని ఏర్పాటు చేసింది.
సిఫార్సులు:
  • అందరికీ సాగునీరందేలా చేయాలి.
  • కౌలుదారులతో సహా రైతులందరికీ బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలి.
  • మెట్ట భూముల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలి.
  • సుస్థిరమైన, చౌకగా లభించే ఉత్పాదకాలను ఉపయోగించాలి.
  • గిట్టుబాటు ధర విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలి.
  • గ్రామీణులు ఆర్థికంగా ఎదిగేలా వ్యవసాయేతర కార్యకలాపాలను ప్రోత్సహించాలి.

మరికొన్ని ముఖ్యమైన అంశాలు:
  • హరిత విప్లవ పితామహుడు - నార్మన్ బోర్లాక్. వ్యవసాయ రంగానికి ఇతను చేసిన విశేష సేవలకుగానీ 1970లో నోబెల్ శాంతి బహుమతి లభించింది.
  • భారతదేశ హరిత విప్లవ పితామహుడు - ఎమ్.ఎస్.స్వామినాథన్‌. అధిక దిగుబడినిచ్చే వంగడాలను 1967లో మన దేశంలో ప్రవేశపెట్టి హరిత విప్లవానికి నాంది పలికారు.
  • ప్రకృతి/సేంద్రీయ విప్లవ పితామహుడు - సుభాష్ పాలేకర్
  • జాతీయ మహిళ రైతు దినోత్సవం - అక్టోబర్ 15 (2016 నుంచి)
  • జాతీయ వ్యవసాయ విద్యా దినోత్సవం - డిసెంబర్ 3 (2017 నుంచి)

వీటిని కూడా చూడండీ: