మైనారిటీ హక్కుల దినోత్సవం - డిసెంబర్ 18
ఉద్దేశ్యం:
- అల్ప సంఖ్యాకులకు (Minorities) తమ హక్కుల పట్ల అవగాహన కల్పించడం మైనారిటీ హక్కుల దినోత్సవం (Minorities Rights Day) యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
- ఈ రోజు భారతదేశంలోని ప్రతి రాష్ట్రం మైనారిటీలకు సంబంధించిన సమస్యలతో పాటు రాష్ట్రంలో వారి భద్రతపై దృష్టి పెడుతుంది. మైనారిటీల హక్కుల దినోత్సవం సందర్భంగా వివిధ సెమినార్లు, ప్రచారాలు మరియు కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఎప్పటి నుంచి?
- 1993 నుంచి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 18వ తేదీని మైనారిటీ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు.
- భారతదేశంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 18న జాతీయ మైనారిటీల కమిషన్ (NCM- National Commission for Minorities) ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది.
డిసెంబర్ 18నే ఎందుకు?
- మతం, భాష, జాతీయత లేదా జాతి ప్రాతిపదికన ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో వివక్ష చూపడాన్ని వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్యసమితి 1992 డిసెంబర్ 18 న మైనారిటీలకు చెందిన వ్యక్తుల హక్కుల ప్రకటనను ప్రకటించింది.
భారతదేశంలో మైనారిటీలు:
- భారత రాజ్యాంగం అల్ప సంఖ్యాక వర్గం (Minority) అనే పదాన్ని నిర్దిష్టంగా నిర్వచించనప్పటికీ మతపరమైన, భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల గురించి ప్రస్తావించింది.
- భారత ప్రభుత్వం అల్ప సంఖ్యాక వర్గాల కోసం జాతీయ మైనారిటీ కమిషన్ చట్టం - 1992 ను రూపొందించింది. ఈ చట్టంలోని సెక్షన్ 2(C) కింద భారతదేశంలో 06 మతాలను మైనారిటీలుగా గుర్తించారు. అవి:-
(1) ముస్లింలు (Muslims)
(2) సిక్కులు (Sikhs)
(3) క్రైస్తవులు (Christians)
(4) బౌద్ధులు (Buddhists)
(5) జొరాస్ట్రియన్లు (పార్సీలు) Zoroastrians (Parsis)
(6) జైనులు (Jains) (2014 జనవరి 17న కేంద్ర ప్రభుత్వం జైనులను మైనారిటీలుగా గుర్తించింది)
- భారతదేశంలో మైనారిటీలు 2011 జనగణన ప్రకారం మొత్తం జనాభాలో 19% ఉన్నారు.
- జమ్ము కాశ్మీర్, పంజాబ్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్ మరియు లక్షద్వీప్ లు మాత్రమే నోటిఫైడ్ మైనారిటీ మెజారిటీ ఉన్న రాష్ట్రాలు.
మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Minority Affairs):
- 2006 జనవరి 29 న కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ నుంచి మైనారిటీలను వేరుచేసి వారికి ప్రభుత్వ విధానాలు మరింత చేరువయ్యేలా ప్రత్యేకంగా మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు.
- ఇది మైనారిటీ వర్గాల కోసం వివిధ సంక్షేమ, నియంత్రణ మరియు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
- మొదటి కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి - A.R. Antulay (2006 - 2009).
జాతీయ మైనారిటీల కమిషన్ (NCM- National Commission for Minorities):
- 1978లో పార్లమెంట్ ఒక ఆదేశం ద్వారా జాతీయ మైనారిటీల కమిషన్ ను ఏర్పాటు చేసింది.
- 1985 లో దీనిని హోం మంత్రిత్వ శాఖ నుంచి సంక్షేమ శాఖకు బదిలీ చేశారు.
- జాతీయ మైనారిటీల కమిషన్ చట్టం - 1992 ఆధారంగా 1993లో జాతీయ మైనార్టీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించారు. ఇది 1993 మే 17 నుంచి అమల్లోకి వచ్చింది.
- ఈ కమిషన్ కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడం కోసం 2005లో 103వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపాదించారు. అయితే ఈ బిల్లు మురిగిపోయింది.
- ఇది ప్రస్తుతం మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో అంతర్భాగం.
- దీనిలో ఒక Chairman, ఒక Deputy Chairman, 06 గురు Members ఉంటారు. వీరిని నియమించే అధికారం, తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. పదవీ కాలం 3 సంవత్సరాలు.
రాష్ట్ర మైనార్టీ కమిషన్:
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్, సభ్యుల పదవీకాలం 3 సంవత్సరాలు. వీరిని గవర్నరు నియ మిస్తాడు. గవర్నరు తొలగిస్తాడు.
- వీరు తమ రాజీనామా పత్రాన్ని గవర్నరుకు సమర్పి స్తారు.
- రాష్ట్రంలోని మైనార్టీ జీవన స్థితిగతుల పైన విచారణ జరిపి నివేదికలు ఇవ్వటం దీని ప్రధాన విధి.
- ఈ కమిషన్ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించును.
- మైనార్టీల స్థితిగతులను అధ్యయనం చేసి నివేదికను సమర్పించడం. ఆ నివేదికలో పేర్కొన్న సమస్యల పరిష్కారానికి సలహాలు ఇవ్వడం.
- మైనార్టీ ఫిర్యాదులను స్వీకరించి, విచారించి అవసరమైన చర్యలకు సిఫారసు చేయడం.
- మైనార్టీలకు రాజ్యాంగం ద్వారా కల్పించబడిన ప్రత్యేక సదుపాయాల పట్ల అవగాహన కల్పించి చైతన్య పరచడం.
- మైనార్టీ సంక్షేమానికి వివిధ ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను సమీక్షించడం మొదలైనవి.
మైనారిటీలకు రాజ్యాంగ రక్షణలు:
- భారతీయ రాజ్యాంగం మైనారిటీ అనే పదాన్ని నిర్వచించనప్పటికీ, అది రాజ్యాంగ భద్రతలను మరియు మైనారిటీలకు ప్రాథమిక హక్కులను అందించింది.
- ఆర్టికల్ 29(1): భారత దేశంలో నివసిస్తున్న పౌరుల్లో ఏ వర్గం వారైనా తమ విశిష్ట భాష, సంస్కృతి, లిపిని కాపాడుకునే హక్కు కలిగి ఉంటారు.
- ఆర్టికల్ 29(2): రాజ్యం నిర్వహిస్తున్న లేదా రాజ్య ఆర్థిక సహాయం పొందుతున్న విద్యా సంస్థల్లో ప్రవేశాలను మత, జాతి, కుల, భాష ప్రాతిపదికన ఏ పౌరుడికి నిరాకరించకూడదు.
- ఆర్టికల్ 30(2): అల్ప సంఖ్యాక వర్గాల నిర్వహణలోని విద్యా సంస్థలకు ఆర్థిక సహాయం మంజూరు చేసే విషయంలో రాజ్యం ఎలాంటి వివక్ష చూపకూడదు.
- ఆర్టికల్ 347: ఏదైనా ఒక రాష్ట్రంలో మెజారిటీ సంఖ్యలో ఉన్న జనాభా తాము మాట్లాడే భాషను ఆ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాల్సిందిగా రాష్ట్రపతిని కోరవచ్చు. రాష్ట్రపతి ఈ సమయంలో తగు చర్యలు తీసుకోవచ్చు.
- ఆర్టికల్ 350: ఏ వ్యక్తి అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగించే ఏ భాషలోనైనా తన సమస్యను సంబంధిత అధికారికి విన్నవించుకోవచ్చు.
- ఆర్టికల్ 350(A): భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల వారికి ప్రాథమిక స్థాయిలో వారి మాతృభాషలోనే విద్యా బోధన చేసేందుకు సదుపాయాలు కల్పించాలి.
- ఆర్టికల్ 350(B): భాషాపరమైన మైనారిటీల కోసం రాష్ట్రపతి ప్రత్యేకాధికారిని నియమించాలి.
మైనారిటీల స్థితిగతులపై కమిటీలు:
(1) సచార్ కమిటీ:
- భారతదేశంలో సామాజిక, ఆర్థిక, విద్యా రంగాల్లో ముస్లింల స్థితికి సంబంధించి నివేదికను సమర్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం జస్టిస్ రాజేందర్ సచార్ (Rajinder Sachar) నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో 2005 మార్చి 9న ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 2006 నవంబరు 17న ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది.
- సామాజిక , మతపరమైన వర్గాల ప్రాథమిక సమాచారాన్ని సేకరించాలి.
- స్థానిక ప్రభుత్వాలలో నియామకం ద్వారా ప్రాతినిధ్యం కల్పించడం.
- బ్రిటన్లో మాదిరిగా సమాన అవకాశాల కమిషన్ ఏర్పాటు చేయడం.
- పోలీస్, సైన్యం వంటి రంగాలలో వీరి శాతాన్ని పెంచడం అవకాశాలకు సంబంధించి ఉచిత - శిక్షణ ఇవ్వడం.
- స్వశక్తి సముదాయాల ద్వారా ముస్లిం స్త్రీలకు పరపతి సౌకర్యాలు కల్పించడం.
(2) రంగనాథ్ మిశ్రా కమిటీ:
- మైనారిటీల మత, భాషాపరమైన స్థితిగతులపై సిఫార్సులు చేయడం కోసం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, జాతీయ మానవ వనరుల కమిషన్ మాజీ ఛైర్మన్ జస్టిస్ రంగనాథ్ మిశ్రా అధ్యక్షతన నలుగురు సభ్యులతో 2004 అక్టోబరు 29న ఒక కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ దేశవ్యాప్తంగా పర్యటించి మైనారిటీ మతాల స్థితిగతులు, వారి వాస్తవ పరిస్థితిపై 2007 మే 21న కేంద్ర ప్రభుత్వానికి ఒక సమగ్ర నివేదికను సమర్పించింది.
- మైనార్టీలు విద్య , ఉద్యోగ రంగాలలో బాగా వెనుకబడి ఉన్నారు కాబట్టి విద్య , ఉద్యోగ అవకాశాలలో 15 % రిజర్వేషన్ ఇవ్వమని సిఫారసు చేసింది. ఈ రిజర్వేషన్ SC, ST కోటా 7 %, OBC కోటాలో 8 % కోత విధించి అమలు చేయమని సిఫారసు చేసింది.
మైనారిటీల సంక్షేమ పథకాలు:
- మైనారిటీల సంక్షేమానికి మన్ మోహన్ సింగ్ ప్రభుత్వం 2006లో ప్రధానమంత్రి 15 పాయింట్ల కార్యక్రమం (15 point Programme for minorities) ప్రవేశపెట్టింది.
- UPSC, SPSC, SSC లాంటి పరీక్షల శిక్షణకు నై ఉడాన్ (Nai Udaan) పథకం
- అల్ప సంఖ్యాక మహిళల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి నై రోష్ని (Nai Roshni) పథకం
- మైనార్టీ యువతలో నైపుణ్యాల అభివృద్ధి కోసం సీఖో ఔర్ కమావో (Seekho aur Kamao (Learn & Earn) పథకం
- మైనార్టీల సంప్రదాయక వృత్తుల పరిరక్షణ, శిక్షణ, అభివృద్ధికి ఉస్తాద్ పథకం
- భారతీయ సంస్థల్లో భాగంగా గొప్ప వారసత్వం కలిగిన మైనారిటీల సంస్కృతి పరిరక్షణకు హమారీ థరోహర్ (Hamari Dharohar) పథకం.
వీటిని కూడా చూడండీ: