History of National Pollution Control Day in Telugu | జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం |
జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం - డిసెంబర్ 2
లక్ష్యం:
- పారిశ్రామిక విపత్తుల నిర్వహణ మరియు నియంత్రణపై అవగాహన విస్తరించడం.
- పారిశ్రామిక ప్రక్రియలు లేదా మానవ నిర్లక్ష్యం వల్ల కలిగే కాలుష్యాన్ని నివారించడానికి.
- కాలుష్య నియంత్రణ చర్యల యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు మరియు పరిశ్రమలకు అవగాహన కల్పించడం.
డిసెంబర్ 2 నే ఎందుకు?
- 1984 డిసెంబర్ 2 న జరిగిన భోపాల్ దుర్ఘటన (Bhopal Disaster) లేదా భూపాల్ గ్యాస్ విషాదం (Bhopal Gas Tragedy) లో ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థం ఈ రోజును జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవంగా జరుపుకుంటారు.
భోపాల్ దుర్ఘటన (Bhopal Disaster):
- ఇది ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన మరియు అతి పెద్ద పారిశ్రామిక విపత్తుగా పరిగణించబడుతుంది.
- 1984 డిసెంబర్ 2న అర్ధరాత్రి సమయంలో భోపాల్ నగరంలో ఉన్న పురుగుమందులు తయారుచేసే Union Carbide India Limited (UCIL) అనే పరిశ్రమ నుంచి 41 టన్నుల మిథైల్ ఐసోసైనేట్ (MIC - Methyl Iso cyanate) అనే విషరసాయనం లీక్ కావడం వలన నిమిషాల వ్యవధిలోనే 2259 మంది అమాయక ప్రజలు మరణించారు. మరో 72 గంటల్లో 3487 మంది అసువులు బాశారు.
- అనంతరం ఈ దుర్ఘటన వల్ల 8 నుంచి 10 వేల మంది, మొత్తంగా 25000 మంది ఈ గ్యాస్ లీకేజీ వలన ఉత్పన్నమైన పరిణామాలతో మరణించినట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా 2006 సంవత్సరంలో ఒక ప్రభుత్వ అఫిడవిట్లో గ్యాస్ లీకేజి వలన 5,58,125 మంది ప్రభావితమైనట్టు పేర్కొంది.
గణాంకాలు:
World Air Quality Report 2019:
IQAir and Greenpeace విడుదల చేసిన గణాంకాల ప్రకారం,
- ప్రపంచంలో అత్యంత కలుషితమైన దేశాలలో మొదటి స్థానం - బంగ్లాదేశ్ (2వ స్థానం- పాకిస్థాన్, 3వ స్థానం- మంగోలియా, 4వ స్థానం- అఫ్ఘనిస్థాన్, 5వ స్థానం-భారతదేశం, చివరి స్థానం 98- బహమస్)
- ప్రపంచంలో అత్యంత కలుషితమైన నగరాలలో మొదటి స్థానం - ఘజియాబాద్ (ఇండియా)
- ప్రపంచంలోని 30 అత్యంత కలుషితమైన నగరాల్లో 21 భారత్‌లోనే ఉన్నాయి.
- అత్యంత కలుషితమైన వాతావరణం ఉన్న రాజధానుల్లో మొదటి స్థానం - న్యూఢిల్లీ (ఇండియా)
- ప్రపంచంలోఅత్యంత కలుషితమైన దేశాలలో మొదటి స్థానం - బంగ్లాదేశ్ (2వ స్థానం- పాకిస్థాన్, 3వ స్థానం- భారతదేశం, చివరి స్థానం 72- ఐస్లాండ్)
- ప్రపంచంలో అత్యంత కలుషితమైన నగరాలలో మొదటి స్థానం - గురుగ్రామ్ (ఇండియా)
- ప్రపంచంలోని 30 అత్యంత కలుషితమైన నగరాల్లో 22 భారత్‌లోనే ఉన్నాయి. ఇందులో విశాఖపట్నం 112, హైదరాబాద్ 171, విజయవాడ 345, తిరుపతి 360 వ స్థానంలో ఉన్నాయి.
పర్యావరణం (Environment):
- మనం నివసించే ప్రదేశంలో చుట్టూ వుండే ప్రాంతాన్నే పరిసరాలని (Environs), దీనిలో వుండే మౌలిక విషయాలనే పర్యావరణం అని అంటారు.
కాలుష్యం (Pollution):
- పర్యావరణ వ్యవస్థ లేదా భౌతిక వ్యవస్థలకు అస్థిరత, అసమానత, హాని లేదా అసౌకర్యం కలిగించే విధంగా కలుషితాలని పర్యావరణంలోకి విడుదల చెయ్యటాన్ని కాలుష్యం అంటారు.
- కాలుష్యం అనేది రసాయనిక పదార్ధాలు లేదా ధ్వని, వేడిమి లేదా కాంతి శక్తి వంటి శక్తి రూపాలలో ఉండవచ్చు. పర్యావరణ కాలుష్యం ప్రకృతి వైపరీత్యాల ద్వారా కూడా జరగవచ్చు.
- మనిషి తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రకృతి ప్రసాదించిన వనరులను అవసరానికి మించి వాడుకుంటున్నాడు. ఆ వనరుల దుర్వినియోగంతో మితిమీరుతున్న కాలుష్యం మనుషుల ఆయువును హరించివేస్తున్నది. పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం అన్నీ కలుషితమై మనిషి మనుగడను ప్రశ్నిస్తున్నాయి. అభివృద్ధి కొరకు మనిషి సాధించిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానమే నేడు ప్రకృతి కాలుష్యానికి కారణమవుతున్నది. మనుషుల నిర్లక్ష్యం ఫలితంగా నీరూ నేలా కలుషితమై వాయు, జల కాలుష్యం పెరిగి మానవ జీవితాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. విష వాయువులు వాతావరణంలో పరిమితికి మించి పెరగడం వల్ల క్రమంగా భూమండలం వేడెక్కుతున్నది. తద్వారా పుడమితల్లి పురిటి నొప్పుల పాలవుతున్నది. లక్షల మరణాలకు కారణమవుతున్నది.
కాలుష్య రకాలు:
- వాయు కాలుష్యం (Air Pollution)
- నీటి కాలుష్యం (Water Pollution)
- నేల కాలుష్యం (Soil Pollution)
- శబ్ద కాలుష్యం (Noise Pollution)
- రేడియోధార్మిక కాలుష్యం (Radioactive Contamination)
పర్యావరణ పరిరక్షణ చట్టాలు:
- వాహనాలు, పారిశ్రామిక సంస్థలు వెలువరించే వ్యర్థ పదార్థములు, జనజీవనానికి, పశుపక్ష్యాదులకు, వృక్షాలకు తీవ్ర ప్రమాదం ఎదురవుతున్నదని కేంద్ర ప్రభుత్వం అనేక చట్టాలను తీసుకువచ్చింది.
- నీటి కాలుష్య నివారణ, నియంత్రణ చట్టం – 1974
- నీటి కాలుష్య నివారణ నియంత్రణ శిస్తు చట్టం – 1977
- వాయు కాలుష్య నివారణ నియంత్రణ చట్టం – 1981
- పర్యావరణ పరిరక్షణ చట్టం – 1986
- ప్రమాదకర వృథా పదార్థాల (నిర్వహణ) నియమాలు -1989
- ప్రమాదకర రసాయనాల తయారీ నిలువ దిగుమతి నిరోధ నియమాలు – 1989
- అటవీ రక్షణ చట్టం – 1970
- వన్య ప్రాణి రక్షణ చట్టం – 1972 మొదలైనవి.
- భారత రాజ్యాంగంలోని 48A, 51A(G) అధికరణల ప్రకారం ప్రభుత్వానికి మరియు ప్రజలకు పర్యావరణ అంశంపై సమగ్రమైన ఆదేశిక సూత్రాలను నిర్ధారించింది. ప్రభుత్వాలు పర్యావరణాన్ని మెరుగుపరుస్తూ పరిరక్షిస్తూ అడవులు, చెరువులు, నదులు, వన్యప్రాణులలో సహా అన్ని జీవులపైన కారుణ్యం కలిగి ఉండాలని పేర్కొంది.
కొన్ని కోర్టు తీర్పులు:
- ప్రతి పౌరుడు ఆనందంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవనం సాగించే హక్కు కల్గి ఉన్నాడని, అది అతని ప్రాథమిక హక్కు అని ఒక కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
- కాలుష్య రహిత పర్యావరణం మానవ హక్కులలోనూ జీవించే హక్కులో కూడా భాగమేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
- పట్టణ ప్రాంతాల్లో పర్యావరణ సమతుల్యం కోసం పార్కులు ఏర్పాటు చేయాలని సూచించింది.
- పరిశ్రమల ద్వారా పర్యావరణ కాలుష్యం ఏర్పడితే నష్టపరిహారం చెల్లించే బాధ్యత ఆ పరిశ్రమలదేనని తీర్పు చెప్పింది.
- స్వచ్ఛమైన గాలి, నీరు లేకపోవడం జీవించే హక్కు ఉల్లంఘన క్రిందకు వస్తాయని కూడా కోర్టు తీర్పు చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (APPCB- Andhra Pradesh Pollution Control Board):
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యావరణ చట్టాలు మరియు నియమాలను అమలు చేయడం ద్వారా కాలుష్య నివారణ మరియు నియంత్రణ చేయడానికి ఏర్పాటు చేయబడిన ఒక చట్టబద్ధమైన సంస్థ.
- 1976 జనవరి 01 న నీటి (కాలుష్య నివారణ మరియు నియంత్రణ)చట్టం -1974 ప్రకారం ఈ బోర్డును రాష్ట్ర కాలుష్య నివారణ మరియు నియంత్రణ కొరకు ఏర్పాటు చేసింది.
- గాలి (కాలుష్య నివారణ మరియు నియంత్రణ) చట్టం - 1981 అమల్లోకి వచ్చిన తరువాత బోర్డు పేరును ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిగా మార్చారు.
- ప్రారంభంలో బోర్డు నీటి చట్టం -1974 లోని నిబంధనలను అమలు చేయడానికి మాత్రమే ఏర్పాటు చేయబడింది. తదనంతరం ఇతర పర్యావరణ చట్టాలు మరియు నియమాలను అమలు చేసే బాధ్యతను బోర్డుకి అప్పగించారు.
- ఇది 03 జోనల్ మరియు 13 ప్రాంతీయ కార్యాలయాలను కలిగి ఉంది.
- జోనల్ కార్యాలయాలు: Visakhapatnam, Vijayawada and Kurnool
- ప్రాంతీయ కార్యాలయాలు: Visakhapatnam, Vizanaragaram, Kakinada, Eluru, Vijayawada, Guntur, Nellore, Kurnool, Tirupathi, Ongole, Srikakulam, Anantapur and Kadapa
- APPCB Toll Free No - 10741. ఇంతకు ముందు వరకు 040-23812600 అనే నెంబర్ ఉండేది.
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB- Central Pollution Control Board):
- దీన్నీ 22 సెప్టెంబర్ 1974 న స్థాపించారు.
- ఇది 07 జోనల్ కార్యాలయాలను కలిగి ఉంది. అవి.. బెంగళూరు, కోల్‌కతా, షిల్లాంగ్, భోపాల్, లక్నో, వడోదర, మరియు ఆగ్రా.
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి - లోగో |
వీటిని కూడా చూడండీ: