History of International Volunteer Day in Telugu | అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం


History of International Volunteer Day in Telugu | అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం

అంతర్జాతీయ స్వచ్ఛంద
దినోత్సవం - డిసెంబర్ 5

ఉద్దేశ్యం:
  • ప్రపంచవ్యాప్తంగా శాంతి, అభివృద్ధిలకు మద్దతుగా వాలంటీరిజాన్ని మెరుగుపరచడంతోపాటు... కష్టాల్లో ఉన్నవారిని ఎలాంటి లాభాపేక్ష లేకుండా రక్షించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న వారందరి సేవను గుర్తించడం అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం (International Volunteer Day) యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
  • అభివృద్ధి లక్ష్యాల్ని అందుకోవడానికి అనేక దేశాలు స్వచ్చంద కార్యకర్తల సేవలపై దృష్టిని సారించాయి. పేదరికము, ఆకలి, రుగ్మతలు, నిరక్షరాస్యత, వాతావరణ లోపాలు, మహిళలపట్ల వివక్ష వంటి సమస్యల్ని ఎదుర్కోవడంలో లక్ష్యాలు నిర్ణయించి ఆ దిశగా వలంటీర్లను ప్రోస్తహిస్తున్నారు.
  • స్వచ్చంద కార్యకర్తలు, కమిటీలు, సంస్థలు, స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయి అభివృద్ధి కోసం తమ వంతు కృషిని అందిస్తారు. ప్రభుత్వ సంస్థలు, లాభేతర సంస్థలు, కమ్మ్యూనిటీ గ్రూపులు, ఎకడమిక్ ప్రవేట్ రంగంతో కలసి అభివృద్ధిలో భాగం పంచుకోవడానికి ప్రజలు, స్వచ్చంద కార్యకర్తలకు ఈ రోజు ఒక మహత్తరమైన అవకాశం వంటిది.

ఎప్పటి నుంచి?
  • యుఎన్ జనరల్ అసెంబ్లీ 2001 నుండి ప్రతీ సంవత్సరం డిసెంబర్ 5 న  ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి కోసం అంతర్జాతీయ వాలంటీర్  దినోత్సవాన్ని (International Volunteer Day for Economic and Social Development) జరుపుకోవాలని ప్రకటించింది.
  • 1997 నవంబరు 20వ తేదీన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2001 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ వలంటీర్స్ గా ప్రకటించారు.

Themes (థీమ్స్):
  • 2020: Together We Can Through Volunteering
  • 2019: Volunteer for an inclusive future
  • 2018: Volunteers build Resilient Communities
  • 2017: Volunteers Act First. Here. Everywhere
  • 2016: Global Applause – give volunteers a hand
  • 2015: Your world is changing. Are you? Volunteer

వీటిని కూడా చూడండీ: