History of Good Governance Day in Telugu | సుపరిపాలనా దినోత్సవం - డిసెంబర్ 25 |
సుపరిపాలనా దినోత్సవం - డిసెంబర్ 25
ఉద్దేశ్యం:
- ప్రభుత్వంలో జవాబుదారీతనం గురించి భారత ప్రజలలో అవగాహన పెంపొందించడం, అలాగే మాజి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి (Atal Bihari Vajpayee) ని స్మరించుకుని, గౌరవించటం సుపరిపాలనా దినోత్సవం (Good Governance Day) యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
ఎప్పటి నుంచి?
- 2014 లో మోడీ ప్రభుత్వం డిసెంబర్ 25 ను జాతీయ సుపరిపాలనా దినోత్సవంగా ప్రకటించింది.
డిసెంబర్ 25నే ఎందుకు?
- మాజి ప్రధాని వాజ్‌పేయి పుట్టిన రోజైన డిసెంబర్ 25ను (1924 డిసెంబర్ 25 - 2018 ఆగస్టు 16) జాతీయ సుపరిపాలనా దినోత్సవంగా జరుపుకుంటారు.
వ్యతిరేకత - విమర్శ:
- డిసెంబర్ 25వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది క్రైస్తవులు క్రిస్మస్ పండుగ జరుపుకునే రోజు కావడంతో ఆ రోజును సుపరిపాలనా దినంగా నిర్వహించడం విమర్శలు రేకెత్తించింది. కాంగ్రెస్, వామపక్షాలు మొదలుకొని చాలా రాజకీయ పక్షాలు ఈ ప్రయత్నాన్ని నిరసించాయి.
- క్రిస్మస్ సెలవును రద్దుచేసి ఆరోజున సుపరిపాలనా దినంగా జరపాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై పార్లమెంటులో దుమారం చెలరేగింది. చివరకు పార్లమెంటులో ఈ విషయంపై వచ్చిన ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం క్రిస్మస్ సెలవు రద్దు చేస్తూ ఏ ఆదేశమూ వెలువడలేదని స్పష్టం చేశారు.
మౌలిక లక్షణాలు:
- సుపరిపాలనకు 8 అంశాలను మౌలిక లక్షణాలుగా యునైటెడ్ నేషన్స్ (United Nations) పేర్కొంది.
(1) Consensus Oriented: ప్రతి విషయంలోనూ అభిప్రాయం సేకరించి అంతిమ నిర్ణయానికి రావడం ద్వారా ప్రజాభిప్రాయాన్ని గౌరవించడం.
(2) Participation: సమాజంలోని ప్రతి ఒక్క రినీ భాగస్వాములను చేయడం.
(3) Rule of Law: ఆయా దేశాలలో అమలులో ఉన్నటువంటి న్యాయ నిబంధనలను పాటించడం.
(4) Effectiveness and Efficiency: పటిష్టంగా పనిచేయడం, ప్రతిభావంతంగా ఫలితాలు సాధించడం.
(5) Accountability: జవాబుదారీతనం.
(6) Transparency: ప్రతిదీ పారదర్శకంగా ఉండడం.
(7) Responsiveness: బాధ్యతాయుతంగా ఉండడం.
(8) Equity and Inclusiveness: అందరికీ సమాన ఫలితాలు అందాలి, అందు కోసం అందరిని కలుపుకోగలిగి ఉండాలి.
వీటిని కూడా చూడండీ: