Sunday, January 3, 2021

History of World Braille Day in Telugu | ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం


History of World Braille Day in Telugu | ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం - జనవరి 4
History of World Braille Day in Telugu | ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం


World Braille Day
ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం - జనవరి 4


ఉద్దేశ్యం:
  • అంధ మరియు దృష్టి లోపం ఉన్నవారికి చదవడానికి మరియు వ్రాయడానికి సహాయం చేయడంలో లూయిస్ బ్రెయిలీ చేసిన కృషిని గుర్తించడం ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం (World Braille Day) యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

ఎప్పటి నుంచి?
  • జనవరి 4 న బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకోవాలని  యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ నవంబర్ 2018 లో ప్రకటించింది.
  • మొదటి ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని 4 జనవరి 2019 న జరుపుకున్నారు.

జనవరి 4 నే ఎందుకు?
  • లూయిస్ బ్రెయిలీ జన్మదినం అయిన 4 జనవరి (1809) ను ప్రపంచ బ్రెయిలీ దినోత్సవంగా జరుపుకుంటారు. 
  • ఇతను  అంధులు స్పర్శజ్ఞానంతో చదివేందుకు, మరియు రాసేందుకు ఒక లిపిని తయారు చేశాడు. 
  • ఇతను రూపొందించిన లిపి బాగా ప్రాచుర్యం పొందటంతో ఈ లిపికి బ్రెయిలీ లిపిగా పేరు వచ్చింది.

బ్రెయిలీ లిపి:
  • స్పెయిన్‌ దేశానికి చెందిన ఫ్రాన్సిస్కో లూకాస్‌ 16 వ శతాబ్దంలో చెక్కమీద ఎత్తుగా ఉబ్బివుండే అక్షరాలను చెక్కే పద్ధతి రూపొందించాడు.  
  • 1821 లో ఛార్లెస్ బార్బియర్ అనే సైనికాధికారి, తన సైనికులు చీకటిలో కూడా తాను పంపిన సమాచారం గుర్తించేందుకు 12 ఉబ్బెత్తు చుక్కలతో సంకేత లిపిని తయారు చేసాడు.
  • దీని గురించి తెలుసుకున్న బ్రెయిలీ 12 చుక్కలను 06 చుక్కలకు తగ్గించి అవసరమైన రీతిలో వాటిని పేర్చుతూ అక్షరాలను, పదాలను అంకెలను, సంగీత చిహ్నాలను అంధులు స్పర్శజ్ఞానంతో చదివేందుకు, మరియు రాసేందుకు ఒక లిపిని తయారు చేశాడు.

బ్రెయిలీ ఆంగ్ల అక్షరాల చార్టు:

History of World Braille Day in Telugu | ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం
బ్రెయిలీ ఆంగ్ల అక్షరాల చార్టు

అంధత్వ గణాంకాలు:
  • మన దేశంలో 2011 నాటికి దాదాపు 15 మిలియన్ల అంధులు ఉన్నారు.‌ 
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ Magnitude and causes of visual impairment యొక్క అంచనాల ప్రకారం 2002 సంవత్సరంలో ప్రపంచంలో సుమారు 161 మిలియన్ (సుమారు 2.6% జనాభా) మంది దృష్టి లోపాలతో బాధపడుతున్నారని వీరిలో 124 మిలియన్ (సుమారు 2%) మందిలో దృష్టి మాంద్యం ఉన్నట్లు మరియు 37 మిలియన్ (సుమారు 0.6%) మంది అంధులుగా ప్రకటించింది.

అవార్డులు:
బెస్ట్ బ్రెయిలీ ప్రింటింగ్ ప్రెస్ ఇన్ ది కంట్రీ - 2019:
  • బేగంపేట మయూరీ మార్గ్‌లోని దేవనార్ ఫౌండేషన్ ఫర్ ది బ్లైండ్ కరస్పాండెంట్ ఎ.జ్యోతిగౌడ్‌కు 'బెస్ట్ బ్రెయిలీ ప్రింటింగ్ ప్రెస్ ఇన్ ది కంట్రీ - 2019’ అవార్డు దక్కింది.
  • సాధారణ చిన్నారులతో సమానంగా అంధ విద్యార్థులు ఉన్నతంగా రాణించాలనే ఉద్దేశంతో బ్రెయిలీ లిపిలో ఆమె వేల సంఖ్యలో పుస్తకాల ప్రచురణ చేశారు.


లూయిస్ బ్రెయిలీ గురించి
  • పేరు: లూయిస్ బ్రెయిలీ (Louis Braille)
  • జననం: 4 జనవరి 1809
  • జన్మస్థానం: పారిస్ కు 20 మైళ్ళ దూరంలోని కూప్ వ్రే (Coupvray)
  • తల్లిదండ్రులు: మోనిక్‌ బ్రెయిలీ, సైమన్‌ రెనె బ్రెయిలీ
  • కంటి చూపు: మూడేళ్ల వయసులో అతని కంటికి గాయం కావడం వల్ల చూపు కోల్పోయాడు.
  • చదువు: ఏడేళ్ళ వయసు వరకు స్థానిక పాఠశాలలోనే చదివాడు. ఐతే కంటిచూపు పూర్తిగా కోల్పోయిన బ్రెయిలీ పది సంవత్సరాల వయసులో వాలెంటైన్‌ హ్యూ చేత 1784 లో పారిస్‌లో ప్రారంభించబడిన రాయల్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్లైండ్ యూత్‌లో చేరాడు. ఇది అంధ పిల్లల కోసం స్థాపించబడిన ప్రపంచంలోనే మొట్టమొదటి పాఠశాల. ఈ పాఠశాలలో ఆనాడు అమలులో ఉన్న లైన్‌ టైపు పద్ధతిలో చదువుకున్నాడు.
  • వృత్తి: బ్రెయిలీ చదువుకున్న రాయల్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్లైండ్ యూత్‌ పాఠశాలలోనే 17వ ఏట ఉపాధ్యాయుడయ్యారు. ఆ విధంగా అంధుల పాఠశాలలో ప్రప్రథమ అంధ టీచర్ గా గుర్తింపు పొందారు. ఈయన సంగీతకారుడు కూడా.
  • మరణం: 6 జనవరి 1852 లో క్షయవ్యాధితో పారిస్ మరణించాడు.

మరికొన్ని అంశాలు:
  • బ్రెయిలీ 200 జన్మ దినోత్సవం సందర్భంగా (1809-2009) భారతదేశం బ్రెయిలీ గౌరవార్థం 2 రూపాయల నాణాన్ని అతని బొమ్మతో 2009 లో విడుదల చేసింది.
History of World Braille Day in Telugu | ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం

  • కొన్ని రంగుల మధ్య భేదాన్ని గుర్తించలేకపోవడాన్ని వర్ణ అంధత్వం లేదా వర్ణాంధత (Colour Blindness) అంటారు.
  • రాత్రి సమయంలో విటమిన్-ఎ లోపం మూలంగా కలిగే దృష్టి మాంద్యాన్ని రేచీకటి (Night Blindness) అంటారు.
  • దృష్టి తీవ్రత 20/70 to 20/200 ఉంటే దృష్టి లోపం అంటారు.
  • దృష్టి తీవ్రత 6/18 కంటే తక్కువ, 3/60 కంటే మెరుగ్గా ఉండటాన్ని దృష్టి మాంద్యం (Low vision) అంటారు.
  • దృష్టి తీవ్రత 3/60 కంటే తక్కువగా ఉండటాన్ని అంధత్వం (Blindness) అంటారు.
  • ప్రపంచ దృష్టి దినోత్సవం (World Sight Day) ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండవ గురువారం పాటిస్తారు.
  • అంధుల ఆసరా దినోత్సవం (White Cane Safety Day) ను అమెరిక దేశంలో 1964 నుండి ప్రతి సంవత్సరం అక్టోబర్ 15 న జరుపుకుంటారు.

వీటిని కూడా చూడండీ:



No comments:

Post a Comment