కార్మికుల (మే డే)
దినోత్సవం - మే 01
దినోత్సవం - మే 01
ఉద్దేశం:
- నిరంకుశ శ్రమదోపిడీని నిరసిస్తూ... యావత్ ప్రపంచ కార్మికులకు స్పూర్తినిస్తూ... పారిశ్రామిక వేత్తలను నిలదీస్తూ... వేసిన ముందడుగే కార్మిక దినోత్సవం.
- ప్రజల శ్రమను రోజుల తరబడి దోచుకున్న సమయంలో మేము మనుషులమే. మా శక్తికి కూడా పరిమితులుంటాయి. ఈ చాకిరి మేం చేయలేమని పని ముట్లు కింద పడేసి ఎనిమిది గంటల పని దినం కోసం కార్మికులు చేేేసిన పోరాటాన్ని జ్ఞాపకం చేసుకోవడం అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం (May Day/ International Workers' Day/ Workers' Day/ Labour Day) ముఖ్య ఉద్దేశ్యం.
మే డే చరిత్ర:
- 1837 లోనే ఇంగ్లాండ్ లోని ఫిలడల్ఫియాలో మెకానిక్స్ యూనియన్ నాయకత్వాన 10 గంటల పని దినం కోసం తొలి సమ్మె జరిగింది.
- 1834 లో అమెరికాలోని న్యూయార్క్ పట్టణంలో పని గంటలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్రారంభమైన ఉద్యమం పలు పట్టణాలకు వ్యాపించి పెద్ద ఎత్తున జరిగిన ప్రదర్శనలలో, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- 1866 లో అమెరికాలోని బార్డిమోర్ లో 60 కార్మిక సంఘాల ప్రతినిధులు "నేషనల్ లేబర్ యూనియన్" పేరుతో ఒక కార్మిక సంఘాన్ని స్థాపించి విలియం హెచ్.సెల్విన్ నాయకత్వాన లండన్ లోని ఫస్ట్ ఇంటర్ నేషనల్ నాయకులతో సంబంధాలు ఏర్పరుచుకుని 8 గంటల పని విధానం కోసం ఉద్యమించారు.
- 1886 లో అమెరికా నగరాలైనా చికాగో, న్యూయార్క్, బాల్డిమోర్, వాషింగ్టన్, విల్ వాకి, సిన్సినాటి, సెయింట్ లూయీస్, ఫిట్స్ బర్గ్, డెట్రాయిట్ వంటి నగరాలలో 11,562 సమ్మెలు జరిగాయి. ఈ సమ్మెలలో 5 లక్షల మంది కార్మికులు పాల్గొన్నారు.
- చికాగో(Chicago) నగరంలో కనీవినీ ఎరుగని రీతిలో కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు.
- అమేరికా దేశవ్యాప్తంగా 13,000 సంస్థలలో 3 లక్షల మంది కార్మికులు సమ్మెలలో పాల్గొంటే, ఒక్క చికాగో నగరంలోనే 40 వేల మంది కార్మికులు సమ్మె చేశారు.
- 1886 మే 3 వ తేది చికాగో నగరంలో లక్ష మంది కార్మికులు చేసిన సమ్మెలో పోలీసులకు, కార్మికులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
- దీనికి నిరసనగా మే 4 వ తేది చికాగోలోని హే మార్కేట్ (Hey Market) సెంటర్ లో జరిగిన ప్రదర్శనల్లో లక్షలాది మంది కార్మికులు పాల్గొన్నారు.
- ఈ ప్రదర్శనల్లో అనేక మంది కార్మికులు చనిపోవడం, గాయాలపాలవడం వంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
- ఉద్రిక్తులైన కార్మికులను సముదాయించేందుకు అధికారుల బృందం ప్రయత్నిస్తూంటే, యాజమాన్యం ప్రోద్భలంతో గుర్తు తెలియని వ్యక్తి ప్రయోగించిన బాంబు పేలుడులో 7 గురు పోలీసులు, 8 మంది పౌరులు మరణించారు.
- దీనితో హే మార్కేట్ (Hey Market) ప్రాంతం రక్తసిక్తమై వందలాది మంది కార్మికుల రక్తంతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది.
- చికాగో ఘటనలపై విచారించిన ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించకపోగ, 8 మంది కార్మిక నాయకులను బాధ్యులుగా గుర్తించీ, విచారణ నిర్వహించి 7 గురికి మరణ శిక్ష విధింసింది. ఒకరికి 15 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. (ఇందులో ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు.నలుగురిన ఉరితీశారు. మిగిలిన ముగ్గురు 6 సంవత్సరాల తర్వాత క్షమించబడ్డారు)
- పని గంటల తగ్గింపు కోసం చికాగో కార్మికులు చిందించిన రక్తం ఎర్ర జెండాగా ప్రపంచమంతా కార్మిక వర్గ ఉద్యమం పెల్లుబికింది.
- శ్రామిక వర్గం ఎర్ర జెండాను తమ పోరాట సంకేతంగా స్వీకరించింది.
ఏం సాదించారు:
- 24 గంటలలో ఎనిమిది గంటలు పని, ఎనిమిది గంటలు విశ్రాంతి, ఇంకా ఎనిమిది గంటలు మానసిక విశ్రాంతి (Recreation) అన్నవి ఈ పోరాటం ద్వారా సాధించుకున్నారు.
హే మార్కేట్(Hey Market):
- కార్మికులు రక్త తర్పణం చేసిన ఈ హే మార్కేట్ ప్రాంతాన్ని 1992 లో చారిత్రక ప్రదేశంగా ప్రకటించి 2004 లో మాన్యుమెంట్ నిర్మించారు.
- చికాగోవెళ్ళిన ప్రతీ విదేశీ యాత్రికుడికి హే మార్కేట్ ఒక దర్శనీయ స్థలంగా మారింది.
- ఉరితీయబడ్డ అమరుల స్మారకార్థం 'ఫారెస్టు పార్క్' స్మశానంలో స్మృతి చిహ్నాన్ని కూడా 1997 లో నిర్మించారు.
మే డే ని కార్మిక దినోత్సవంగా ప్రకటించింది:
- అమెరిక కార్మిక సంస్థ(American Federation Of Labour)1888లో సెయింట్ లూయిస్ కన్వెన్షన్ విజ్ఞప్తి మేరకు 1890 మే 1 వ తేదీ నుండి ప్రపంచ వ్యాప్తంగా మే దినోత్సవాన్ని కార్మిక వర్గ పోరాటాలకు ప్రతీకగా అంతర్జాతీయ కార్మిక సంఘిభావ దినంగా, 8 గంటల పనికోసం పోరాట స్పూర్తితో నిర్వహించాలని అంతర్జాతీయ కార్మిక మహాసభ నిర్ణహించింది.
- 1889 లో పారిస్ మొదటి సోషలిస్ట్ ఇంటర్ నేషనల్ మే డే ని కార్మిక దినోత్సవంగా ప్రకటించింది.
భారతదేశంలో మే డే:
- భారత దేశంలో చికాగో కంటే ముందే కలకత్తాలో కార్మికులు నిర్ణిత పని గంటల కోసం హౌరా రైల్వే స్టేషన్ లో 1862 లో సమ్మె చేశారు.(అప్పటి వరకు ఆ రైల్వే కార్మికులు 10 గంటలు పనిచేసేవారు. అప్పుడే బెంగాల్ పత్రికల్లో పాలక వర్గానికి చెందిన అధికారులు ఎన్ని గంటలు పనిచేస్తారో మేము కూడా అన్ని గంటలే పనిచేస్తామని డిమాండ్ చేశారు)
- కాగా, అది విస్తృత స్థాయిలో ప్రజా పోరుగా మారలేదు కాబట్టి ఆ సంఘటన ఉద్యమ స్వరూపాన్ని అందుకోలేదు.
- 1920 లో ట్రేడ్ యూనియన్ ఏర్పడటం మూలంగా అప్పటి నుంచే కార్మిక వర్గంలో చైతన్యం పెరగడం మొదలైంది.
- 1923 మే 1 న మద్రాసులో సింగారవేలు చెట్టియార్ (Leader of the Labour Kisan Party of Hindustan) నాయకత్వంలో తొలిసారీ 'మే డే' నిర్వహించబడింది.
- 1923 మే 1 న మద్రాసులో రెండు సమావేశాలు నిర్వహించబడ్డాయి. ఒకటి ట్రిప్లికేన్ బీచ్(Triplicane Beach), రెండోది మద్రాస్ హైకోర్టు దగ్గర.ఈ సమావేశాలు మే 1 న లేబర్ డే గా మరియు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని బ్రిటీష్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాయి.
నేటి పరిస్థితి:
- ప్రపంచీకరణ వలన వంద సంవత్సరాల క్రితం సాధించిన కనీస డిమాండ్లు కూడా ఈనాడు అమలుకు నోచుకోవడంలేదు.
- ప్రపంచంలో ఎనిమిది గంటల పనికోసం చేసిన పోరాటం పెట్టుబడిదారీ వర్గం పతనానికి ఆరంభమవుతుంది అనుకున్నాం. కానీ మళ్ళీ మార్కెట్ శక్తులు పాత పరిస్థితులకు ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాయి.
- ప్రపంచీకరణ, సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారులు, బహుళజాతి కంపెనీలు, మొదలైన పీడక వర్గాలు శ్రామిక దోపిడీకి, కార్మిక చట్టాల ఉల్లంఘనకు సంఘటితం అవుతున్న ఈ తరుణంలోనే ప్రపంచ కార్మికవర్గం ఆ శక్తులను ప్రతిఘటించేందుకు ద్విగుణీకృత ఉత్సాహంతో పోరాడాలి.
- ఆనాటి కార్మికవర్గ చైతన్యం మరోసారి వెల్లివిరుస్తుందని, ఈ మే డే నాడు కొత్త స్ఫూర్తిని రగిలిస్తుందని ఆశిద్దాం.