Global Peace Index in Telugu | ప్రపంచ శాంతి సూచిక | Student Soula
ప్రపంచ శాంతి సూచిక (GPI - Global Peace Index) అనేది ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ (IEP Institute for Economics & Peace) ప్రతి సంవత్సరం విడుదల చేసే నివేదిక.
మొట్టమొదటి ప్రపంచ శాంతి సూచికను 2007లో విడుదల చేశారు.
శాంతి ధోరణులు, దాని ఆర్థిక విలువ, శాంతియుత సమాజాలను ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై ఈ నివేదిక అత్యంత సమగ్రమైన డైటా ఆధారిత విశ్లేషణను అందిస్తుంది.
ఇందులో 23 అంశాలను/సూచికలను (Indicators) కొలమానంగా తీసుకుని ప్రపంచ దేశాలకు అక్కడి శాంతియుత స్థాయిని బట్టి 1-5 మధ్య వచ్చిన స్కోర్ ఆధారంగా ర్యాంకులు ఇస్తారు.
ప్రపంచ దేశాల్లో శాంతి కరువైంది. కొన్ని దేశాల్లో ఉగ్రదాడులు జరుగుతుండగా, మరికొన్ని దేశాల్లో అంతర్గత వ్యవహారాలతో శాంతి భద్రతలు అదుపుతప్పుతున్నాయి. ప్రపంప వ్యాప్తంగా ఏ ఏ దేశాలలో శాంతియుత వాతావరణం ఎలా ఉందో ఈ నివేదిక ద్వారా తెలుస్తుంది.
ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ (IEP) అనేది ఆస్ట్రేలియాకు చెందిన ఒక స్వతంత్ర, పక్షపాతం లేని, లాభాపేక్షలేని సంస్థ. ఇది Global Terrorism Index, Safety Perceptions Index, Ecological Threat Report, Positive Peace Report లను కూడా విడుదల చేస్తుంది.
ప్రపంచ శాంతి సూచిక (GPI - Global Peace Index) యొక్క 16వ ఎడిషన్ ను జూన్ 2022న విడుదల చేశారు.
ఇందులో 163 దేశాలకు ర్యాంకులు ఇచ్చారు.
ప్రపంచంలోని 99.7 శాతం జనాభా ఈ దేశాలలోనే నివసిస్తున్నారు.
ఇందులోని 23 సూచికలలో పది మెరుగుదలలు నమోదుచేయగా, 13 క్షీణించాయి.
ప్రపంచ శాంతియుతత యొక్క సగటు స్థాయి గత సంవత్సరం కంటే 0.3 శాతం క్షీణించింది.
మొత్తం 163 దేశాలలో గత సంవత్సరం కంటే 90 దేశాలు మెరుగుపడగ, 71 దేశాలు క్షీణించాయి మరియు రెండు దేశాలు స్థిరంగా ఉన్నాయి.
ఐస్‌లాండ్ ప్రపంచంలో అత్యంత శాంతియుత దేశంగా 2008 నుండి కొనసాగుతోంది. ఆఫ్ఘనిస్తాన్ వరుసగా ఐదవ సంవత్సరం ప్రపంచంలో అత్యంత తక్కువ శాంతియుత దేశంగా ఉంది.
ఇందులో 23 అంశాలను/సూచికలను (Indicators) కొలమానంగా తీసుకుని ప్రపంచ దేశాలకు అక్కడి శాంతియుత స్థాయిని బట్టి 1-5 మధ్య వచ్చిన స్కోర్ ఆధారంగా ర్యాంకులు ఇస్తారు.