Table of Contents:-
- IQ Air అనేది స్విట్జర్లాండ్ దేశపు ఎయిర్ క్వాలిటి టెక్నాలజీ కంపెనీ. దీనిని మాన్ ఫ్రెడ్ హమ్మెస్ మరియు క్లాస్ హమ్మెస్ అనే సోదరులు 1963లో జర్మనీలో స్థాపించారు.
- 1982లో దీని ప్రధాన కార్యాలయాన్ని స్విట్జర్లాండ్ కు మార్చారు.
- నగరం, దేశం మరియు ప్రాంతాల వారీగా క్రమబద్ధీకరించబడిన మరింత చారిత్రాత్మక వాయు నాణ్యత డేటాను IQAir వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
- Website: www.iqair.com
- ఇది ప్రతి సంవత్సరం ప్రపంచ వాయు నాణ్యత నివేదిక (World Air Quality Report) ను విడుదల చేస్తుంది.
- మొదటి ప్రపంచ వాయు నాణ్యతా నివేదిక-2018ను 5 మార్చ్ 2019న విడుదల చేశారు.
- ఈ నివేదికలో ఉపయోగించబడే డేటాను రెగ్యులేటరీ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లు మరియు తక్కువ-ధర గాలి నాణ్యత సెన్సార్ల నుండి తీసుకోబడుతుంది.
- ఈ పర్యవేక్షణ స్టేషన్లు మరియు సెన్సార్లను ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల ప్రభుత్వ సంస్థలు, పరిశోధనా సంస్థలు, లాభపేక్షలేని ప్రభుత్వేతర సంస్థలు, విశ్వవిద్యాలయాలు మరియు విద్యా సౌకర్యాలు, ప్రైవేట్ సంస్థలు మరియు పౌర శాస్త్రవేత్తలు నిర్వహిస్తున్నారు.
- PM2.5 యొక్క వార్షిక సగటు సాంద్రత (μg/m³) ఆధారంగా ఈ నివేదికలలో దేశాలు, రాజధానులు మరియు నగరాలకు ర్యాంకింగ్ ఇస్తుంది.
PM2.5 అంటే?:
- PM2.5 (Particulate Matter) అనేది 2.5 మైక్రోమీటర్ల వ్యాసం లేదా అంతకంటే తక్కువ ఉండే దుమ్ము రేణువులను సూచిస్తుంది.
- ఈ రేణువులు మానవ జట్టు యొక్క వ్యాసంలో 3% ఉంటాయి.
- ఈ PM2.5 కణాలు ముఖ్యంగా మానవ ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే ఇవి ఊపిరితిత్తులలోకి లోతుగా చొచ్చుకుపోయేంత చిన్నవిగా ఉంటాయి మరియు రక్త ప్రవాహంలోకి కూడా ప్రవేశిస్తాయి.
- PM2.5 యొక్క అధిక స్థాయిలకు గురి కావడం వల్ల శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు, స్ట్రోక్, క్యాన్సర్ మరియు ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితులకు దారితీయవచ్చు.
- గాలి నాణ్యతను కొలిచేటప్పుడు, PM2.5 గాఢత స్థాయిలు సాధారణంగా ఒక క్యూబిక్ మీటర్ (m³) కు మైకోగ్రాము (μg) లలో నివేదించబడతాయి.
- క్యూబిక్ మీటర్ అంటే, ఒక మీటర్ పొడవు ఉండే భుజాలతో ఒక క్యూబ్ ఆకారంలో పెట్టెని ఊహించుకోండి. ఆ పెట్టెలో ఒక క్యూబిక్ మీటర్ వాల్యూమ్ ఉంది అనుకుంటే, ఇది 1000 లీటర్ల నీటికి సమానం.
- ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), PM2.5 యొక్క వార్షిక సగటు సాంద్రత ఒక క్యూబిక్ మీటరుకు 5 మైక్రోగ్రాములు (5 μg/m³) మించరాదని సిఫార్సు చేసింది.
World Air Quality Report-2022:
- 5వ ప్రపంచ వాయు నాణ్యత నివేదిక-2022ను మార్చి 14, 2023న విడుదల చేశారు.
- ఈ నివేదిక 2022 సంవత్సరానికి గాను ప్రపంచవ్యాప్తంగా గాలి నాణ్యత యొక్క స్థితిని సమీక్షిస్తుంది.
- ఈ నివేదికలో 131 దేశాలు, 116 దేశాల రాజధానులు మరియు 7,323 నగరాలకు ర్యాంకులను ఇచ్చారు.
- ఈ నివేదికలో ఉపయోగించిన డేటా 30,000 రెగ్యులేటరీ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లు మరియు తక్కువ-ధర గాలి నాణ్యత సెన్సార్ల నుండి సమగ్రపరచబడింది. ఈ పర్యవేక్షణ స్టేషన్లు మరియు సెన్సార్లను ప్రభుత్వ సంస్థలు, పరిశోధనా సంస్థలు, లాభాపేక్షలేని ప్రభుత్వేతర సంస్థలు, విశ్వవిద్యాలయాలు మరియు విద్యా సౌకర్యాలు, ప్రైవేట్ సంస్థలు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పౌర శాస్త్రవేత్తలు నిర్వహిస్తున్నారు.
- భారతదేశం అత్యంత కాలుష్య దేశాల ర్యాంకింగ్ లో 8వ స్థానంలో, రాజధాని ర్యాంకింగ్ లో 2వ స్థానంలో ఉంది. 50 అత్యంత కాలుష్య నగరాలలో 39 భారతదేశ నగరాలే ఉన్నాయి.
- World Air Quality Report 2022 (PDF)
- Source
World Air Quality Report 2022 | |||
---|---|---|---|
# | Rank | Country/ Capital/ City Name | PM2.5 concentration (μg/m³) |
అత్యంత కాలుష్య దేశాలు | 1 | Chad | 89.7 |
2 | Iraq | 80.1 | |
3 | Pakistan | 70.9 | |
8 | India | 53.3 | |
131 | Guam | 1.3 | |
అత్యంత కాలుష్య రాజధానులు | 1 | N’Djamena, Chad | 89.7 |
2 | New Delhi, India | 89.1 | |
3 | Baghdad, Iraq | 86.7 | |
116 | Canberra, Australia | 2.8 | |
అత్యంత కాలుష్య నగరాలు | 1 | Lahore, Pakistan | 97.4 |
2 | Hotan, China | 94.3 | |
3 | Bhiwadi, India | 92.7 | |
4 | Delhi, India | 92.6 | |
7323 | Arch Cape, USA | 0.2 |
* ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), PM2.5 యొక్క వార్షిక సగటు సాంద్రత ఒక క్యూబిక్ మీటరుకు 5 మైక్రోగ్రాములు (5 μg/m³) మించరాదని సిఫార్సు చేసింది.
వీటిని కూడా చూడండి:
- సూచికలు మరియు నివేదికలు (Indexes & Reports)
- జనరల్ స్టడీస్ (General Studies)
- ముఖ్యమైన దినోత్సవాలు (Important Days)